IND vs NZ: కెప్టెన్‌పై బీసీసీఐ షాకింగ్ న్యూస్.. న్యూజిలాండ్‌తో తలపడే భారత జట్టులో కీలక మార్పులు..

IND vs NZ: ఉమెన్స్ టీ20 ప్రపంచకప్ నుంచి టీమిండియా గ్రూప్ దశ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్‌పై ఎన్నో విమర్శలు వచ్చాయి. కెప్టెన్సీ నుంచి తొలగించాలని డిమాండ్లు వినిపించాయి. ఈ క్రమంలో బీసీసీఐ న్యూజిలాండ్ సిరీస్‌తో హర్మన్ ప్రీత్‌పై కీలక నిర్ణయం తీసుకుంది.

IND vs NZ: కెప్టెన్‌పై బీసీసీఐ షాకింగ్ న్యూస్.. న్యూజిలాండ్‌తో తలపడే భారత జట్టులో కీలక మార్పులు..
Harmanpreet Kaur From Team
Follow us

|

Updated on: Oct 18, 2024 | 7:27 AM

IND vs NZ: న్యూజిలాండ్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు భారత మహిళల జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ సిరీస్‌కు హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీపై కూడా బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా గ్రూప్‌ స్టేజ్‌లోనే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. హర్మన్‌ప్రీత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించాలనే డిమాండ్‌ తెరపైకి వచ్చింది. ఆమెను కెప్టెన్సీ నుంచి తప్పించాలంటూ సర్వత్రా చర్చ జరిగింది.

వీటన్నింటి మధ్య, BCCI న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ కోసం ఆమెపై విశ్వాసం వ్యక్తం చేసింది. ఆమెనే కెప్టెన్సీగా కొనసాగించాలని నిర్ణయించుకుంది. స్టార్ ప్లేయర్ పూజా వస్త్రాకర్ సహా ముగ్గురు ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చింది. పూజతో పాటు రిచా ఘోష్, ఆశా శోభనలకు కూడా వన్డే సిరీస్‌ నుంచి విశ్రాంతినిచ్చారు.

భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, హేమలత, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, యాస్తికా భాటియా (వికె), ఉమా ఛెత్రి (వికె), సయాలీ సత్‌గారే, అరుంధతీ రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, తేజల్ హస్బ్నిస్, సైమా ఠాకోర్, ప్రియా మిశ్రా, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్.

పరీక్షల కారణంగా అందుబాటులో లేని రిచా..

రిచా 12వ తరగతి పరీక్షల కారణంగా ఎంపికకు అందుబాటులో లేదు. కాగా ఆశా శోభన గాయపడి కోలుకుంటుంది. ప్రియా మిశ్రా, సయాలీ సత్‌గారే, సైమా ఠాకూర్, తేజల్ హస్బ్నిస్ జట్టులో కొత్త ముఖాలు.

భారత్-న్యూజిలాండ్ సిరీస్ షెడ్యూల్..

అక్టోబర్ 24 నుంచి భారత్, న్యూజిలాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. సిరీస్ మొత్తం అహ్మదాబాద్‌లో జరగనుంది. రెండో మ్యాచ్ అక్టోబర్ 27న, మూడో మ్యాచ్ అక్టోబర్ 29న జరగనుంది.

టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ ప్రదర్శన..

హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని టీమిండియా ప్రయాణం టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్ దశలోనే ముగిసింది. నాలుగు మ్యాచ్‌లు ఆడిన భారత జట్టు రెండు విజయాలు, రెండు ఓటములతో గ్రూప్‌-ఎలో మూడో స్థానంలో నిలిచింది. ఈ గ్రూప్ నుంచి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు సెమీఫైనల్‌కు అర్హత సాధించాయి. హర్మన్‌ప్రీత్ నాలుగు మ్యాచ్‌ల్లో రెండింట్లో హాఫ్ సెంచరీలు సాధించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..