AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2021: చెలరేగిన డేవిడ్ వార్నర్.. వెస్టిండీస్‎పై ఆసీస్ ఘన విజయం..

టీ20 వరల్డ్ కప్ సూపర్ 12లో భాగంగా అబుదాబి షైక్ జయిద్ స్టేడియంలో వెస్టిండీస్‎తో జరిగిన మ్యాచ్‎లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. 158 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‎కు దిగిన ఆసీస్ 16.2 ఓవర్లలో రెండు వికెట్ల కోల్పోయి విజయం సాధించింది...

T20 World Cup 2021: చెలరేగిన డేవిడ్ వార్నర్.. వెస్టిండీస్‎పై ఆసీస్ ఘన విజయం..
Warner
Srinivas Chekkilla
|

Updated on: Nov 06, 2021 | 7:35 PM

Share

టీ20 వరల్డ్ కప్ సూపర్ 12లో భాగంగా అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో వెస్టిండీస్‎తో జరిగిన మ్యాచ్‎లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. 158 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 16.2 ఓవర్లలో రెండు వికెట్ల కోల్పోయి విజయం సాధించింది. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఈ మ్యాచ్‎లో చెలరేగాడు.  56 బంతుల్లో 89(9 ఫోర్లు, 4 సిక్స్‎లు) పరుగులతో నాటౌట్‎గా నిలిచి ఒంటి చేతితో జట్టును గెలిపించాడు. అతనికి తోడు మిచెల్ మార్ష్ కూడా రాణించాడు. మార్ష్ 32 బంతుల్లో53 (5 ఫోర్లు, 2 సిక్స్‎లు ) పరుగులు చేశాడు. ఆరోన్ ఫించ్ 9 పరుగులు చేశాడు. వెస్టిండీస్ బౌలర్లలో గేల్, హోసెయిన్ ఒక్కో వికెట్ తీశారు.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లకు ఏడు వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. ఓపెనర్లు గేల్ 9 బంతుల్లో 15(రెండు సిక్స్‎లు)పరుగులు చేసి ఔటయ్యాడు. పూరన్ 4 పరుగులకే పెవిలియన్ చేరాడు. తర్వాత వచ్చిన రోస్టాన్ డకౌట్ అయ్యాడు. దీంతో వెస్టిండీస్ 35 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో  లూయిస్, హెట్మెయర్ జట్టును ఆదుకున్నారు.  లూయిస్ 26 బంతుల్లో 29(ఐదు ఫోర్లు) పరుగులు చేసి ఔటయ్యాడు. తర్వాత వచ్చిన పోలార్డ్ ధాటిగా ఆడాడు. ఈ క్రమంలో 28 బంతుల్లో 27(రెండు ఫోర్లు)పరుగులు చేసిన హెట్మెయర్ పెవిలియన్ చేరాడు. చివరి మ్యాచ్ ఆడుతున్న బ్రావో 10 పరుగులు చేశాడు. చివర్లో పోలార్డ్ రసెల్ స్కోర్ బోర్డును ఉరకలెత్తించారు. పోలార్డ్ 31 బంతుల్లో44(నాలుగు ఫోర్లు, ఒక సిక్స్) పరుగులు చేసి వెనుదిగాడు. రసెల్ 7 బంతుల్లో 18(ఒక ఫోర్, రెండు సిక్స్‎లు) పరుగులు చేసిన నాటౌట్‎గా నిలిచాడు. హోల్డర్ ఒక పరుగుతో నాటౌట్‎గా ఉన్నాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో హేజిల్​వుడ్ 4 వికెట్లు తీయగా, స్టార్క్, కమ్మిన్స్, జంపా ఒక్కో వికెట్ తీశారు. ఈ వరల్డ్ కప్‎లో వెస్టిండిస్ ఘోరంగా విఫలమైంది. ఐదు మ్యాచ్‎ల్లో ఒకదాట్లో మాత్రమే విజయం సాధించింది. డ్వేన్ బ్రావో ఈ మ్యాచ్‎తో రిటైర్మెంట్ తీసుకున్నాడు.

గ్రూప్-1లో ఆస్ట్రేలియా రెండో స్థానంలో నిలిచింది. ఆసీస్ సెమీస్‎కు వెళ్లాలంటే దక్షిణాఫ్రికా ఓడిపోవాలి. ఒకవేళ దక్షిణాఫ్రికా గెలిచినా తక్కువ రన్ రేట్ ఉండాలి. అలా అయితేనే ఆస్ట్రేలియా సెమీస్‎కు వెళ్తుంది. లేంకుటే సౌతాఫ్రికా వెళ్తుంది.

Read Also.. Tarak Sinha: ధావన్, పంత్ గురువు తారక్ సిన్హా కన్నుమూత.. ప్రముఖుల సంతాపం..

ఆ ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ ధర.. రూ 2.08 కోట్లు .. కొన్నది ఎవరంటే ??

కోటి సంపాదిస్తూ పన్నులు కట్టే టెకీ కి భద్రత ఏది ?? పోస్ట్‌ వైరల్‌

మినిమమ్ బ్యాలెన్స్ చార్జీలు బాది రూ. 8 వేల కోట్లు సంపాదన

హెన్నా ఇక వదిలేయండి.. వీటితో మీ జుట్టును నల్లగా మార్చేయండి!

గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రకటన.. కొత్త టీమ్..

తనంతట తానుగా ఇంధనం'కటాఫ్' పొజిషన్‌.. తప్పిన పెను ప్రమాదం

భారత్‌ను ఇరుకున పెట్టేందుకు పాక్ - బంగ్లా భారీ కుట్ర..!

ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. మరోసారి కరెంట్ ఛార్జీలు తగ్గింపు

ఒకప్పుడు MBBS ఫెయిల్.. ఇండస్ట్రీనే అల్లాడిస్తున్నాడు..

కేవలం 11 రోజులు మెంతి నీరు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
కేవలం 11 రోజులు మెంతి నీరు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
ఆ ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ ధర.. రూ 2.08 కోట్లు .. కొన్నది ఎవరంటే ??
ఆ ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ ధర.. రూ 2.08 కోట్లు .. కొన్నది ఎవరంటే ??
కోటి సంపాదిస్తూ పన్నులు కట్టే టెకీ కి భద్రత ఏది ?? పోస్ట్‌ వైరల్‌
కోటి సంపాదిస్తూ పన్నులు కట్టే టెకీ కి భద్రత ఏది ?? పోస్ట్‌ వైరల్‌
మినిమమ్ బ్యాలెన్స్ చార్జీలు బాది రూ. 8 వేల కోట్లు సంపాదన
మినిమమ్ బ్యాలెన్స్ చార్జీలు బాది రూ. 8 వేల కోట్లు సంపాదన
తనంతట తానుగా ఇంధనం'కటాఫ్' పొజిషన్‌.. తప్పిన పెను ప్రమాదం
తనంతట తానుగా ఇంధనం'కటాఫ్' పొజిషన్‌.. తప్పిన పెను ప్రమాదం
ఎన్నికల ప్రచారంలో ఆటో నడిపిన మంత్రి.. ఎవరో గుర్తు పట్టారా?

'భరించలేకపోతున్నా...' కళ్యాణ్ ఫ్యాన్స్‌పై తనూజ ఎదురుదాడి

విజయ్‌‌తో పెళ్లి.. డేట్‌ కన్ఫామ్ చేసిన రష్మిక

6 నెలలు ట్రైనింగ్ ఇప్పించి మరీ నా రన్నింగ్ స్టైల్ మార్చాడు..

ఏదో పొరపాటున చెబితే.. నాకు క్యాన్సర్ అంటూ ప్రచారం చేశారు

లీకులు.. చాటింగ్ లు.. ఒకటా రెండా? ఎమ్మెల్యే శ్రీధర్ బాగోతం