- Telugu News Photo Gallery Cricket photos India Vs South Afrcia 2021: The longest that any India player has batted in South Africa in Tests is Team India former player Rahul Dravid for 541 minutes
362 బంతుల్లో 148 పరుగులు.. 541 నిమిషాల సుధీర్ఘ బ్యాటింగ్.. 14 ఏళ్లుగా తిరుగులేని ద్రవిడ్ రికార్డుకు బ్రేకులు?
Rahul Dravid: క్రికెట్‌లో రికార్డులు ఒక్క క్షణంలో సృష్టించబడవు. వీటిని నెలకొల్పేందుకు సమయం పడుతుంది. రాహుల్ ద్రవిడ్ దక్షిణాఫ్రికాలో 9 గంటల సమయంలో ఓ అద్భుత రికార్డు నెలకొల్పాడు.
Updated on: Dec 21, 2021 | 4:49 PM

క్రికెట్‌లో రికార్డులు ఒక్క క్షణంలో సృష్టించబడవు. వీటిని నెలకొల్పేందుకు సమయం పడుతుంది. రాహుల్ ద్రవిడ్ దక్షిణాఫ్రికాలో 9 గంటల సమయంలో ఓ అద్భుత రికార్డు నెలకొల్పాడు. అంటే టీమిండియా ప్రధాన కోచ్, మాజీ బ్యాట్స్‌మెన్ రాహుల్ ద్రవిడ్ దక్షిణాఫ్రికాలో రికార్డు సృష్టించడానికి 541 నిమిషాలు అంటే 9 గంటల సమయం తీసుకున్నాడు.

రాహుల్ ద్రవిడ్ ఈ రికార్డు టీమిండియా 14 ఏళ్ల దక్షిణాఫ్రికా పర్యటనకు సంబంధించినది. 1997లో జరిగిన టెస్టు సిరీస్‌లో మూడో మ్యాచ్‌లో ద్రవిడ్ ఆ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఆ మ్యాచ్‌ని డ్రా చేయడంలో కీలక పాత్ర పోషించాడు.

దక్షిణాఫ్రికాలో సుదీర్ఘ టెస్టు ఇన్నింగ్స్ ఆడిన భారత బ్యాట్స్‌మెన్‌గా ఇదే రికార్డు ఇప్పటి వరకు నిలిచింది. రాహుల్ ద్రవిడ్ 541 నిమిషాల పాటు బ్యాటింగ్ చేసి 1997 పర్యటనలో మూడో టెస్టు మ్యాచ్‌ను డ్రా చేసుకున్నాడు. ఆ 9 గంటల బ్యాటింగ్‌లో ద్రవిడ్ 362 బంతులు ఆడాడు. ఇది దక్షిణాఫ్రికాలో ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యధిక బంతులు ఆడిన భారత రికార్డుగాను నెలకొంది. ఈ 362 బంతుల్లో ద్రవిడ్ 148 పరుగులు చేశాడు.

దక్షిణాఫ్రికాలో ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యధిక డెలివరీలు ఆడిన రెండో బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్. 2011 పర్యటనలో 314 బంతుల్లో 146 పరుగులు చేశాడు.

దీనికి ముందు 1992 దక్షిణాఫ్రికా పర్యటనలో ప్రవీణ్ ఆమ్రే ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో 299 బంతులు ఆడి 103 పరుగులు చేశాడు. ఇది ఆమ్రేకి అరంగేట్రం మ్యాచ్.

2001 దక్షిణాఫ్రికా పర్యటనలో, దీప్దాస్ గుప్తా ఒక టెస్ట్ ఇన్నింగ్స్‌లో 281 బంతులు ఆడి, 63 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికాలో ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యధిక బంతులు ఆడుతున్న భారతీయుల జాబితాలో అతను నాలుగో స్థానంలో ఉన్నాడు.

362 బంతులు ఆడి 541 నిమిషాల పాటు బ్యాటింగ్ చేసిన రాహుల్ ద్రవిడ్ రికార్డు 14 ఏళ్ల నాటిది. ఈసారి ద్రవిడ్ జట్టు ప్రధాన కోచ్‌గా దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్నాడు. అటువంటి పరిస్థితిలో, అతను విరాట్, పుజారా లేదా మరే ఇతర భారత బ్యాట్స్‌మెన్ అయినా తన రికార్డును బద్దలు కొట్టడానికి ఎక్కువసేపు ఆడాలని ఆశిస్తాడు.




