- Telugu News Photo Gallery Cricket photos Pakistan Cricket Team: FIR filed in Rape case against pakistan leg spinner yasir shah and his friend
Pakistan Cricket Team: మైనర్‌పై అత్యాచారం.. పాకిస్తాన్ స్పిన్నర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు..!
పాకిస్థాన్ లెగ్ స్పిన్నర్ యాసిర్ షా చిక్కుల్లో పడ్డాడు. ఇస్లామాబాద్‌లో అతనిపై అత్యాచారం కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. యాసిర్ షాపై 14 ఏళ్ల బాలిక తీవ్ర ఆరోపణలు చేసింది.
Updated on: Dec 20, 2021 | 8:29 PM

పాకిస్థాన్ లెగ్ స్పిన్నర్ యాసిర్ షా చిక్కుల్లో పడ్డాడు. ఇస్లామాబాద్‌లో అతనిపై అత్యాచారం కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. యాసిర్ షాపై 14 ఏళ్ల బాలిక తీవ్ర ఆరోపణలు చేసింది. పాక్ మీడియా ప్రకారం, యాసిర్ షా స్నేహితుడు ఫర్హాన్‌పై కూడా కేసు నమోదు చేశారు.

ఫర్హాన్, యాసిర్ షా తనను వేధించారని 14 ఏళ్ల బాలిక ఆరోపించింది. యాసిర్ షా అమ్మాయిని ఫోన్‌లో బెదిరించి తన స్నేహితుడు ఫర్హాన్‌ను పెళ్లి చేసుకోవాలని కోరినట్లు ఆరోపణలు వచ్చాయి.

యాసిర్ షాపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు ధృవీకరించారు. అదే సమయంలో, ఆరోపించిన బాలికకు త్వరలో వైద్య పరీక్షలు నిర్వహించి, ఆ తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

35 ఏళ్ల యాసిర్ షా పాకిస్థాన్ దిగ్గజ స్పిన్నర్లలో ఒకరు. ఈ ఆటగాడు 46 టెస్టుల్లో 235 వికెట్లు తీశాడు. అలాగే యాసిర్ 25 వన్డేల్లో 24 వికెట్లు పడగొట్టాడు.

ఇంత తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్న పాక్ క్రికెటర్లు చాలామందే ఉన్నారు. పాక్ కెప్టెన్ బాబర్ ఆజం, మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్‌పై కూడా ఇలాంటి తీవ్ర ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ ఆరోపణలు రుజువు కాలేదు.





























