Tarak Sinha: ధావన్, పంత్ గురువు తారక్ సిన్హా కన్నుమూత.. ప్రముఖుల సంతాపం..
భారత జట్టుకు గొప్ప గొప్ప ఆటగాళ్లను అందించిన క్రికెట్ కోచ్ తారక్ సిన్హా కన్నుమూశారు. 71 సంవత్సరాల తారక్ సిన్హా శనివారం ఢిల్లీలో క్యాన్సర్‌తో తుది శ్వాస విడిచాడు. కొంతకాలంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న సిన్హా శనివారం తెల్లవారుజామున 3 గంటలకు ప్రాణాలు విడిచాడు...
భారత జట్టుకు గొప్ప గొప్ప ఆటగాళ్లను అందించిన క్రికెట్ కోచ్ తారక్ సిన్హా కన్నుమూశారు. 71 సంవత్సరాల తారక్ సిన్హా శనివారం ఢిల్లీలో క్యాన్సర్‌తో తుది శ్వాస విడిచాడు. కొంతకాలంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న సిన్హా శనివారం తెల్లవారుజామున 3 గంటలకు ప్రాణాలు విడిచాడు. దేశ్ ప్రేమ్ ఆజాద్, గురుచరణ్ సింగ్, రమాకాంత్ అచ్రేకర్, సునీతా శర్మ తర్వాత ద్రోణాచార్య అవార్డు అందుకున్న ఐదో భారత క్రికెట్ కోచ్ తారక్ సిన్హా నిలిచారు. 2018లో ఆయన ద్రోణాచార్య అవార్డు అందుకున్నాడు. న్యూఢిల్లీలో సోనెట్ క్రికెట్ క్లబ్ నడిపిన తారక్ సిన్హా చాలా కాలంపాటు క్రికెటర్లతో కలిసి పనిచేశారు.
సిన్హా ఎందరో క్రికెటర్లను అందించారు. సిన్హా పర్యవేక్షణలో రాటుదేలిన ఆటగాళ్లలో 12 మంది అంతర్జాతీయ క్రికెట్‌కు ప్రాతినిధ్యం వహించారు. ఆశిష్ నెహ్రా, ఆకాశ్ చోప్రా, శిఖర్ ధావన్, అంజుమ్ చోప్రా, రిషబ్ పంత్, మనోజ్ ప్రభాకర్, అజయ్ శర్మ, కె.పి. భాస్కర్, సంజీవ్ శర్మ, రామన్ లంబా, అతుల్ వాసన్, సురేందర్ ఖన్నా, రణ్‌దీర్ సింగ్ లాంటివారు ఉన్నారు. వీరిలో ప్రస్తుతం ధావన్, పంత్‌లు టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తారక్ సిన్హా మృతిపై సోనెట్ క్లబ్ సంతాపం ప్రకటించింది.
Read Also.. Dwayne Bravo: నేడు చివరి టీ20 మ్యాచ్ ఆడనున్న డ్వేన్ బ్రావో.. గెలుపుతో ఆట ముగిస్తాడా..
AFG vs NZ: టెన్షన్ పడకండి బ్రదర్.. మా వాళ్లు చూసుకుంటారు: అశ్విన్‌కు ఫన్నీ రిప్లై ఇచ్చిన రషీద్