Chris Gayle: మిచెల్ మార్ష్‌ను ఔట్ చేసిన గేల్.. తర్వాత ఏం చేశాడంటే.. వైరల్ అవుతోన్న వీడియో..
వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్‌కు శనివారం అబుదాబిలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ చివరిదిగా ఊహగానాలు వస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో గేల్ మిచెల్ మార్ష్ వికెట్ తీశాడు. డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్తున్న మార్ష్‌ను వెనుక నుంచి వెళ్లిన గేల్ కౌగిలించుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడయాలో వైరల్ అవుతోంది....
వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్‌కు శనివారం అబుదాబిలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ చివరిదిగా ఊహగానాలు వస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో గేల్ మిచెల్ మార్ష్ వికెట్ తీశాడు. డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్తున్న మార్ష్‌ను వెనుక నుంచి వెళ్లిన గేల్ కౌగిలించుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడయాలో వైరల్ అవుతోంది. ఐసీసీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేసింది. ఔటై వస్తున్న క్రిస్ గేల్‌కు సహచరుల నుంచి స్టాండింగ్ ఒవేషన్ లభించింది. పెవిలియన్‌కు వెళ్తున్నప్పుడు ప్రేక్షకులకు బ్యాట్‌తో అభివాదం కూడా చేశాడు. కాని రిటైర్మెంట్పై గేల్ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించిన బ్రావోకు విండిస్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఘనంగా వీడ్కోలు పలికారు. అయితే ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది.
View this post on Instagram
158 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 16.2 ఓవర్లలో రెండు వికెట్ల కోల్పోయి విజయం సాధించింది. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఈ మ్యాచ్‌లో చెలరేగాడు. 56 బంతుల్లో 89(9 ఫోర్లు, 4 సిక్స్‌లు) పరుగులతో నాటౌట్‌గా నిలిచి ఒంటి చేతితో జట్టును గెలిపించాడు. అతనికి తోడు మిచెల్ మార్ష్ కూడా రాణించాడు. మార్ష్ 32 బంతుల్లో53 (5 ఫోర్లు, 2 సిక్స్‌లు ) పరుగులు చేశాడు. ఆరోన్ ఫించ్ 9 పరుగులు చేశాడు. వెస్టిండీస్ బౌలర్లలో గేల్, హోసెయిన్ ఒక్కో వికెట్ తీశారు.
View this post on Instagram
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లకు ఏడు వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. ఓపెనర్లు గేల్ 9 బంతుల్లో 15(రెండు సిక్స్‌లు)పరుగులు చేసి ఔటయ్యాడు. పూరన్ 4 పరుగులకే పెవిలియన్ చేరాడు. తర్వాత వచ్చిన రోస్టాన్ డకౌట్ అయ్యాడు. దీంతో వెస్టిండీస్ 35 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో లూయిస్, హెట్మెయర్ జట్టును ఆదుకున్నారు. లూయిస్ 26 బంతుల్లో 29(ఐదు ఫోర్లు) పరుగులు చేసి ఔటయ్యాడు. తర్వాత వచ్చిన పోలార్డ్ ధాటిగా ఆడాడు. ఈ క్రమంలో 28 బంతుల్లో 27(రెండు ఫోర్లు)పరుగులు చేసిన హెట్మెయర్ పెవిలియన్ చేరాడు. చివరి మ్యాచ్ ఆడుతున్న బ్రావో 10 పరుగులు చేశాడు. చివర్లో పోలార్డ్ రసెల్ స్కోర్ బోర్డును ఉరకలెత్తించారు. పోలార్డ్ 31 బంతుల్లో44(నాలుగు ఫోర్లు, ఒక సిక్స్) పరుగులు చేసి వెనుదిగాడు. రసెల్ 7 బంతుల్లో 18(ఒక ఫోర్, రెండు సిక్స్‌లు) పరుగులు చేసిన నాటౌట్‌గా నిలిచాడు. హోల్డర్ ఒక పరుగుతో నాటౌట్‌గా ఉన్నాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో హేజిల్‌వుడ్ 4 వికెట్లు తీయగా, స్టార్క్, కమ్మిన్స్, జంపా ఒక్కో వికెట్ తీశారు.
Read Also.. T20 World Cup 2021: టీ20 వరల్డ్ కప్‌లో భారీ సిక్సర్ కొట్టిన రసెల్.. ఎంత దూరం వెళ్లిందంటే..