T20 World Cup 2021: న్యూజిలాండ్ VS అఫ్గానిస్థాన్ మ్యాచ్.. నెటిజన్ల మీమ్స్ చూశారా..
ప్రస్తుతం భారత్‌లోని కోట్లాది క్రికెట్ అభిమానుల దృష్టంతా ఆదివారం జరగనున్న న్యూజిలాండ్- అఫ్గానిస్థాన్ మ్యాచ్ పైనే ఉంది. ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ గెలవాలి.. భారత్ సెమీస్‌కు దూసుకెళ్లాలని
ప్రస్తుతం భారత్‌లోని కోట్లాది క్రికెట్ అభిమానుల దృష్టంతా ఆదివారం జరగనున్న న్యూజిలాండ్- అఫ్గానిస్థాన్ మ్యాచ్ పైనే ఉంది. ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ గెలవాలి.. భారత్ సెమీస్‌కు దూసుకెళ్లాలని ప్రతిఒక్కరూ కోరుకుంటున్నారు. గ్రూప్-2 నుంచి పాకిస్తాన్ ఇప్పటికే సెమీస్ చేరుకోగా.. మరో స్థానం కోసం భారత్‌తో పాటు న్యూజిలాండ్, అఫ్గాన్ జట్లు పోటీ పడుతున్నాయి. నాలుగు మ్యాచ్‌ల్లో మూడు మ్యాచ్‌లు గెలిచిన న్యూజిలాండ్ మొత్తం 6 పాయింట్లతో గ్రూప్‌లో రెండో స్థానంలో ఉంది. ఇక 4 మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో ఇండియా, అఫ్గాన్ జట్లు 3, 4 స్థానాల్లో ఉన్నాయి. ఈ క్రమంలో ఆదివారం జరగనున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను అఫ్గాన్ ఓడిస్తే న్యూజిలాండ్ ఇంటి దారి పట్టి భారత్‌కు సెమీస్ మార్గం సుగమమవుతుంది. నమీబియాను ఓడించి ఇండియా నాకౌట్ దశకు చేరుకోవచ్చు.
ఈ క్రమంలోనే ఆదివారం జరిగే మ్యాచ్‌లో అఫ్గాన్ గెలవాలని అందరూ కోరుకుంటున్నారు. ఇదే సందర్భమని భావించిన నెటిజన్లు తమ క్రియేటివిటీకి పనిచెప్పారు. మ్యాచ్‌లో గెలవాలని భారత ఆటగాళ్లు అఫ్గాన్ క్రికెటర్లను వేడుకుంటున్నట్లు, బుజ్జగిస్తున్నట్లు రకరకాల మీమ్స్‌ను రూపొందించారు. ప్రస్తుతం ఈ మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా అఫ్గాన్ జట్టులో కీలక ఆటగాడైన రషీద్‌ఖాన్‌ను మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ముస్తాబు చేసుకునే మీమ్ నవ్వు తెప్పిస్తోంది. మరి ప్రస్తుతం నెట్టింట్లో ట్రెండ్ అవుతోన్న ఈ మీమ్స్‌పై మీరూ ఓ లుక్కేయండి.
India to Afghanistan now pic.twitter.com/x1Nk7rHzci
— Asagar Afghan ?? (@sagarcasm) November 5, 2021
Indians to Team Afganistan :#AFGvsNZ #INDvsSCO pic.twitter.com/XOPcTL0wCi
— wasi?? (@iWasiSheikh) November 5, 2021
#IND to #AFG on Sunday #AfgvsNZ pic.twitter.com/XMjvYCeLSt
— Shibani ?? (@meme_ki_diwani) November 5, 2021
Scenario Before AFG vs NZ match pic.twitter.com/aVPw97dS1d
— S Ravind King (@sravindking) November 5, 2021
— Shantibhang (@shantibhang) November 5, 2021
Also read: