Mushfiqur Rahim: కర్మ ఫలం అనుభవించాల్సిందే.. విచిత్రంగా ఔటైన బంగ్లా స్టార్ బ్యాటర్.. వీడియో చూశారా?
సరిగ్గా నెల రోజుల క్రితం వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో శ్రీలంక సీనియర్ బ్యాటర్ మాథ్యూస్ 'టైమ్డ్ ఔట్' తో ఔటైన విషయం తెలిసిందే. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో ఇలా పెవిలియన్ చేరిన తొలి బ్యాటర్ మాథ్యూసే. హెల్మెట్ స్ట్రిప్ సరిగా లేదని, దాని కోసమే ఆలస్యమైందని బంగ్లా కెప్టెన్ షకిబ్ అల్ హసన్ కు మాథ్యూస్ ఎంత నచ్చచెప్పినా బంగ్లాదేశ్ అప్పీల్‌ను వెనక్కి తీసుకోలేదు

మిర్పూర్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న 2వ టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు వికెట్ కీపర్ స్టార్ బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్ విచిత్రంగా ఔటయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ‘కర్మ ఫలం అనుభవించక తప్పదు మరి’ అంటూ క్రికెట్ అభిమానులు, నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక్కడ కర్మ ఫలం ఎందుకు అంటున్నారంటే.. సరిగ్గా నెల రోజుల క్రితం వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో శ్రీలంక సీనియర్ బ్యాటర్ మాథ్యూస్ ‘టైమ్డ్ ఔట్’ తో ఔటైన విషయం తెలిసిందే. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో ఇలా పెవిలియన్ చేరిన తొలి బ్యాటర్ మాథ్యూసే. హెల్మెట్ స్ట్రిప్ సరిగా లేదని, దాని కోసమే ఆలస్యమైందని బంగ్లా కెప్టెన్ షకిబ్ అల్ హసన్ కు మాథ్యూస్ ఎంత నచ్చచెప్పినా బంగ్లాదేశ్ అప్పీల్‌ను వెనక్కి తీసుకోలేదు. ఆ సంఘటన జరిగిన సరిగ్గా నెల రోజులకు ఇవాళ బంగ్లాదేశ్ బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్ విచిత్రమైన రీతిలో ఔటయ్యాడు. ‘అబ్‌స్ట్రకింగ్ ది ఫీల్డ్’ నిబంధనలోని ‘హ్యాండ్లింగ్ ది బాల్’ రూల్ కింద అతనిని అంపైర్లు ఔట్ గా ప్రకటించారు. తద్వారా ఈ రీతిలో ఔటైన తొలి బంగ్లాదేశ్ ఆటగాడిగా ముష్ఫికర్ నిలిచాడు.
వివరాల్లోకి వెళితే.. ఈ టెస్ట్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. తదనుగుణంగా ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ హసన్ జాయ్ (14), జకీర్ హసన్ (8) త్వరగానే వికెట్లను కోల్పోయింది. కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో (5), మొయినుల్ హక్ (5) క్రీజులో నిలవలేకపోయారు. ఈ దశలో కలిసి వచ్చిన ముష్ఫికర్ రహీమ్, షహదత్ హొస్సేన్ వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేశారు. ఐదో వికెట్‌కు 57 పరుగుల భాగస్వామ్యం అందించారు. అయితే మ్యాచ్ 41వ ఓవర్ 4వ బంతికి ఒక చిన్న తప్పిదం కారణంగా ముష్ఫికర్ రహీమ్ అవుటయ్యాడు. కైల్ జేమీసన్ వేసిన బంతిని ముష్ఫికర్ డిఫెన్స్ ఆడాడు. బంతి బ్యాట్‌కు తగిలి వికెట్ల వైపుకు దూసుకెళ్లుతుందేమోనని బంగ్లాదేశ్ బ్యాటర్ దానిని చేతితో ఆపాడు. దీంతో న్యూజిలాండ్ ఆటగాళ్లు ఫీల్డ్ అంపైర్‌కు అప్పీల్ చేశారు. ఈ అప్పీల్‌ను మన్నించిన అంపైర్, చర్చించి మళ్లీ పరీక్ష కోసం థర్డ్ అంపైర్‌కు విజ్ఞప్తి చేశారు.
బంతిని చేతితో పట్టుకుని..
Mushfiqur Rahim out for obstructing the field.
– He is the first Bangladesh batter to dismiss by this way in cricket history.pic.twitter.com/MfZONDzswk
— Johns. (@CricCrazyJohns) December 6, 2023
రీప్లేను పరిశీలించిన థర్డ్ అంపైర్ రహీమ్‌ను ఔట్‌గా ఇచ్చాడు. దీంతో టెస్టు క్రికెట్‌లో అబ్‌స్ట్రకింగ్ ది ఫీల్డ్ కింద ఔట్ అయిన తొలి బంగ్లాదేశ్ బ్యాటర్‌గా ముష్ఫికర్ రహీమ్ నిలిచాడు. ICC రూల్ 37.1.2 ప్రకారం, ‘37.2 పరిస్థితులలో తప్ప, బౌలర్ వేసిన బంతిని బ్యాటర్ బ్యాట్‌తోకాకుండా చేతితో తాకడం లేదా అడ్డుకోవడం వంటివి చేయకూడదు’. ఇప్పుడీ రూల్ కిందే ఔటయ్యాడు ముష్ఫికర్ రహీమ్. కాగా బంతి వికెట్‌పై పడుతుంటే, బంతిని ఒకటి కంటే ఎక్కువసార్లు కొట్టవచ్చు. అది కూడా బ్యాట్‌తోనే. అయితే ఇక్కడ ముష్ఫికర్ రహీమ్ ఔట్ అవుతున్న బంతిని చేతితో అడ్డుకున్నాడు. అందుకే ఐసీసీ నిబంధనల ప్రకారం థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు.
కర్మ ఫలం అనుభవించాల్సిందే ..
#Karmaisboomerang #BANvNZ #MushfiqurRahim pic.twitter.com/Yy0AhlytJ2
— Mushfiq Mohideen (@Im_Mushfiq) December 6, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








