- Telugu News Photo Gallery Cricket photos IND vs SA: Most Test wicket by current Team India Bowlers in South Africa, Shami and Ishant lead the battle in Ind vs SA test Series
IND vs SA: వికెట్ల రేసులో పోటీపడుతోన్న ఇద్దరు భారత బౌలర్లు.. అగ్రస్థానంలో నిలిచేదెవరో?
India Vs South Africa 2021: ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న టీమిండియా డిసెంబర్ 26 నుంచి తొలి టెస్ట్ ఆడనుంది. అయితే ప్రస్తుతం టీంలో ఉన్న ఏ బౌలర్ కూడా అక్కడ అత్యధిక టెస్టు వికెట్లు పడగొట్టలేదు.
Updated on: Dec 20, 2021 | 3:58 PM

దక్షిణాఫ్రికాలో అత్యధిక టెస్టు వికెట్లు తీసిన భారత బౌలర్ ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం అడిగితే పేరు అనిల్ కుంబ్లే పేరు వినిపిస్తుంది. ఈ లెగ్ స్పిన్నర్, భారత క్రికెట్ తరుపున దక్షిణాఫ్రికాలో 45 వికెట్లు పడగొట్టి అగ్రస్థానంలో నిలిచాడు. కానీ, ఇది గతం. ప్రస్తుతం దక్షిణాఫ్రికా టూర్‌లో ఉన్న భారత్‌లో అత్యధిక టెస్టు వికెట్లు పడగొట్టిన జాబితాను ఓసారి పరిశీలిద్దాం.

ప్రస్తుతం టీమిండియా బౌలర్లలో సౌతాఫ్రికాలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్లలో మహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మల మధ్య పోటీ నెలకొంది. వీరిద్దరి మధ్య దూరం కేవలం ఒక వికెట్ మాత్రమే. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి వీరి మధ్య వికెట్ల రేసు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.

ప్రస్తుత భారత బౌలర్లలో మహ్మద్ షమీ క్షిణాఫ్రికాలో అత్యధిక టెస్టు వికెట్లు తీసిన జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. అతను 5 మ్యాచ్‌ల్లో 24.71 సగటుతో 21 వికెట్లు పడగొట్టాడు. అందులో ఓ సారి 28 పరుగులకు 5 వికెట్లు పడగొట్టాడు.

ఇషాంత్ శర్మ కూడా తగ్గేదేలే అంటూ షమీతో పోటీపడుతున్నాడు. దక్షిణాఫ్రికాలో ఆడిన 7 టెస్టుల్లో 40 సగటుతో 20 వికెట్లు పడగొట్టాడు. 79 పరుగులకు 4 వికెట్లు తీసి అత్యుత్తమ రికార్డు అందుకున్నాడు. అంటే షమీ, ఇషాంత్‌ల మధ్య గ్యాప్ కేవలం ఒక వికెట్ మాత్రమే ఉంది.

షమీ, ఇషాంత్‌ల తరువాతి స్థానంలో జస్ప్రీత్ బుమ్రా నిలిచాడు. అక్కడ ఆడిన 3 టెస్టుల్లో 14 వికెట్లు పడగొట్టాడు. వీరిద్దరి కంటే మెరుగైన ప్రదర్శన చేస్తే వికెట్ల రేసులో షమీ, ఇషాంత్‌లకు చేరువయ్యే అవకాశం ఉంది.

ప్రస్తుత టీమ్ ఇండియాకు చెందిన ముగ్గురు ఫాస్ట్ బౌలర్ల తరువాత స్పిన్నర్ ఆర్. అశ్విన్ నిలిచాడు. ఇప్పటివరకు అక్కడ ఆడిన 3 టెస్టుల్లో 7 వికెట్లు పడగొట్టాడు.




