Ashes Series: అడిలైడ్‎ టెస్ట్‎లో కరోనా కలకలం.. ఆటగాళ్లకు కోవిడ్ సోకలేదు కానీ..

యాషెస్ సిరీస్‎​లో భాగంగా అడిలైడ్‎ ఓవల్‌లో జరుగుతున్న రెండో టెస్ట్‎లో కరోనా కలకలం సృష్టించింది. ఈ డేనైట్ మ్యాచ్‎ కోసం పని చేస్తున్న బ్రాడ్​కాస్ట్ సిబ్బందిలో...

Ashes Series: అడిలైడ్‎ టెస్ట్‎లో కరోనా కలకలం.. ఆటగాళ్లకు కోవిడ్ సోకలేదు కానీ..
Corona
Follow us

|

Updated on: Dec 19, 2021 | 2:02 PM

యాషెస్ సిరీస్‎​లో భాగంగా అడిలైడ్‎ ఓవల్‌లో జరుగుతున్న రెండో టెస్ట్‎లో కరోనా కలకలం సృష్టించింది. ఈ డేనైట్ మ్యాచ్‎ కోసం పని చేస్తున్న బ్రాడ్​కాస్ట్ సిబ్బందిలో ఒకరు కోవిడ్ బారిన పడ్డారు. ప్రస్తుతం అతడు ఐసోలేషన్‎లో ఉన్నాడు. ఈ విషయాన్ని గ్రౌండ్ అధికారులు తెలిపారు. అయితే ఆటగాళ్లు ఎవరికి వైరస్ సోకలేదని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొంది. ఈ టెస్ట్ జరుగుతుందని స్పష్టం చేసింది.

“యాషెస్ రెండో టెస్టు కోసం పనిచేస్తున్న బ్రాడ్​కాస్ట్ సిబ్బందిలో ఒకరికి కోవిడ్ వచ్చింది. ఈ విషయంలో విచారణ జరిపి అతడికి దగ్గరగా ఉన్నవారిని ఐసోలేషన్‎​కు పంపించాం. అలాగే ఆ ప్రదేశాన్నంతటినీ శానిటైజ్ చేశాం” అని అడిలైడ్ మైదాన అధికారులు తెలిపారు. కరోనా సోకిన వ్యక్తితో కాంటాక్ట్‎​లో ఉన్న కారణంగా ఆస్ట్రేలియా కెప్టెన్​ ప్యాట్ కమిన్స్ రెండో టెస్టుకు దూరమయ్యాడు. ప్రస్తుతం అతడు ఐసోలేషన్‎​లో ఉన్నాడు.

కాగా ఈ మ్యాచ్‎ ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‎లో 9 వికెట్లు కోల్పోయి 473 పరుగుల వద్ద డిక్లెర్ చేసింది. వార్నర్95, లాంబ్‎చంగే 103, స్టివ్ స్మీత్ 93 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో స్టాక్స్ మూడు వికెట్ల, అండ్రూసన్ రెండు వికెట్ల తీయగా.. బ్రాడ్, వోక్స్, రాబిన్సన్, రూట్ తలో వికెట్ పడగొట్టారు. ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‎లో 236 పరుగులకు ఆలౌట్ అయింది. మలన్ 80, రూట్ 62 పరుగులు చేశాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 4 వికెట్లు, లియాన్ మూడ వికెట్లు పడగొట్టగా గ్రీన్ 2 వికెట్లు, నెసెర్ ఒక వికెట్ తీశారు. 468 పరుగుల విజయ లక్ష్యంతో ఇంగ్లాండ్ బరిలో దిగనుంది. ఈ మ్యాచ్‎లో ఇంగ్లాండ్ గెలిస్తే సిరిస్ 1-1తో సమం అవుతుంది. ఆసీస్ గెలిస్తే సిరీస్ 2-1లీడ్‎లో ఉంటుంది.

Read Also.. Ashes Series: ఫాస్ట్ బౌలర్ స్పిన్ వెస్తే ఎలాగుంటదో తెలుసా.. వైరల్ అయిన వీడియో..

Latest Articles
కోహ్లితోపాటు స్టార్ స్పోర్ట్స్‌పై విమర్శలు గుప్పించిన గవాస్కర్
కోహ్లితోపాటు స్టార్ స్పోర్ట్స్‌పై విమర్శలు గుప్పించిన గవాస్కర్
పవన్ జల్సా మూవీ హీరోయిన్ ఇంతగా మారిపోయిందేంటీ..?
పవన్ జల్సా మూవీ హీరోయిన్ ఇంతగా మారిపోయిందేంటీ..?
రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఆ ఐదు కిలోమీటర్ల పరిధి ఎత్తివేత..
రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఆ ఐదు కిలోమీటర్ల పరిధి ఎత్తివేత..
అబ్బాయిలతో ఫోన్‌ మట్లాడొద్దని మందలించినందుకు..అన్నను చంపిన చెల్లి
అబ్బాయిలతో ఫోన్‌ మట్లాడొద్దని మందలించినందుకు..అన్నను చంపిన చెల్లి
ఉర్ఫీ మ్యాజికల్ బట్టర్ ఫ్లై డ్రెస్ పై సమంత కామెంట్స్..
ఉర్ఫీ మ్యాజికల్ బట్టర్ ఫ్లై డ్రెస్ పై సమంత కామెంట్స్..
ఫిక్స్‌డ్ డిపాజిట్ నుంచి నెలవారీ వడ్డీని ఎలా పొందాలి ?
ఫిక్స్‌డ్ డిపాజిట్ నుంచి నెలవారీ వడ్డీని ఎలా పొందాలి ?
ఎంఐఎం - కాంగ్రెస్ కార్యకర్తల మధ్య కత్తుల దాడి.. ఒకరు మృతి
ఎంఐఎం - కాంగ్రెస్ కార్యకర్తల మధ్య కత్తుల దాడి.. ఒకరు మృతి
స్కూల్‌కు లేట్‌గా వచ్చిందని.. టీచర్‌పై ప్రిన్సిపాల్‌ దాడి
స్కూల్‌కు లేట్‌గా వచ్చిందని.. టీచర్‌పై ప్రిన్సిపాల్‌ దాడి
జియోలో వార్షిక రీఛార్జ్‌ ప్లాన్స్‌ ఎలా ఉన్నాయో తెలుసా..? హైస్పీడ్
జియోలో వార్షిక రీఛార్జ్‌ ప్లాన్స్‌ ఎలా ఉన్నాయో తెలుసా..? హైస్పీడ్
దేవర ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
దేవర ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..