Michael Vaughan: మైఖేల్ వాన్‎కు షాక్.. షోలో పాల్గొనకుండా వేటు వేసిన బీబీసీ.. ఎందుకంటే..

ఇంగ్లాండ్ మాజీ సారథి మైఖేల్ వాన్‌పై వార్త సంస్థ బీబీసీ నిషేధం విధించింది. ఆటగాళ్లపై వాన్ జాత్యహంకార వ్యాఖ్యలు చేసినట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ చర్య తీసుకుంది. 'ది టఫర్స్ అండ్ వాన్ క్రికెట్ షో' నుంచి వాన్‎ను తప్పించింది...

Michael Vaughan: మైఖేల్ వాన్‎కు షాక్.. షోలో పాల్గొనకుండా వేటు వేసిన బీబీసీ.. ఎందుకంటే..
Wan
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Nov 06, 2021 | 4:35 PM

ఇంగ్లాండ్ మాజీ సారథి మైఖేల్ వాన్‌పై వార్త సంస్థ బీబీసీ నిషేధం విధించింది. ఆటగాళ్లపై వాన్ జాత్యహంకార వ్యాఖ్యలు చేసినట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ చర్య తీసుకుంది. ‘ది టఫర్స్ అండ్ వాన్ క్రికెట్ షో’ నుంచి వాన్‎ను తప్పించింది. మైఖేల్ వాన్ బీబీసీ 5 లైవ్ ‘ది టఫర్స్ అండ్ వాన్ క్రికెట్ షో’లో 12 సంవత్సరాలుగా టెస్ట్ మ్యాచ్ స్పెషల్‌లో విశ్లేషకుడిగా పనిచేస్తున్నాడు. 2009లో యార్క్‌షైర్ మ్యాచ్‌కు ముందు వాన్ తనపై, ఇతర ఆటగాళ్లపై జాత్యహంకార వ్యాఖ్యలు చేశాడని అజీమ్ రఫీక్ ఆరోపించాడు. దీంతో వాన్‎పై బీబీసీ వేటు వేసింది. రఫీక్ ఆరోపణలను మైఖేల్ వాన్‌ నిర్ద్వంద్వంగా ఖండించాడు. రఫిక్ ఆరోపణలు నిరాధారమని చెప్పాడు.

1991 నుండి 2009లో తన రిటైర్మెంట్ వరకు కౌంటీకి వాన్ ప్రాతినిధ్యం వహించాడు. 2009లో నాటింగ్‌హామ్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో యార్క్‌షైర్ మైదానంలోకి దిగుతుండగా వాన్ జాత్యహంకారం వ్యాఖ్యలు చేశాడని రఫీక్ ఫిర్యాదు చేశాడు. వాన్‎పై ఇంతకుముందు కూడా చాలా ఆరోపణాలు వచ్చాయి. “ఎవరైనా 10 సంవత్సరాల క్రితం చెప్పిన మాటలను గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నించడం తప్పు అవుతుంది, కానీ ఆ పదాలను ఉపయోగించలేదని నేను మొండిగా అనుకుంటున్నాను” అని వాన్ అన్నాడు. మైఖేల్ వాన్‌ భారత ఆటగాళ్లను టార్గెట్ చేస్తూ చాలా సార్లు ఇష్టమొచ్చినట్లు మాట్లాడాడు. జాతి వివక్షపై భారీగా ఆరోపణలు రావడంతో ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) యార్క్‌షైర్‌ కౌంటీ క్రికెట్‌ క్లబ్‌ (వైసీసీసీ)పై వేటు వేసింది. అయితే రఫీక్‌ ఇదే కౌంటీ తరఫున 2008–2018 వరకు ఆడాడు.

గత ఆదివారం న్యూజిలాండ్‎తో ఓటమి తర్వాత భారత్ ఆటగాళ్లపై మైకేల్ వాన్ విమర్శలు గుప్పించారు. ఇంత ప్రతిభ ఉండి, పెద్ద జట్టుగా పేరొందిన టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో దారుణంగా విఫలమవుతుందని ట్వీట్ చేశాడు. ప్రపంచంలోని ఇతర దేశాల్లో నిర్వహిస్తున్న అన్ని లీగ్‌ మ్యాచ్‌లలో ఆడేందుకు భారత క్రికెటర్లకు అనుమతినివ్వాలని బీసీసీఐకి మైకేల్‌ వాన్‌ సూచించాడు.

Read Also.. Tarak Sinha: ధావన్, పంత్ గురువు తారక్ సిన్హా కన్నుమూత.. ప్రముఖుల సంతాపం..