AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Zealand: బౌలర్ల ధాటికి బ్యాట్స్‌మెన్స్‌ విలవిల.. సింగిల్ డిజిట్‌కే 9 మంది పెవిలియన్.. అత్యల్ప స్కోర్‌కే ఆలౌట్..!

Martin Guptill: వేగంగా పరుగులు చేయడం ద్వారా స్కోరు బోర్డును పరుగులు పెట్టించాల్సిన జట్టు బౌలర్ల దెబ్బకు కుప్పకూలింది. జట్టు మొత్తం పూర్తి 20 ఓవర్లు కూడా ఆడలేదు..

New Zealand: బౌలర్ల ధాటికి బ్యాట్స్‌మెన్స్‌ విలవిల.. సింగిల్ డిజిట్‌కే 9 మంది పెవిలియన్.. అత్యల్ప స్కోర్‌కే ఆలౌట్..!
New Zealand
Follow us
Venkata Chari

|

Updated on: Dec 20, 2021 | 4:17 PM

New Zealand Cricket: టీ20 ఫార్మాట్‌లో వేగంగా ఆడడం చాలా ముఖ్యం. వేగంగా పరుగులు చేస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాల్సిన అవసరం చాలా ఉంటుంది. అయితే కొంతమంది ఇదే వేగంలో వికెట్లు కోల్పోతూ జట్టు స్కోర్‌ను తక్కువకే పరిమితం చేసేందుకు బాధ్యులు అవుతున్నారు. అయితే తాజాగా ఓ జట్టు పేకముక్కలాగా కుప్పకూలింది. మార్టిన్ గప్టిల్ లాంటి స్టార్లు ఉన్న జట్టు పరిస్థితి కూడా ఇలా తయారైందంటూ ఆశ్చర్యం కలగకమానదు. ఈ దృశ్యం న్యూజిలాండ్ క్రికెట్ లీగ్ సూపర్ స్మాష్‌లో కనిపించింది. ఇక్కడ రెండు జట్లు ఒకదానికొకటి తలపడుతున్నాయి. ఆక్లాండ్, నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ మధ్య జరిగిన మ్యాచులో ఈ సీన్ కనిపించింది.

ఈ మ్యాచ్‌లో ఆక్లాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. మార్టిన్ గప్టిల్ ఓపెనింగ్‌ బరిలో నిలిచాడు. జట్టుకు శుభారంభం అందించడమే గప్టిల్ పని. కానీ, వెంటవెంటనే రెండు వికెట్లు పడిపోవడంతో గప్టిల్ కూడా పెవిలియన్ బాట పట్టాడు. టీ20 మ్యాచ్‌కు విరుద్ధంగా జరిగిన ఈ మ్యాచులో గప్టిల్ 13 బంతుల్లో 4 పరుగులు మాత్రమే చేశాడు. ఈ మ్యాచ్‌లో రెండంకెల స్కోరును కూడా అందుకోని బ్యాట్స్‌మెన్స్ 9 మంది ఉన్నారంటే ఆశ్చర్యపోవాల్సిందే. అందరూ సింగిల్ డిజిట్‌లో మైదానం వీడడం కనిపించింది. దీంతో మొత్తం జట్టు 17.2 ఓవర్లు ఆడి 92 పరుగులకే ఆలౌటైంది. అంటే పూర్తి 20 ఓవర్లు కూడా ఆడలేకపోయింది.

7వ, 10వ నంబర్ బ్యాట్స్‌మెన్స్‌ నిలకడతో.. నార్తర్న్ డిస్ట్రిక్ట్ తరఫున అనురాగ్ వర్మ, ఫెడరిక్ వాకర్ చెరో 3 వికెట్లు తీశారు. కాగా, ఇష్ సోధి 2 ఓవర్లలో 5 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. ఆక్లాండ్ జట్టు 92 పరుగులకు ఎలా చేరుకుందని మీరు ఆశ్చర్యపోతున్నారని మాకు తెలుసు. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌లందరూ విఫలమవడంతో జట్టులోని 7వ నంబర్, 10వ నంబర్ బ్యాట్స్‌మెన్‌లు పరుగులు జోడించడంతో ఈ పని సులువైనట్లే అనిపించింది. 7వ స్థానంలో ఆడిన లాకీ ఫెర్గూసన్ 26 పరుగులు చేయగా, 10వ స్థానంలో ఉన్న బ్యాట్స్‌మెన్ బెంజమిన్ లిస్టర్ 17 పరుగులు చేశాడు.

15.1 ఓవర్లలో లక్ష్య ఛేదన.. నార్తర్న్ డిస్ట్రిక్ట్‌ ముందు 93 పరుగుల సులభమైన లక్ష్యం ఉంది. ఈ లక్ష్యాన్ని 16వ ఓవర్‌లో 4 వికెట్లు కోల్పోయి సులువుగా సాధించింది. ఈ మ్యాచ్‌లో 29 బంతులు మిగిలి ఉండగా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. నార్తర్న్ డిస్ట్రిక్ట్ తరపున వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్ టిమ్ సీఫెర్ట్ 42 బంతుల్లో 38 నాటౌట్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆక్లాండ్ తరఫున అత్యంత విజయవంతమైన బౌలర్ సీన్ సోలియా 3 ఓవర్లలో 16 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.

సూపర్ స్మాష్ లీగ్‌లో 4 మ్యాచ్‌ల్లో నార్తర్న్ డిస్ట్రిక్ట్స్‌కు ఇది రెండో విజయం. అదే సమయంలో, ఇప్పటివరకు ఆడిన 2 మ్యాచ్‌ల్లో ఆక్లాండ్‌కి రెండో ఓటమిగా మారింది.

Also Read: IND vs SA: వికెట్ల రేసులో పోటీపడుతోన్న ఇద్దరు భారత బౌలర్లు.. అగ్రస్థానంలో నిలిచేదెవరో?

Ashes Series: అడిలైడ్‎ టెస్ట్‎లో కరోనా కలకలం.. ఆటగాళ్లకు కోవిడ్ సోకలేదు కానీ..