- Telugu News Photo Gallery Cricket photos England Player Ben Duckett Becomes Fastest to 2000 Test Runs Record against Pakistan 2nd test
PAK vs ENG: 147 ఏళ్లలో తొలిసారి ఇలా.. ప్రపంచ రికార్డ్ సృష్టించిన ఇంగ్లండ్ డేంజరస్ ప్లేయర్.. అదేంటంటే?
Pakistan vs England, 2nd Test: పాకిస్థాన్‌తో ముల్తాన్ వేదికగా జరుగుతున్న 2వ టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ పేసర్ బెన్ డకెట్ అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో న్యూజిలాండ్ ఆటగాడి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం.
Updated on: Oct 17, 2024 | 9:51 AM

Pakistan vs England, 2nd Test: 147 ఏళ్ల టెస్టు చరిత్రలో అత్యంత వేగంగా 2000 పరుగులు చేసిన ఆటగాడిగా ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. డకెట్ అతి తక్కువ డెలివరీలను ఎదుర్కొని ఈ రికార్డును నెలకొల్పాడు.

ముల్తాన్‌లో పాకిస్థాన్‌తో జరుగుతున్న 2వ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బెన్ డకెట్ సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో డకెట్ 129 బంతులు ఎదుర్కొని 16 ఫోర్లతో 114 పరుగులు చేశాడు. ఈ సెంచరీతో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ టెస్టుల్లో 2000 పరుగులు పూర్తి చేసుకున్నాడు.

టెస్టు క్రికెట్‌లో ఇప్పటివరకు 2293 బంతులు ఎదుర్కొన్న బెన్ డకెట్ 4 సెంచరీలు, 11 అర్ధసెంచరీలతో 2026 పరుగులు చేశాడు. దీంతో టెస్టు చరిత్రలోనే అతి తక్కువ బంతుల్లో 2000 పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

అంతకుముందు ఈ ప్రపంచ రికార్డు న్యూజిలాండ్ ఆటగాడు టిమ్ సౌథీ పేరిట ఉండేది. టిమ్ సౌథీ కేవలం 2418 బంతుల్లో 2000 పరుగులు పూర్తి చేయడం ద్వారా ఈ రికార్డును లిఖించాడు. ఇప్పుడు ఈ రికార్డు ఇంగ్లండ్ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ పేరిట ఉంది.

టెస్టు క్రికెట్‌లో తుఫాన్ బ్యాటింగ్‌తో అదరగొట్టే బెన్ డకెట్.. తన దూకుడు ఆటతో సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. దీంతో 147 ఏళ్ల టెస్టు చరిత్రలో అతి తక్కువ బంతుల్లో 2000 పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

ముల్తాన్ టెస్టులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 366 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో బెన్ డకెట్ సెంచరీతో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు 2వ రోజు ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 239 పరుగులు చేసింది.




