MI vs SRH IPL Match Result: ముంబై ఘన విజయం.. ప్లేఆఫ్స్ ఆశలన్నీ బెంగుళూరుపైనే..
Mumbai Indians vs Sunrisers Hyderabad: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 69వ లీగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. 201 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ 18 ఓవర్లలో ఛేదించింది.
Mumbai Indians vs Sunrisers Hyderabad: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 69వ లీగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. 201 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ 18 ఓవర్లలో ఛేదించింది. కామెరాన్ గ్రీన్ ఐపీఎల్ కెరీర్‌లో తొలి సెంచరీ సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ముంబై బౌలర్ ఆకాశ్ మధ్వల్ 4 వికెట్లు తీశాడు.
వాంఖడే స్టేడియంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన SRH 20 ఓవర్లలో 5 వికెట్లకు 200 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముంబై 18 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
ముంబై ప్లే ఆఫ్స్‌కి ఎలా చేరుతుంది?
SRHపై విజయం తర్వాత, MI 16 పాయింట్లతో నంబర్-4కి చేరుకుంది. అయితే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాలంటే లీగ్ దశలోని చివరి మ్యాచ్‌లో RCBని ఓడించే వరకు వేచి చూడాలి. లేదా వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే, ముంబై ఇప్పటికీ క్వాలిఫై అవుతుంది. బెంగళూరు గెలిస్తే ముంబై ఎలిమినేట్ అవుతుంది.
20 బంతుల్లో గ్రీన్ ఫిఫ్టీ..
కిషన్ వికెట్ పతనం తర్వాత , కామెరాన్ గ్రీన్ ముంబై నుంచి నంబర్-3 వద్ద బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు. తొలి ఓవర్ల నుంచి భారీ షాట్లు కొట్టి కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి యాభై భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆ తర్వాత సీజన్‌లో కేవలం 20 బంతుల్లో మూడో అర్ధ సెంచరీని కూడా నమోదు చేశాడు.
ముంబై తరపున రోహిత్ 5000 పరుగులు..
ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ రెండో ఇన్నింగ్స్‌లో తన 34వ పరుగుతో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ కోసం 5000 పరుగులు పూర్తి చేశాడు. ఐపీఎల్‌లో 6100కు పైగా పరుగులు చేశాడు. మిగతావి డెక్కన్ ఛార్జర్స్ ఫ్రాంచైజీ తరపున చేశాడు. రోహిత్ 33 బంతుల్లో తన యాభైని పూర్తి చేసి పెవిలియ్ చేరాడు. ఇది ఈ సీజన్‌లో రెండవ అర్ధశతకం. 56 పరుగులు చేసి ఔటయ్యాడు.
ఇరు జట్లు:
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): మయాంక్ అగర్వాల్, వివ్రాంత్ శర్మ, ఐడెన్ మార్క్‌రామ్(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్(కీపర్), హ్యారీ బ్రూక్, నితీష్ రెడ్డి, గ్లెన్ ఫిలిప్స్, సన్వీర్ సింగ్, మయాంక్ డాగర్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్.
SRH ఇంపాక్ట్ ప్లేయర్స్: మయాంక్ మార్కండే, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, అకేల్ హోసేన్, అబ్దుల్ సమద్.
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(కీపర్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, క్రిస్ జోర్డాన్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెన్ డార్ఫ్, కుమార్ కార్తికేయ, ఆకాష్ మధ్వల్.
MI ఇంపాక్ట్ ప్లేయర్స్: రమణదీప్ సింగ్, విష్ణు వినోద్. ట్రిస్టన్ స్టబ్స్, తిలక్ వర్మ, సందీప్ వారియర్.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..