T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో సంచలనం.. 6 సార్లు ఛాంపియన్ జట్టుకు బిగ్ షాక్..

Women's T20 World Cup 2024: ఆస్ట్రేలియా T20 ప్రపంచ కప్ టైటిల్‌ను వరుసగా 3 సార్లు గెలుచుకుంది. మొత్తం 6 సార్లు T20 ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. కానీ, ఇప్పుడు దక్షిణాఫ్రికా జట్టు అద్భుతమైన ఆటతీరుతో ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ ఇచ్చి, వరుసగా రెండవసారి ఫైనల్స్‌కు చేరుకుంది.

T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో సంచలనం.. 6 సార్లు ఛాంపియన్ జట్టుకు బిగ్ షాక్..
South Africa Beats Australi
Follow us
Venkata Chari

|

Updated on: Oct 18, 2024 | 6:33 AM

T20 World Cup: UAEలో జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్ 2024లో షాకింగ్ ఫలితం కనిపించింది. టోర్నీ తొలి సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికా 8 వికెట్ల తేడాతో ప్రస్తుత ఛాంపియన్ ఆస్ట్రేలియాను ఏకపక్షంగా ఓడించింది. దీంతో ప్రపంచకప్‌ నుంచి ఆస్ట్రేలియాను మట్టికరిపించి దక్షిణాఫ్రికా ఫైనల్‌కు చేరి చరిత్ర సృష్టించింది. బలమైన బౌలింగ్ ఆధారంగా దక్షిణాఫ్రికా 6-సార్లు ఛాంపియన్, 3 వరుస టైటిళ్లను గెలుచుకున్న జట్టుకు భారీ షాక్ ఇచ్చింది. ఆస్ట్రేలియాను కేవలం 134 పరుగులకే పరిమితం చేసింది. ఆ తర్వాత, అన్నేకా బోష్ (74 నాటౌట్), కెప్టెన్ లారా వూల్‌వర్త్ (42) అద్భుతమైన ఇన్నింగ్స్‌ల ఆధారంగా, దక్షిణాఫ్రికా 18వ ఓవర్‌లోనే మ్యాచ్‌ను గెలుచుకుంది. ఆస్ట్రేలియాతో గత ఏడాది ప్రపంచకప్ ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది.

దుబాయ్ వేదికగా జరిగిన ప్రపంచకప్ తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో గాయపడిన ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ అలిస్సా హీలీ లేకుండానే మరోసారి బరిలోకి దిగింది. దీని ప్రభావం ఆస్ట్రేలియా బ్యాటింగ్‌పై మరోసారి స్పష్టంగా కనిపించింది. పవర్‌ప్లేలో వేగంగా బ్యాటింగ్ చేయడంలో జట్టు విఫలమైంది. ఓపెనర్ బెత్ మూనీ 44 పరుగుల ఇన్నింగ్స్ ఆడింది. అయితే, ఆమె ఇన్నింగ్స్ కూడా చాలా నెమ్మదిగా సాగడంతో జట్టు భారీ స్కోర్ చేయడంలో విఫలమైంది. అయితే, కెప్టెన్‌గా ఉన్న తహ్లియా మెక్‌గ్రాత్ 33 బంతుల్లో 27 పరుగులు మాత్రమే చేయగలిగింది. అలిస్ పెర్రీ, ఫోబ్ లిచ్‌ఫీల్డ్‌ల ఫాస్ట్ ఇన్నింగ్స్‌ల ఆధారంగా ఆస్ట్రేలియా జట్టు 134 పరుగులకు ఆలౌటైంది.

దక్షిణాఫ్రికా తరపున స్టార్ ఆల్‌రౌండర్ మారిజన్ కాప్ (1/24) మరోసారి అద్భుతంగా బౌలింగ్ చేయగా, మరోవైపు పేసర్ అయాబొంగా ఖాకా (2/24) కూడా ఆకట్టుకుంటుంది. వీరితో పాటు స్పిన్నర్లు క్లో ట్రయాన్, ఆన్ మలాబా కూడా పరుగుల వేగానికి చెక్ పెట్టారు. దీని కారణంగా ఆస్ట్రేలియా జట్టు భారీ లక్ష్యాన్ని అందించలేకపోయింది. దక్షిణాఫ్రికా కూడా నాలుగో ఓవర్‌లోనే ఓపెనర్ తజ్మిన్ బ్రిట్స్ వికెట్‌ను కోల్పోయినప్పటికీ, ఆ తర్వాత కెప్టెన్ వూల్‌వార్ట్, బాష్ చిరస్మరణీయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. జట్టు విజయాన్ని నిర్ధారించారు. వీరిద్దరూ కలిసి 96 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. బాష్ చివరి వరకు ఉండి కేవలం 48 బంతుల్లో 74 పరుగుల ఇన్నింగ్స్‌తో జట్టును విజయతీరాలకు చేర్చాడు.

వరుసగా 7 ఫైనల్స్ ఆడిన ఆస్ట్రేలియా విఫలం..

దీంతో దక్షిణాఫ్రికా టీ20 ప్రపంచకప్‌లో తొలిసారి ఆస్ట్రేలియాను ఓడించి, గతేడాది టీ20 ప్రపంచకప్ ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. దక్షిణాఫ్రికా జట్టు వరుసగా రెండోసారి ఫైనల్స్‌కు చేరుకోగా, గత 7 ప్రపంచకప్‌లలో ఫైనల్స్‌ ఆడి 6 సార్లు టైటిల్‌ను కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా జట్టు తొలిసారి సెమీఫైనల్‌లోనే నిష్క్రమించింది. అంతకుముందు 2009లో ఆడిన తొలి ప్రపంచకప్‌లో ఆ జట్టు ఫైనల్ చేరలేకపోయింది. దీని తరువాత, జట్టు తదుపరి 3 వరుస ప్రపంచ కప్‌లను గెలుచుకుంది. అయితే, 2016లో ఫైనల్‌లో వెస్టిండీస్ చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత, ఈ జట్టు మళ్లీ వరుసగా 3 సార్లు టైటిల్ గెలుచుకుంది. కానీ, ఇప్పుడు జట్టు ఫైనల్స్‌కు కూడా చేరుకోలేకపోయింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..