- Telugu News Photo Gallery Cricket photos CSK vs MI: Rohit Sharma out on 0 for 18th time in IPL career in Chennai vs mumbai ipl 205 match
Rohit Sharma: 18 ఏళ్లలో 18వ సారి.. ఐపీఎల్ హిస్టరీలోనే ‘హిట్‌మ్యాన్’ చెత్త రికార్డ్..
కొన్ని రోజుల క్రితం ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీం ఇండియా తరపున అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన తర్వాత, ఈ ఐపీఎల్‌లో రోహిత్ శర్మపై భారీ అంచనాలు ఉన్నాయి. కానీ. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లోనే, ముంబై ఇండియన్స్ అతిపెద్ద ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ తీవ్రంగా నిరాశపరిచాడు.
Updated on: Mar 23, 2025 | 8:39 PM

గత 10 నెలల్లో టీ20 ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌ను విజయపథంలో నడిపించిన రోహిత్ శర్మ.. ఐపీఎల్‌లో మంచి పునరాగమనాన్ని సాధించలేదు. తన అతిపెద్ద ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన సీజన్ తొలి మ్యాచ్‌లోనే, ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఘోరంగా విఫలమయ్యాడు. ఖాతా తెరవకుండానే మొదటి ఓవర్‌లోనే ఔటై పెవిలియన్‌కు చేరాడు. దీంతో, ఐపీఎల్‌లో అత్యధిక సార్లు సున్నా (డక్) వద్ద ఔటైన రికార్డును రోహిత్ సమం చేశాడు.

లీగ్ చరిత్రలో 18వ సారి రోహిత్ పరుగులు లేకుండానే ఔటయ్యాడు. గ్లెన్ మాక్స్వెల్, దినేష్ కార్తీక్‌లతో సమంగా నిలిచాడు. మ్యాచ్ మొదటి ఓవర్లో మిడ్ వికెట్ వద్ద శివమ్ దూబేకు క్యాచ్ ఇచ్చి నాలుగు బంతుల్లో జీరో పరుగులకే పెవిలియన్ చేరాడు.

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై రోహిత్‌కు ఇది నాల్గవ డకౌట్ కావడం గమనార్హం. రోహిత్ శర్మ రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై నాలుగుసార్లు ఖాతా తెరవడంలో విఫలమయ్యాడు.

రోహిత్ శర్మ - 253 ఇన్నింగ్స్‌లలో 18 సార్లు డకౌట్ అయ్యాడు. గ్లెన్ మాక్స్వెల్ - 129 ఇన్నింగ్స్‌లలో 18 సార్లు డకౌట్ అయ్యాడు.

దినేష్ కార్తీక్ - 234 ఇన్నింగ్స్‌లలో 18 సార్లు, పియూష్ చావ్లా - 92 ఇన్నింగ్స్‌లలో 16 సార్లు, సునీల్ నరైన్ - 111 ఇన్నింగ్స్‌లలో 16 సార్లు డకౌట్ అయ్యారు.





























