Rishabh Pant Injury Update: రిషబ్ పంత్ గాయంపై షాకింగ్ న్యూస్.. ఇకపై బెంగళూరు టెస్టులో ఆడేనా?
India vs New Zealand: భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య బెంగళూరులో జరుగుతున్న టెస్టులో రిషబ్ పంత్ మోకాలికి గాయమైంది. ఆపరేషన్ చేసిన మోకాలికే గాయం అయింది. దీంతో ఇప్పుడు బెంగళూరు టెస్టులో అతడు మిగతా రోజుల్లో ఆడతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. దీనిపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కీలక ప్రకటన చేశాడు.
Rishabh Pant Injury Update: బెంగళూరు టెస్టు రెండో రోజు టీమ్ ఇండియాకు ఏదీ మంచిగా జరగలేదు. మొదట బ్యాటింగ్ తేలిపోయింది. ఆ తర్వాత బౌలింగ్‌లోనూ సత్తా చాటలేకపోయారు. ఈ క్రమంలో రిషబ్ పంత్ గాయం తలనొప్పిని పెంచింది. పంత్ గాయం టీమిండియా టెన్షన్‌ని పెంచబోతోంది. ఎందుకంటే, అతను శస్త్రచికిత్స చేయించుకున్న మోకాలికి గాయమైంది. ప్రస్తుతం రిషబ్ పంత్ గాయం పరిస్థితి ఏంటనేది ప్రశ్నగా మారింది. బెంగళూరు టెస్టులో ఇకపై ఆడగలడా? వంటి ప్రశ్నలకు సమాధానాలు కెప్టెన్ రోహిత్ శర్మ కీలక అప్‌డేట్స్ అందించాడు.
మోకాలి వాపు, రిస్క్ తీసుకోలేను- రోహిత్ శర్మ
రిషబ్ పంత్ గాయంపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ తాజా సమాచారం అందించాడు. రెండో రోజు ఆట ముగిసిన తర్వాత రిషబ్ పంత్ మోకాలు వాచిందని తెలిపాడు. ఇటీవల సర్జరీ చేయించుకున్న మోకాలికే గాయం అయిందని, మేం ఎలాంటి రిస్క్ తీసుకోలేమని అన్నాడు. పంత్ ఈ మ్యాచ్‌లో పునరాగమనం చేస్తాడని ఆశిస్తున్నాం అంటూ రోహిత్ చెప్పుకొచ్చాడు.
బెంగళూరు టెస్టులో ఆడడంపై ఎలాంటి స్పష్టత లేదు..
Rishabh Pant walked off the field after getting hit on the right knee#RishabhPant #TeamIndia #INDvsNZ #RishabhZaid pic.twitter.com/akdsibT2qQ
— Rishabh Fan Zaid (@RishabhZaid17) October 18, 2024
పంత్‌ను రంగంలోకి దింపేందుకు టీమ్‌ఇండియా ఏమాత్రం తొందరపడడం లేదని రోహిత్ శర్మ మాటలను బట్టి అర్థమవుతోంది. అంటే, బెంగుళూరు టెస్టులో రిషబ్ పంత్ ఫీల్డింగ్ చేస్తాడా లేదా అనే విషయంపై స్పష్టంగా ఇప్పుడే ఏమీ చెప్పలేం.
రిషబ్ పంత్ ఎప్పుడు, ఎలా గాయపడ్డాడు?
బెంగళూరు టెస్టు రెండో రోజు రవీంద్ర జడేజా వేసిన బంతిని ఫీల్డింగ్ చేస్తూ రిషబ్ పంత్ గాయపడ్డాడు. అతను ప్యాడ్ ధరించినప్పటికీ, బంతి అతని మోకాలి భాగంలో ప్యాడ్ కప్పబడని భాగానికి తగిలింది. బంతి మోకాలికి తగిలిన వెంటనే రిషబ్ పంత్ నొప్పితో విలవిల్లాడాడు. ఆ తర్వాత ఫిజియోను మైదానంలోకి పిలవాల్సి వచ్చింది. విషయం తీవ్రతను గమనించిన ఫిజియో అతడిని మైదానం నుంచి బయటకు తీసుకెళ్లాడు. కాళ్ల మీద కూడా నడవలేని స్థితిలో అతని పరిస్థితి నెలకొంది. పంత్ ఔట్ అయిన తర్వాత ధృవ్ జురైల్ వికెట్ కీపింగ్ చేసేందుకు మైదానంలోకి వచ్చాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..