Harbhajan Singh: పాక్ అభిమానులపై విరుచుకుపడ్డ హర్భజన్ సింగ్.. చెత్త వాగుడు ఆపండి అంటూ వార్నింగ్..

టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ రేసులో ఉండటానికి టీమ్ ఇండియా తమ చివరి రెండు మ్యాచ్‌లను భారీ తేడాతో గెలిచేందుకు ఫిక్సింగ్‎కు పాల్పడిందని పాకిస్తాన్ అభిమానులు ఆరోపిస్తున్నారు. దీంతో పాక్ అభిమానులపై టీంఇండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ విరుచుకుపడ్డాడు...

Harbhajan Singh: పాక్ అభిమానులపై విరుచుకుపడ్డ హర్భజన్ సింగ్.. చెత్త వాగుడు ఆపండి అంటూ వార్నింగ్..
Bajan
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Nov 06, 2021 | 9:51 PM

టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ రేసులో ఉండటానికి టీమ్ ఇండియా తమ చివరి రెండు మ్యాచ్‌లను భారీ తేడాతో గెలిచేందుకు ఫిక్సింగ్‎కు పాల్పడిందని పాకిస్తాన్ అభిమానులు ఆరోపిస్తున్నారు. ఆఫ్ఘానిస్తాన్, స్కాట్‎లాండ్‎పై భారీ తేడాతో గెలవడంపై అనుమానంగా ఉందంటూ కొందరు పాక్‌ అభిమానులు సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేశారు. దీంతో పాక్ అభిమానులపై టీంఇండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ విరుచుకుపడ్డాడు. శనివారం హర్భజన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో ”మీ చెత్తవాగుడు కట్టిపెడితే బాగుంటుంది. పాకిస్తాన్ చాలా మంచి క్రికెట్ ఆడిందని మేము అంగీకరిస్తున్నాం. భారతదేశంపై చాలా బాగా ఆడినందుకు ప్రతి ఒక్కరూ వారిని అభినందిస్తున్నారు. కానీ ఇలా చేయడం మంచిది కాదు” అని హర్భజన్ సింగ్ అన్నాడు. “మీ క్రికెటర్ల ప్రతిష్ట మా అందరికీ తెలుసు. ఇన్నేళ్ల పాటు ప్రపంచకప్‌లో భారత్‌పై విజయం సాధించలేకపోడాన్ని పాక్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. రషీద్ ఖాన్‌పై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఇది చాలా అవమానకరమైనది ”అని చెప్పాడు.

పాకిస్తాన్, న్యూజిలాండ్‌లతో జరిగి మ్యాచ్‎ల్లో భారత్ వరుసగా 10, 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. కానీ విరాట్ కోహ్లి జట్టు వారి తదుపరి రెండు మ్యాచ్‌లలో పుంజుకుంది, ఆఫ్ఘనిస్తాన్‌ను 66 పరుగుల తేడాతో, స్కాట్‌లాండ్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించింది. ఇదంతా కష్టపడితే వచ్చింది. ఇలాంటి వ్యాఖ్యలు క్రికెట్‎పై ఉండే గౌరవాన్ని దెబ్బ తీస్తుందని పేర్కొన్నాడు. ఆఫ్ఘనిస్తాన్‌ చేతిలో న్యూజిలాండ్ ఓడిపోతే భారత్‎ సెమీస్‎కు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇండియా సోమవారం నమీబీయాతో ఆడనుంది. గ్రూప్-2లో భారత్ ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది. మొదటి, రెండో స్థానాల్లో పాకిస్తాన్, కివీస్ ఉన్నాయి.

Read Also… Chris Gayle: మిచెల్ మార్ష్‎ను ఔట్ చేసిన గేల్.. తర్వాత ఏం చేశాడంటే.. వైరల్ అవుతోన్న వీడియో..

Chris Gayle: క్రిస్ గేల్ రిటైర్మెంట్ తీసుకున్నాడా.. వెస్టిండీస్ ఆటగాళ్లు ఎందుకు అలా చేశారు..

T20 World Cup 2021: టీ20 వరల్డ్ కప్‎లో భారీ సిక్సర్ కొట్టిన రసెల్.. ఎంత దూరం వెళ్లిందంటే..