- Telugu News Photo Gallery Cricket photos SRH Retains Klassen, Cummins, Abhishek Sharma: IPL Mega Auction Prep Begins
SRH: పే..ద్ద ప్లానింగే మావా.. కావ్య పాప మాస్టర్ స్ట్రోక్.. టీ20 మాన్‌స్టర్‌కి ఏకంగా రూ.23 కోట్లా.?
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) IPL మెగా వేలం కోసం హెన్రిక్ క్లాసెన్ (రూ.23 కోట్లు), కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (రూ.18 కోట్లు), అభిషేక్ శర్మ (రూ.14 కోట్లు) లను రిటైన్ చేసింది. మొత్తం రూ.55 కోట్లు ఖర్చు చేసిన SRH, మరో ముగ్గురిని రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. ట్రావిస్ హెడ్, నితీష్ రెడ్డిలను కూడా రిటైన్ చేసుకోవచ్చు
Updated on: Oct 17, 2024 | 8:33 PM

IPL మెగా వేలానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. మొదటి దశగా, అన్ని ఫ్రాంచైజీలు తమతో అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాను అక్టోబర్ 31న అఫీషియల్‌గా ప్రకటించనున్నాయి. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఇప్పటికే ముగ్గురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవాలని నిర్ణయించుకుంది.

SRH జట్టు మొదట స్ట్రైకర్ హెన్రిక్ క్లాసెన్. గత రెండు సీజన్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అద్భుతంగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా ఆటగాడు క్లాసెన్‌ను రూ.23 కోట్లకు రిటైన్ చేసుకోనుంది SRH.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ రెండో రిటెన్షన్ కెప్టెన్ పాట్ కమిన్స్. గత సీజన్‌లో SRH జట్టును విజయవంతంగా నడిపించిన ఈ ఆస్ట్రేలియా ఆటగాడికి 18 కోట్లు వెచ్చించనుంది ఫ్రాంచైజీ.

మూడో రిటైనర్‌గా అభిషేక్ శర్మ. గత సీజన్‌లో SRHకి ఓపెనర్‌గా బరిలోకి దిగిన అభిషేక్.. పేలుడు బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. రూ.14 కోట్లతో ఇతడ్ని అట్టిపెట్టుకోనుంది SRH.

ఈ ముగ్గురు ఆటగాళ్లకు సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ మొత్తం రూ.55 కోట్లు చెల్లించనుంది. అటు ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్ రెడ్డిని కూడా SRH రిటైన్ చేసుకోనుందట.

IPL మెగా వేలం నియమాల ప్రకారం, మొత్తం 6 మంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు ఉంచుకోవచ్చు. ఇందుకోసం మొత్తం రూ.79 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది.




