VVS Laxman: ఎన్‎సీఏ డైరెక్టర్‎గా వీవీఎస్ లక్ష్మణ్..! చర్చిస్తున్న బీసీసీఐ..

భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇండియాలో క్రికెట్ మరింత అభివృద్ధి చేసేందుకు మాజీ క్రికెటర్లను భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. బీసీసీఐ అధ్యక్షుడిగా అతను రాహుల్ ద్రవిడ్‌ను భారత జట్టు ప్రధాన కోచ్‌గా ఉండేలా అంగీకరింపజేశాడు...

VVS Laxman: ఎన్‎సీఏ డైరెక్టర్‎గా వీవీఎస్ లక్ష్మణ్..! చర్చిస్తున్న బీసీసీఐ..
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Nov 06, 2021 | 6:48 PM

భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇండియాలో క్రికెట్ మరింత అభివృద్ధి చేసేందుకు మాజీ క్రికెటర్లను భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. బీసీసీఐ అధ్యక్షుడిగా అతను రాహుల్ ద్రవిడ్‌ను భారత జట్టు ప్రధాన కోచ్‌గా ఉండేలా అంగీకరింపజేశాడు. ఇప్పుడు వీవీఎస్ లక్ష్మణ్ జాతీయ క్రికెట్ అకాడమీ (NCA) హెడ్‌గా బాధ్యతలు చేపట్టాలని గంగూలీ ఆకాంక్షిస్తున్నాడు. బీసీసీఐ చీఫ్ మాత్రమే కాదు, సెక్రటరీ జై షా, ఇతర సీనియర్ అధికారులు కూడా లక్ష్మణ్ ఎన్‌సీఏ డైరెక్టర్‎గా బాధ్యతలు చేపట్టాలని కోరుతున్నారు.

అందుకు లక్ష్మణ్‎ను ఒప్పించేలా బీసీసీఐ ప్రయత్నాలు చేస్తోంది. గంగూలీ, జై షా నేరుగా రంగంలోకి దిగి లక్ష్మణ్‎తో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. టీం ఇండియా కోచ్‎గా ద్రవిడ్, ఎన్‎సీఏ డైరెక్టర్‎గా లక్ష్మణ్ ఉంటే బాగుంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. వారిద్దరికి మంచి అనుబంధం ఉందని గుర్తు చేశారు. భారత క్రికెట్‎ను ఇద్దరు కలిసి మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందన్నారు. అయితే లక్ష్మణ్ ఎన్‎సీఏ డైరెక్టర్‎గా ఒప్పుకుంటారో లేదో అని ఉత్కంఠ కొనసాగుతోంది.

రాబోయే న్యూజిలాండ్ సిరీస్ నుంచి ప్రధాన కోచ్‌గా ద్రవిడ్ బాధ్యతలు చేపట్టబోతున్నందున్నాడు. “భారత క్రికెట్ జట్టుకు కొత్త ప్రధాన కోచ్‌గా నియమితులు కావడం గర్వకారణం, ఈ పాత్ర కోసం నేను నిజంగా ఎదురు చూస్తున్నాను. శాస్త్రి ఆధ్వర్యంలో జట్టు చాలా బాగా పనిచేసింది. జట్టుతో కలిసి పని చేయాలని నేను ఆశిస్తున్నాను” అని ద్రవిడ్ అన్నాడు. “NCA, U19, ఇండియా A సెటప్‌లో చాలా మంది అబ్బాయిలతో సన్నిహితంగా పనిచేసినందున, వారికి ప్రతిరోజూ మెరుగుపడాలనే కోరిక ఉందని నాకు తెలుసు. రాబోయే రెండేళ్లలో కొన్ని మార్క్యూ మల్టీ-టీమ్ ఈవెంట్‌లు ఉన్నాయి. ఆటగాళ్లు, సహాయక సిబ్బందితో కలిసి పనిచేయడానికి ముందుకు సాగుతున్నాను, ”అని చెప్పాడు. భారత ఓపెనర్ రోహిత్ శర్మ, స్పిన్నర్ ఆర్ అశ్విన్ ద్రవిడ్ నియమాకంపై హర్షం వ్యక్తం చేశారు. భారత మాజీ కెప్టెన్‌తో కలిసి పనిచేయడానికి తాము ఎదురుచూస్తున్నామని చెప్పారు.

Read Also.. Michael Vaughan: మైఖేల్ వాన్‎కు షాక్.. షోలో పాల్గొనకుండా వేటు వేసిన బీబీసీ.. ఎందుకంటే..

Tarak Sinha: ధావన్, పంత్ గురువు తారక్ సిన్హా కన్నుమూత.. ప్రముఖుల సంతాపం..

జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..