- Telugu News Photo Gallery Cricket photos IND vs SA: 5 Strength of Indian Bowlers to help Team India to win Test Series in South Africa
IND vs SA: ఈ 5 బలాలు భారత బౌలర్లకే సొంతం.. దక్షిణాఫ్రికాలో సత్తా చాటేందుకు సిద్ధమంటోన్న పేస్, స్పిన్ దిగ్గజాలు..!
India Vs South Afrcia 2021: కెప్టెన్ విరాట్ కోహ్లీ మాటల్లో చెప్పాలంటే.. టెస్టు మ్యాచ్ గెలవాలంటే 20 వికెట్లు తీయాల్సిందే. బౌలర్లు వికెట్లు పడగొడితేనే గెలవగలం. అంటే టెస్టుల్లో బ్యాట్స్‌మెన్స్ కంటే బౌలర్ల పాత్రే చాలా కీలకం.
Updated on: Dec 21, 2021 | 2:57 PM

కెప్టెన్ విరాట్ కోహ్లీ మాటల్లో చెప్పాలంటే.. టెస్టు మ్యాచ్ గెలవాలంటే 20 వికెట్లు తీయాల్సిందే. బౌలర్లు ఈ వికెట్లు పడగొడితేనే మ్యాచుల రూపురేఖలు మారిపోతాయి. అంటే టెస్టుల్లో బ్యాట్స్‌మెన్స్ కంటే బౌలర్ల పాత్ర చాలా కీలకం కానుంది. ప్రస్తుత దక్షిణాఫ్రికా పర్యటనలో, భారత్ తన పేస్, స్పిన్ అద్భుతమైన దాడితో సిద్ధమైంది. భారత్ బౌలింగ్ బలంగా ఉంది. ఈ శక్తి గత 3 సంవత్సరాలలో పుష్కలంగా రాణిస్తోంది. ప్రస్తుతం ఇది దక్షిణాఫ్రికాలో కూడా తన సత్తా చాటేందుకు సిద్ధమైంది. టెస్టు సిరీస్‌లో దక్షిణాఫ్రికాకు ఇబ్బందిగా మారగల భారత బౌలర్ల 5 బలమైన పాయింట్లను ఇప్పుడు చూద్దాం. టీమిండియా విజయానికి గ్యారెంటీ గురించి తెలుసుకుందాం.

2018 నుంచి ఇప్పటి వరకు టెస్టుల్లో భారత బౌలర్లు 687 వికెట్లు తీశారు. వికెట్ల రేసులో, ఈ కాలంలో భారత బౌలర్ల కంటే ఇంగ్లండ్ బౌలర్లు మాత్రమే ముందున్నారు. అంటే, విరాట్ అండ్ కంపెనీ బౌలర్లు గత 3 ఏళ్లలో అత్యధిక టెస్టు వికెట్లు తీయడంలో నంబర్ 2 స్థానంలో ఉన్నారు.

2018 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు భారత బౌలర్ల బౌలింగ్ సగటు 23.42గా ఉంది. ఇది ప్రపంచంలోని ఏ జట్టు బౌలర్లలోనైనా అత్యుత్తమంగా ఉంది. ఈ విషయంలో దక్షిణాఫ్రికా బౌలర్లు రెండో స్థానంలో ఉన్నారు.

2018 నుంచి భారత బౌలర్ల స్ట్రైక్ రేట్ 49.3గా ఉంది. ప్రపంచ క్రికెట్‌లో ఈ కాలంలో బౌలర్ల స్ట్రైక్ రేట్ 50 కంటే తక్కువ ఉన్న ఏకైక జట్టు ఇదే.

2018 నుంచి భారత బౌలర్లు 2.84 ఎకానమీ వద్ద పరుగులు సాధించారు. మెరుగైన ఎకానమీ రేటు పరంగా, న్యూజిలాండ్ బౌలర్ల కంటే వెనుకంజలో ఉన్నారు.

భారత బౌలర్లు 2018 నుంచి ఇప్పటి వరకు 28 సార్లు టెస్టుల్లో 5 వికెట్లు తీసి అద్భుతాలు చేశారు. ఈ విషయంలో ప్రపంచ క్రికెట్‌లో అగ్రగామిగా నిలిచారు. ఇంగ్లండ్ బౌలర్లు 25 సార్లు 5 వికెట్లు తీసి రెండో స్థానంలో ఉన్నారు.




