MI vs CSK, IPL 2024: రోహిత్ శర్మ సెంచరీ వృథా.. ముంబయిపై చెన్నై విజయం

Mumbai Indians vs Chennai Super Kings: ఐపీఎల్‌ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ జోరు కొనసాగుతోంది. వరుస విజయాలతో ప్లే ఆఫ్ కు దగ్గరవుతోంది. తాజాగా వాంఖడే మైదానం వేదికగా జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ ను 20 పరుగుల తేడాతో ఓడించింది చెన్నై సూపర్ కింగ్స్.

MI vs CSK, IPL 2024: రోహిత్ శర్మ సెంచరీ వృథా.. ముంబయిపై చెన్నై విజయం
Mumbai Indians Vs Chennai S
Follow us

|

Updated on: Apr 14, 2024 | 11:39 PM

Mumbai Indians vs Chennai Super Kings: ఐపీఎల్‌ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ జోరు కొనసాగుతోంది. వరుస విజయాలతో ప్లే ఆఫ్ కు దగ్గరవుతోంది. తాజాగా వాంఖడే మైదానం వేదికగా జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ ను 20 పరుగుల తేడాతో ఓడించింది చెన్నై సూపర్ కింగ్స్. టాస్ ఓడి బ్యాటింగ్‌ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. రుతురాజ్‌(69), శివమ్‌ దూబె(66 నాటౌట్), ధోనీ (20 నాటౌట్) మెరుపులు మెరిపించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 186 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్ రోహిత్‌ శర్మ (63 బంతుల్లో 105 నాటౌట్, 11 ఫోర్లు, 5 సిక్స లు) శతకంతో చెలరేగినా భారీ టార్గెట్ కావడంతో జట్టును గెలిపించలేకపోయాడు. తిలక్ వర్మ (31), ఇషాన్ కిషన్ (21) మినహా మరే బ్యాటర్లు పెద్దగా పరుగులు చేయలేకపోవడంతో ముంబైకు మరో పరాజయం తప్పలేదు. చెన్నై బౌలర్లలో పతిరన 4 వికెట్లు పడగొట్టగా, తుషార్‌ దేశ్‌పాండే ఒక వికెట్‌ తీశారు.

రోహిత్ శర్మ సెంచరీతో మెరిసినా..

ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ ఎలెవన్

రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), టిమ్ డేవిడ్, మహ్మద్ నబీ, రొమారియో షెపర్డ్, శ్రేయస్ గోపాల్, జెరాల్డ్ కోయెట్జీ, జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ మధ్వల్

ఇంపాక్ట్ ప్లేయర్లు:

సూర్యకుమార్ యాదవ్, డెవాల్డ్ బ్రీవిస్, నమన్ ధీర్, నెహాల్ వధేరా, హార్విక్ దేశాయ్

చెన్నై సూపర్ కింగ్స్

రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), అజింక్యా రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వీ, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రెహమాన్.

ఇంపాక్ట్ ప్లేయర్లు:

మతీషా పతిరణ, నిశాంత్ సింధు, మిచెల్ సాంట్నర్, మొయిన్ అలీ, షేక్ రషీద్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..