T20 World Cup 2021: టీ20 వరల్డ్ కప్‎లో భారీ సిక్సర్ కొట్టిన రసెల్.. ఎంత దూరం వెళ్లిందంటే..

టీ20 వరల్డ్ కప్ సూపర్ 12లో భాగంగా అబుదాబి షైక్ జయిద్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‎లో వెస్టిండీస్ ఆటగాడు రసెల్ టీ20 వరల్డ్ కప్ 2021లో అత్యంత భారీ సిక్స్ కొట్టాడు. మిచెల్ స్టార్క్ వేసిన 19 ఓవర్ ఆరో బంతిని రసెల్ భారీ సిక్స్ కొట్టాడు. రసెల్ కొట్టిన సిక్స్ 111 మీటర్ల దూరం వెళ్లింది...

T20 World Cup 2021: టీ20 వరల్డ్ కప్‎లో భారీ సిక్సర్ కొట్టిన రసెల్.. ఎంత దూరం వెళ్లిందంటే..
Rasel
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Nov 06, 2021 | 7:42 PM

టీ20 వరల్డ్ కప్ సూపర్ 12లో భాగంగా అబుదాబి షైక్ జయిద్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‎లో వెస్టిండీస్ ఆటగాడు రసెల్ టీ20 వరల్డ్ కప్ 2021లో అత్యంత భారీ సిక్స్ కొట్టాడు. మిచెల్ స్టార్క్ వేసిన 19 ఓవర్ ఆరో బంతిని రసెల్ భారీ సిక్స్ కొట్టాడు. రసెల్ కొట్టిన సిక్స్ 111 మీటర్ల దూరం వెళ్లింది. అంతకు ముందు ఐదో బంతిని కూడా రసెల్ స్టాడ్స్‎లోకి పంపాడు. కానీ ఈ మ్యాచ్‎లో వెస్టిండీస్ 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లకు ఏడు వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. ఓపెనర్లు గేల్ 9 బంతుల్లో 15(రెండు సిక్స్‎లు)పరుగులు చేసి ఔటయ్యాడు. పూరన్ 4 పరుగులకే పెవిలియన్ చేరాడు. తర్వాత వచ్చిన రోస్టాన్ డకౌట్ అయ్యాడు. దీంతో వెస్టిండీస్ 35 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో లూయిస్, హెట్మెయర్ జట్టును ఆదుకున్నారు. లూయిస్ 26 బంతుల్లో 29(ఐదు ఫోర్లు) పరుగులు చేసి ఔటయ్యాడు. తర్వాత వచ్చిన పోలార్డ్ ధాటిగా ఆడాడు.

View this post on Instagram

A post shared by ICC (@icc)

ఈ క్రమంలో 28 బంతుల్లో 27(రెండు ఫోర్లు)పరుగులు చేసిన హెట్మెయర్ పెవిలియన్ చేరాడు. చివరి మ్యాచ్ ఆడుతున్న బ్రావో 10 పరుగులు చేశాడు. చివర్లో పోలార్డ్ రసెల్ స్కోర్ బోర్డును ఉరకలెత్తించారు. పోలార్డ్ 31 బంతుల్లో44(నాలుగు ఫోర్లు, ఒక సిక్స్) పరుగులు చేసి వెనుదిగాడు. రసెల్ 7 బంతుల్లో 18(ఒక ఫోర్, రెండు సిక్స్‎లు) పరుగులు చేసిన నాటౌట్‎గా నిలిచాడు. హోల్డర్ ఒక పరుగుతో నాటౌట్‎గా ఉన్నాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో హేజిల్​వుడ్ 4 వికెట్లు తీయగా, స్టార్క్, కమ్మిన్స్, జంపా ఒక్కో వికెట్ తీశారు.

158 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 16.2 ఓవర్లలో రెండు వికెట్ల కోల్పోయి విజయం సాధించింది. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఈ మ్యాచ్‎లో చెలరేగాడు. 56 బంతుల్లో 89(9 ఫోర్లు, 4 సిక్స్‎లు) పరుగులతో నాటౌట్‎గా నిలిచి ఒంటి చేతితో జట్టును గెలిపించాడు. అతనికి తోడు మిచెల్ మార్ష్ కూడా రాణించాడు. మార్ష్ 32 బంతుల్లో53 (5 ఫోర్లు, 2 సిక్స్‎లు ) పరుగులు చేశాడు. ఆరోన్ ఫించ్ 9 పరుగులు చేశాడు. వెస్టిండీస్ బౌలర్లలో గేల్, హోసెయిన్ ఒక్కో వికెట్ తీశారు. ఈ వరల్డ్ కప్‎లో వెస్టిండీస్ ఘోరంగా విఫలమైంది. ఐదు మ్యాచ్‎ల్లో ఒకదాట్లో మాత్రమే విజయం సాధించింది.

Read Also.. VVS Laxman: ఎన్‎సీఏ డైరెక్టర్‎గా వీవీఎస్ లక్ష్మణ్..! చర్చిస్తున్న బీసీసీఐ..