AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sachin-Kohli: విరాట్‌ కోహ్లీని అధిగమించిన లిటిల్ మాస్టర్.. 8 ఏళ్ల క్రితం పదవీ విరమణ చేసినా ఆ జాబితాలో జోరు తగ్గని సచిన్..!

8 సంవత్సరాల క్రితం క్రికెట్ ఫీల్డ్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న సచిన్, నేటికీ ప్రజల్లో ఏమాత్రం ప్రజాదరణ తగ్గలేదు. సచిన్ ఈ జాబితాలో ఓవరాల్‌గా..

Sachin-Kohli: విరాట్‌ కోహ్లీని అధిగమించిన లిటిల్ మాస్టర్.. 8 ఏళ్ల క్రితం పదవీ విరమణ చేసినా ఆ జాబితాలో జోరు తగ్గని సచిన్..!
IND vs WI Records: భారత్, వెస్టిండీస్ మధ్య వన్డే, టీ20 సిరీస్‌ ఫిబ్రవరి 6 నుంచి మొదలుకానుంది. ఈమేరకు ఇరు జట్ల మమధ్య నెలకొన్న కొన్ని రికార్డులను ఇప్పుడు పరిశీలిద్దాం. అయితే వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు.
Venkata Chari
| Edited By: Anil kumar poka|

Updated on: Dec 16, 2021 | 11:45 AM

Share

Most Admired Sportspersons Of 2021: YouGov అనే వెబ్‌సైట్ 2021 సంవత్సరానికి సంబంధించి ‘అత్యంతప్రజాదరణ వ్యక్తుల’ జాబితాను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా టాప్ 20లో వ్యక్తుల గురించి ఈ సర్వేలో పేర్కొన్నారు. ఈ జాబితాలో, క్రీడా ప్రపంచం నుంచి నలుగురు చోటు సంపాదించారు. ఇందులో అత్యంత ప్రత్యేకమైన పేరు ‘లార్డ్ ఆఫ్ క్రికెట్’గా ప్రసిద్ధి చెందిన సచిన్ టెండూల్కర్ నిలవడం గమనార్హం.

8 సంవత్సరాల క్రితం క్రికెట్ ఫీల్డ్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న సచిన్, నేటికీ ప్రజల్లో ఏమాత్రం ప్రజాదరణ తగ్గలేదు. సచిన్ ఈ జాబితాలో ఓవరాల్‌గా 12వ స్థానంలో, క్రీడా విభాగంలో మూడవ స్థానంలో నిలిచాడు. ప్రస్తుత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓవరాల్‌గా 18వ ర్యాంక్‌తో పాటు స్పోర్ట్స్ విభాగంలో నాలుగో స్థానంలో నిలిచాడు. విరాట్ కోహ్లి ప్రస్తుతం అత్యధిక సోషల్ మీడియా ఫాలోవర్లను కలిగి ఉన్న భారతీయ ఆటగాడిగా నిలిచాడు. అయినా సచిన్ కంటే ఎక్కువ జనాదరణ పొందలేకపోయాడు.

2013లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైరైన సచిన్ టెండూల్కర్ ఈ జాబితాలో 12వ స్థానం నిలవడంతో, నేటికి కూడా ప్రజలు ఆయన్ను ఇష్టపడుతున్నారని చూపిస్తుంది. భారత్ నుంచి భారతరత్న అవార్డు అందుకున్న ఏకైక ఆటగాడు సచిన్ కావడం విశేషం. అదే సమయంలో, వన్డే జట్టులో కెప్టెన్సీ వివాదం గురించి ఈ రోజుల్లో కోహ్లీ చర్చలో నిలిచాడు. అయితే విరాట్‌ను కెప్టెన్‌ పదవి నుంచి తప్పించి రోహిత్‌ను వన్డే సారథిగా చేశారు.

పాకిస్థాన్ మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్‌, మాజీ ఆల్ రౌండర్ ఇమ్రాన్ ఖాన్ కూడా ఈ జాబితాలో చేరారు. పాకిస్తాన్ తరపున ప్రపంచ కప్ గెలిచిన ఏకైక కెప్టెన్ ఇమ్రాన్ అని తెలిసిందే. తన దేశంలోని అత్యంత విజయవంతమైన క్రికెటర్లలో ఒకరిగా పేరుగాంచాడు. కానీ, ప్రస్తుతం అతను పాకిస్తాన్ ప్రధాన మంత్రిగా ఉన్నారు. అతని రాజకీయ వ్యక్తిత్వం కారణంగా ఈ జాబితాలో చోటు సంపాదించాడు. ఈ జాబితాలో 17వ ర్యాంక్‌లో నిలిచారు.

రొనాల్డో 4వ స్థానంలో.. మాంచెస్టర్ యునైటెడ్, పోర్చుగల్ ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో ​​రొనాల్డో ఈ జాబితాలో 4వ స్థానంలో ఉన్నారు. ఈ కోణంలో, ఈ జాబితాలో చేర్చబడిన క్రీడాకారులలో రొనాల్డో పేరు అగ్రస్థానంలో నిలిచింది. ఇటీవల, రొనాల్డో ప్రపంచంలో 800 గోల్స్ చేసిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. ఆర్సెనల్‌పై 2 గోల్స్ చేసిన తర్వాత మాంచెస్టర్ యునైటెడ్ స్ట్రైకర్ ఈ ఫీట్ సాధించాడు. రొనాల్డో యూరో 2020లో పోర్చుగల్‌కు గోల్డెన్ బూట్ కూడా గెలుచుకున్నాడు.

7వ స్థానంలో లియోనెల్ మెస్సీ.. అర్జెంటీనా స్టార్ ప్లేయర్, ఫుట్‌బాల్ మైదానంలో క్రిస్టియానో ​​రొనాల్డోకు అతిపెద్ద పోటీదారు లియోనెల్ మెస్సీ ఈ జాబితాలో 7వ స్థానంలో ఉన్నాడు. కొద్ది రోజుల క్రితం, ఈ ఆటగాడు ఫుట్‌బాల్ ప్రపంచంలోనే అతిపెద్ద టైటిల్ అయిన బాలన్ డి’ఓర్ అవార్డును రికార్డు స్థాయిలో ఏడోసారి గెలుచుకున్నాడు.

గతంలో మెస్సీ 2009, 2010, 2011, 2015, 2019లో ఈ అవార్డును గెలుచుకున్నాడు. గత 10 ఏళ్లలో క్రిస్టియానో ​​రొనాల్డో ఈ అవార్డు రేసులో టాప్-3లోకి రాకపోవడం ఇదే తొలిసారి.

Also Read: Virat Kohli vs BCCI: వన్డేలకు సిద్ధమే.. వన్డే కెప్టెన్సీపై ఎవరూ నాతో మాట్లాడలేదు.. మా మధ్య గొడవల్లేవు: కోహ్లీ కీలక వ్యాఖ్యలు

India Tour Of South Africa: కోహ్లీ సేనకు గుడ్ న్యూస్ చెప్పిన దక్షిణాఫ్రికా.. క్వారంటైన్‌లో ఎన్ని రోజులంటే?