Video: తండ్రి వైఫల్యంతో దేశం విడిచి వెళ్లాడు.. కట్‌చేస్తే.. తిరిగొచ్చి కోహ్లీ కెరీర్‌ని ప్రమాదంలో పడేశాడు..

O'Rourke: సుమారు 10-11 నెలల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ఈ 23 ఏళ్ల ఫాస్ట్ బౌలర్.. తన 6 అడుగుల 4 అంగుళాల పొడవుతో న్యూజిలాండ్ బౌలింగ్‌కు ప్రాణం పోశాడు. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్లను బెంబేలెత్తించే పిచ్ లపైనే కాకుండా శ్రీలంకలాంటి క్లిష్ట మైదానాల్లోనూ విల్ ఓరూర్క్ ఆకట్టుకున్నాడు.

Video: తండ్రి వైఫల్యంతో దేశం విడిచి వెళ్లాడు.. కట్‌చేస్తే.. తిరిగొచ్చి కోహ్లీ కెరీర్‌ని ప్రమాదంలో పడేశాడు..
New Zealand Fast Bowler O'r
Follow us

|

Updated on: Oct 18, 2024 | 8:15 AM

IND vs NZ: గత కొన్నేళ్లుగా జరుగుతున్నదే మరోసారి రోహిత్ సేనకు చోటు చేసుకుంది. టీమిండియాతో జరిగిన తొలి మ్యాచ్‌లోనే మరోసారి కొత్త ఆటగాడు విధ్వంసం సృష్టించాడు. కేవలం 4 సంవత్సరాల తర్వాత, న్యూజిలాండ్‌కు చెందిన మరో ఫాస్ట్ బౌలర్ టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌ను నాశనం చేశాడు. 2020లో కైల్ జామీసన్ చేసిన అదే పనిని.. ఇప్పుడు విలియం ఓ’రూర్కే 2024లో పూర్తి చేశాడు. బెంగళూరు వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో షాక్‌లు మీద షాక్‌లు ఇస్తూ టీమిండియాను కేవలం 46 పరుగులకే ఆలౌట్ చేయడంలో ఈ పొడవాటి ఫాస్ట్ బౌలర్ కీలక పాత్ర పోషించాడు. ఇందులోనూ ఓ రూర్కే వేసిన తొలి ఓవర్‌లోనే ఔటైన స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీదే అత్యంత ప్రత్యేకమైన వికెట్ అని నిరూపించాడు. ఇంతకీ ఈ 23 ఏళ్ల బౌలర్ ఎవరు? అతని క్రికెట్ కెరీర్ ఎలా మొదలైంది?

తొలి ఓవర్‌లోనే కోహ్లి బలి..

ముందుగా బెంగళూరులో ఈ బౌలర్ చేసిన విధ్వంసం గురించి చెప్పుకుందాం. ఈ 6 అడుగుల 4 అంగుళాల పొడవైన ఫాస్ట్ బౌలర్ ఈ సంవత్సరం అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఇది భారతదేశంలో అతని మొదటి మ్యాచ్. ఈ పేసర్ తన తొలి ఓవర్‌లోనే విరాట్ కోహ్లీని పేస్, సీమ్, బౌన్స్‌లతో భయపెట్టాడు. అతను మొదట ఆఫ్ స్టంప్ వెలుపల గుడ్ లెంగ్త్‌లో బంతిని నిరంతరంగా బాల్స్ విసురుతూనే ఉన్నాడు. ఈ క్రమంలో కోహ్లీ కొద్దిసేపు డిఫెండ్ చేసినా.. ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. ఈ క్రమంలో కివీస్ పేసర్ పదునైన షార్ట్ ఆఫ్ లెంగ్త్ బంతిని బౌల్ సంధించాడు. అది కోహ్లి శరీరం వైపు వేగంగా పిచ్ అయింది. దీని కారణంగా కింగ్ కోహ్లీ షాక్ అయ్యాడు. డిఫెండ్ చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో బంతి గ్లోవ్స్‌కు తగిలి లెగ్ స్లిప్ ఫీల్డర్ చేతుల్లోకి వెళ్లింది.

తొలి ఓవర్‌లోనే కోహ్లి లాంటి దిగ్గజం వికెట్‌ తీసిన ఓ’రూర్కే.. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, ఆ తర్వాత జస్ప్రీత్ బుమ్రా వికెట్లను కూడా తీశాడు. ఓవరాల్‌గా 12 ఓవర్లలో 6 మెయిడిన్లు తీసిన ఓ రూర్కే కేవలం 22 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అతను 5 వికెట్లు తీయలేకపోయాడు. కానీ, తన ప్రభావాన్ని టీమిండియాకు చూపించాడు.

క్రికెట్ నా రక్తంలో ఉంది: ఓ’రూర్కే

ఓ’రూర్కేకు ఫాస్ట్ బౌలింగ్ అతని రక్తంలో ప్రవహిస్తుందని అనిపిస్తుంది. ఎందుకంటే విల్ తండ్రి, అతని మేనమామ కూడా న్యూజిలాండ్‌లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడారు. ఇందులో కూడా, అతని తండ్రి ప్యాట్రిక్ ఓ’రూర్కే వెల్లింగ్టన్ జట్టులో ఫాస్ట్ బౌలర్. 1989 నుంచి 1993 వరకు న్యూజిలాండ్ దేశవాళీ క్రికెట్‌లో కూడా చురుకుగా ఉన్నాడు.

ఓ’రూర్కే వాస్తవానికి న్యూజిలాండ్‌కు చెందినవాడు. ఓ’రూర్కే తల్లిదండ్రులు క్రికెట్‌లో తమ కెరీర్‌లో విఫలమైన కారణంగా బ్రిటన్‌కు వెళ్లారు. 2001లో ఇక్కడే విల్ జన్మించాడు. సుమారు 5 సంవత్సరాలు లండన్‌లో నివసించిన తరువాత, విల్ తన తల్లిదండ్రులతో బ్రిటన్‌ను విడిచిపెట్టి న్యూజిలాండ్‌కు తిరిగి వచ్చాడు. ఇక్కడ మళ్లీ క్రమంగా తన తండ్రి బాటలోనే నడుస్తూ క్రికెట్‌పై దృష్టి సారించాడు. అతను 2020 అండర్-19 ప్రపంచ కప్‌లో కూడా భాగమయ్యాడు. ఇక్కడ టీమ్ ఇండియా తరపున యశస్వి జైస్వాల్ కూడా ఆడాడు.

ఫాస్ట్ బౌలింగ్‌లో మెలకువలు నేర్పిన జామీసన్‌..

విలియం దేశీయ లిస్ట్-A, ఫస్ట్-క్లాస్ కెరీర్ 2021లో కాంటర్‌బరీతో ప్రారంభమైంది. టీ20, లిస్ట్-ఏ క్రికెట్‌లో ఆకట్టుకున్న ఈ యువ బౌలర్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోనూ తన సత్తా చాటాడు. ఇక్కడే అతను కాంటర్‌బరీకి చెందిన తన సహచర ఫాస్ట్ బౌలర్ కైల్ జేమీసన్‌తో కలిసి బౌలింగ్ చేసే అవకాశం పొందాడు. ఓ’రూర్కే 6 అడుగుల 4 అంగుళాల పొడవు ఉంటే, జామీసన్ 6 అడుగుల 8 అంగుళాల పొడవు. ఇటువంటి పరిస్థితిలో, అతని ఎత్తును సద్వినియోగం చేసుకుంటూ పవర్‌ఫుల్ బౌలింగ్ చేయడంలో విలియమ్‌కు జేమీసన్ చాలా సహాయం చేశాడు. దేశవాళీలో ఆకట్టుకున్న తర్వాత, ఓ’రూర్క్‌కి డిసెంబర్ 2023లో న్యూజిలాండ్ తరపున వన్డే, 2024 ఫిబ్రవరిలో టెస్టు, ఏప్రిల్‌లో టీ20లో అరంగేట్రం చేసే అవకాశం లభించింది. తన తొలి టెస్టులోనే దక్షిణాఫ్రికాపై రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 9 వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్ చరిత్రలో రికార్డు సృష్టించాడు. భారత్‌కు రాకముందు, విలియం శ్రీలంకలో ఒక ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..