AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Cup 2027 : ఉన్నట్లుండి శ్రీలంకకు పరిగెత్తిన అజిత్ అగార్కర్.. ఇప్పటినుంచే 2027 వరల్డ్ కప్‌ కోసం భారీ స్కెచ్

World Cup 2027 : 2027 వరల్డ్ కప్ లక్ష్యంగా బీసీసీఐ ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అజిత్ అగార్కర్ శ్రీలంకలో ఇండియా-ఏ ఆటగాళ్లను పరిశీలిస్తున్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వారసుల కోసం వైభవ్ సూర్యవంశీ, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

World Cup 2027 : ఉన్నట్లుండి శ్రీలంకకు పరిగెత్తిన  అజిత్ అగార్కర్.. ఇప్పటినుంచే 2027 వరల్డ్ కప్‌ కోసం భారీ స్కెచ్
Ajit Agarkar
Rakesh
|

Updated on: Jun 09, 2026 | 6:19 PM

Share

World Cup 2027 : ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన వెంటనే బీసీసీఐ తన తదుపరి మిషన్‌పై దృష్టి పెట్టింది. 2027 వన్డే వరల్డ్ కప్‌కు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ ఇప్పటి నుంచే రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయడం ప్రారంభించింది. భవిష్యత్తులో టీమిండియాను నడిపించే అత్యుత్తమ ఆటగాళ్లను ఎంపిక చేసేందుకు అగార్కర్ రంగంలోకి దిగారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న ఇండియా-ఎ జట్టు ప్రదర్శనను ఆయన నిశితంగా గమనిస్తున్నారు.

ఇండియా-ఎ, శ్రీలంక-ఎ జట్ల మధ్య జూన్ 9వ తేదీ మంగళవారం దంబూల్లా వేదికగా మొదటి అఫీషియల్ వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ స్వయంగా శ్రీలంకకు వెళ్లడం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కొద్దిరోజుల క్రితమే విదేశీ సిరీస్‌ల కోసం భారత జట్లను ప్రకటించిన అగార్కర్, ఇప్పుడు ఏకంగా లంకలోనే ల్యాండ్ అయ్యి కుర్రాళ్ల ఆటతీరును దగ్గరుండి పరిశీలిస్తున్నారు. ఇక్కడ రాణించే ఆటగాళ్లకు నేరుగా సౌతాఫ్రికాలో జరిగే 2027 వరల్డ్ కప్ టికెట్ దక్కే అవకాశం ఉంది.

ప్రస్తుత సీనియర్ జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ ఫిట్‌నెస్, వయసుపై కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్తు ఓపెనర్‌ను తయారు చేయాలని అగార్కర్ భావిస్తున్నారు. అందుకే అందరి కళ్ళు 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై పడ్డాయి. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో వైభవ్ తక్కువ స్కోరుకే అవుట్ అయినప్పటికీ, అతనికి ఇంకా రెండు మ్యాచ్‌ల అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో రోహిత్ స్థానంలో వైభవ్‌ను టీమిండియా ఎక్స్-ఫాక్టర్‎గా మార్చాలని సెలెక్టర్లు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

<blockquote class=”twitter-tweet”><p lang=”zxx” dir=”ltr”><a href=”https://t.co/wGfpjXodJb”>pic.twitter.com/wGfpjXodJb</a></p>&mdash; crictalk (@crictalk7) <a href=”https://x.com/crictalk7/status/2064298967593271599?ref_src=twsrc%5Etfw”>June 9, 2026</a></blockquote> <script async src=”https://platform.x.com/widgets.js” charset=”utf-8″></script>

మరోవైపు మహారాష్ట్ర బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అఫ్గానిస్తాన్‌తో జరిగే వన్డే సిరీస్‌కు అతడిని ఎంపిక చేయకపోవడంపై విమర్శలు వచ్చాయి. అయితే, లంక-ఎ జట్టుపై తొలి వన్డేలోనే సెంచరీ బాది తనేంటో రుతురాజ్ నిరూపించుకున్నాడు. సౌతాఫ్రికాలోని ఫాస్ట్, బౌన్సీ పిచ్‌లపై రుతురాజ్ ఆడే బ్యాక్-ఫుట్ గేమ్ జట్టుకు ఎంతో ప్లస్ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. వరల్డ్ కప్ నాటికి అతడిని మిడిల్ ఆర్డర్‌లో ఒక బలమైన పిల్లర్‌గా మార్చే యోచనలో అగార్కర్ ఉన్నారు.

టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2026 ఫైనల్స్ సమయంలో హ్యామ్‌స్ట్రింగ్ గాయానికి గురై అఫ్గాన్ సిరీస్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం కోహ్లీకి 37 ఏళ్లు దాటడంతో, అతని కెరీర్ తర్వాతి కాలంపై చర్చ మొదలైంది. కోహ్లీ స్థానాన్ని భర్తీ చేయగల సమర్థుడైన నంబర్ 3 బ్యాటర్ కోసం అగార్కర్ వెతుకుతున్నారు. ప్రస్తుత ఫామ్ ప్రకారం తిలక్ వర్మ లేదా రుతురాజ్ గైక్వాడ్ లలో ఒకరు విరాట్ కోహ్లీ వారసుడిగా జట్టులోకి వచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. మరి అగార్కర్ మైండ్‌లో ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

Follow Us