AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: షమీ లైఫ్ ఇచ్చాడు.. వరుణ్ మిస్ట్రీ బాల్‌తో ముంచేశాడు.. భారత్‌కు తలనొప్పి తగ్గిందిలా

Travis Head Out Video: ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించింది.13 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా జట్టు రెండు వికెట్లకు 72 పరుగులు చేసింది. వరుణ్ చక్రవర్తి తన తొలి ఓవర్లోనే ట్రావిస్ హెడ్‌ను ఔట్ చేశాడు. శుభ్‌మాన్ గిల్ క్యాచ్ పట్టడంతో 39 పరుగులు చేసిన తర్వాత హెడ్ అవుట్ పెవిలియన్ చేరాల్సి వచ్చింది.

Video: షమీ లైఫ్ ఇచ్చాడు.. వరుణ్ మిస్ట్రీ బాల్‌తో ముంచేశాడు.. భారత్‌కు తలనొప్పి తగ్గిందిలా
Travis Head Out Video
Venkata Chari
|

Updated on: Mar 04, 2025 | 3:35 PM

Share

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఇండియా-ఆస్ట్రేలియా పోరు ఎట్టకేలకు ప్రారంభమైంది. దుబాయ్‌లో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఓపెనర్లుగా బరిలోకి దిగిన ట్రావిస్ హెడ్, కూపర్ కొన్నోలీలు నెమ్మదిగా ఇన్నింగ్స్ ప్రారంభించారు. అయితే, తొలి ఓవర్ వేసిన షమీ.. ఓ అద్భుత అవకాశాన్ని వదిలేశాడు. మొదటి ఓవర్లోనే ట్రావిస్ హెడ్‌ను పెవిలియన్ చేర్చే అవకాశం వచ్చినా.. వృథా చేశాడు. అయితే, ఇది అంత తేలికైన క్యాచ్ కాదు. సగం అవకాశం మాత్రమే. కానీ, షమీ దానిని పట్టుకుని ఉంటే ఆస్ట్రేలియాకు పెద్ద దెబ్బ తగిలేది.

తొలి బంతికే ట్రావిస్ హెడ్‌కు లైఫ్..

మ్యాచ్‌లో ఇది మొదటి లీగల్ బాల్. మహమ్మద్ షమీ ఒక లెంగ్త్ డెలివరీని మిడిల్, లెగ్‌లోకి సంధించాడు. ట్రావిస్ హెడ్ దానిని లెగ్ సైడ్ వైపునకు పంపేందుకు ప్రయత్నించాడు. కానీ, బౌలర్ కుడి వైపున లీడింగ్ ఎడ్జ్‌ తీసుకుంది. షమీ క్యాచ్ తీసుకోవడానికి తన చేతిని చాచాడు. కానీ, బంతిని పట్టుకోలేకపోయాడు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత క్రికెట్ అభిమానులను నిరాశపరిచింది.

ఈ క్రమంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఎక్స్‌ప్రెషన్స్ కెమెరా కంటికి చిక్కాయి. మొదట ఆనందంతో ఎగిరి, ఆపై నిరాశతో పైకి చూశాడు. షమీ మరో ఓపెనర్ కూపర్ కొన్నోలీ వికెట్ తీసుకున్నాడు.

వరుణ్ మాయలో చిక్కిన ట్రావిస్ హెడ్..

అనంతరం ఇన్నింగ్స్ నాల్గవ ఓవర్లో 17 పరుగులు రాబట్టాడు. హార్దిక్ పాండ్యా వేసిన ఈ ఓవర్లో, ట్రావిస్ హెడ్ వరుసగా రెండు బౌండరీలు బాదాడు, అందులో ఒక ఫోర్, ఒక సిక్సర్ ఉన్నాయి. 5వ ఓవర్లో, షమీ వేసిన బంతికి ట్రావిస్ హెడ్ వరుసగా 3 ఫోర్లు బాదాడు. అతను 3వ, 4వ, 5వ బంతులను బౌండరీ లైన్ దాటి కొట్టాడు. దీంతో మరోసారి భారత జట్టుకు తలనొప్పిలా మారిన్ హెడ్ వికెట్ కోసం రోహిత్ స్పిన్నర్లను రంగంలోకి దింపాడు.

9వ ఓవర్లో ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. ట్రావిస్ హెడ్ 39 పరుగులు చేసి ఔటయ్యాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో శుభ్‌మాన్ గిల్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో టీమిండియాకు తలనొప్పి తగ్గింది. వరుణ్ తన మొదటి ఓవర్‌లో రెండో బంతికే హెడ్‌ను ఇంటికి పంపాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఈ మేకకు ఏమైందో చూడండి..
ఈ మేకకు ఏమైందో చూడండి..
మరో నాలుగు రోజుల్లో ఈ రాశుల జీవితాల్లో కీలక మలుపు.. దశ తిరగడం..
మరో నాలుగు రోజుల్లో ఈ రాశుల జీవితాల్లో కీలక మలుపు.. దశ తిరగడం..
గంభీర్ సార్..ఈమె మహికా..తన గర్ల్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసిన హార్దిక్
గంభీర్ సార్..ఈమె మహికా..తన గర్ల్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసిన హార్దిక్
సమ్మర్‌ స్పెషల్ ఫ్రూట్‌.. ఈ పండ్లు తింటే గుండెకు చాలా మంచిది..!
సమ్మర్‌ స్పెషల్ ఫ్రూట్‌.. ఈ పండ్లు తింటే గుండెకు చాలా మంచిది..!
తక్కువ తిన్నా బరువు పెరుగుతున్నారా.. తిండి కాదు.. అసలు నిజాలు..
తక్కువ తిన్నా బరువు పెరుగుతున్నారా.. తిండి కాదు.. అసలు నిజాలు..
ఎండాకాలంలో పచ్చి ఉల్లిపాయలు తప్పక తినండి..! ఆరోగ్య ప్రయోజనాలు
ఎండాకాలంలో పచ్చి ఉల్లిపాయలు తప్పక తినండి..! ఆరోగ్య ప్రయోజనాలు
ముందేమో పెళ్లి ప్రపోజల్.. తీరా సెట్టయ్యాక దిమ్మ తిరిగే ట్విస్ట్
ముందేమో పెళ్లి ప్రపోజల్.. తీరా సెట్టయ్యాక దిమ్మ తిరిగే ట్విస్ట్
అందరికీ అంతర్జాతీయ మహిళ దినోత్సవ శుభాకాంక్షలు..
అందరికీ అంతర్జాతీయ మహిళ దినోత్సవ శుభాకాంక్షలు..
హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఆ రేట్లను పెంచుతూ బ్యాంకు
హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఆ రేట్లను పెంచుతూ బ్యాంకు
కెరీర్ ఖతం అనుకునేరు.. వాడు కోహ్లీ లెక్క.. ఫైనల్‌లో ఊహకందని ఊచకోత
కెరీర్ ఖతం అనుకునేరు.. వాడు కోహ్లీ లెక్క.. ఫైనల్‌లో ఊహకందని ఊచకోత