Video: మెరుపు కన్నా వేగం.. 0.12 సెకన్లలో ధోని కళ్లు చెదిరే స్టంపింగ్.. వైరల్ వీడియో చూశారా?
MS Dhoni Stumping to Dismiss Suryakumar Yadav Video: ఎంఏ చిదంబరం స్టేడియంలో ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ముంబై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను కళ్లు చెదిరే స్టంపింగ్‌తో ఊహించని షాకిచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

MS Dhoni Stumping to Dismiss Suryakumar Yadav: ఐపీఎల్ (IPL 2025) లో చెపాక్ స్టేడియంలో CSK వర్సెస్ MI మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో 43 ఏళ్ల ఎంఎస్ ధోని ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇచ్చాడు. చెన్నై మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మెరుపు స్టంపింగ్‌తో ముంబై జట్టును తీవ్రంగా నిరాశపరిచాడు. మ్యాచ్ 11వ ఓవర్‌లో తలా తన పాత స్టప్పింగ్‌లను మరోసారి అభిమానులకు పరిచయం చేశాడు.
11వ ఓవర్ 3వ బంతికి, నూర్ అహ్మద్ సూర్యకుమార్ యాదవ్‌ను గూగ్లీతో బోల్తా కొట్టించాడు. ఈ బంతిని అంచనా వేయడంలో పొరబడిన సూర్య.. క్రీజు వెలుపల వచ్చి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఇంతలో తలా తన వింటేజ్ స్టైల్‌లో, రెప్పపాటులో అంటే కేవలం 0.12 సెకండ్లలోనే బెయిల్స్‌ను పడగొట్టాడు. ఇది చూసి షాకవ్వడం సూర్యకుమార్ వంతైంది.
0.12 సెకన్లలో ఎంఎస్ ధోని స్టంపింగ్ వీడియో..
🚄: I am fast ✈: I am faster MSD: Hold my gloves 😎
Nostalgia alert as a young #MSDhoni flashes the bails off to send #SuryakumarYadav packing!
FACT: MSD affected the stumping in 0.12 secs! 😮💨
Watch LIVE action: https://t.co/uN7zJIUsn1 #IPLonJioStar 👉 #CSKvMI, LIVE NOW on… pic.twitter.com/oRzRt3XUvC
— Star Sports (@StarSportsIndia) March 23, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..