Dinesh Karthik Biopic: దినేష్ కార్తీక్ బయోపిక్‌లో బాలీవుడ్ స్టార్.. ’12th ఫెయిల్’ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
"మీర్జాపూర్" వెబ్ సిరీస్ ద్వారా బాలీవుడ్‌లో పేరు తెచ్చుకున్న విక్రాంత్ మస్సె, టీమిండియా క్రికెటర్ దినేష్ కార్తీక్ బయోపిక్‌లో నటించాలని ఉందని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. కార్తీక్ తన క్రికెట్ కెరీర్‌లోనే కాకుండా, వ్యక్తిగత జీవితంలో కూడా అనేక కష్టాలను ఎదుర్కొని సక్సెస్ సాధించిన పోరాటయోధునిగా తనలో స్పూర్తినింపాడని తెలిపాడు. ఆటలో, వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులను అధిగమించి విజయం సాధించడం తమకు స్ఫూర్తినిచ్చిందని విక్రాంత్ పేర్కొన్నాడు. కార్తీక్‌కు సంబంధించిన బయోపిక్ చేయడం తనకు గర్వంగా ఉంటుందని అన్నాడు.

మీర్జాపూర్ వెబ్ సిరీస్ లో అద్భుతమై నటనతో బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విక్రాంత్ మస్సె ఓ ఆశక్తికర కామెంట్ చేశాడు. తనకు టీమిండియా మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ బయోపిక్‌లో నటించాలని ఉందని తెలిపాడు. తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విక్రాంత్ మస్సె మాట్లాడుతూ దినేష్ కార్తీక్ ఓ పోరాటయోధుడు అని పేర్కొన్నాడు. క్రికెట్ లోనే కాదు వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని నెగ్గుకొచ్చాడని తెలిపాడు. అటు వ్యక్తిగత జీవితంతో పాటు క్రికెట్లో రెండు రకాలుగా కార్తీక్ చూపిన తెగువ అందరికి స్పూర్తిదాయకమని.. అలాంటి రోల్ చేయడం నటుడిగా తనకు కూడా ఎంతో సంతృప్తికరంగా ఉంటుందని తన మనసులో మాట బయట పెట్టాడు.
విక్రాంత్ నటించిన రెండు బయోపిక్ చిత్రాలు ఇటివల విడుదలయ్యి సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా 12th ఫెయిల్ చిత్రం భారీ వసూళ్లతో రికార్డులను బద్దలు కొట్టింది. ఈ చిత్రం ఐపీఎస్ అధికారి మనోజ్ శర్మ జీవితం ఆధారంగా తెరకెక్కింది. ఇది కాకుండా, OTT ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన నిఠారీ సంఘటన ఆధారంగా సెక్టార్ 36లో విక్రాంత్ నటన విమర్శకులను కూడా మొప్పించింది.
అంతర్జాతీయ కెరీర్లో టీమ్ ఇండియా తరఫున దినేష్ కార్తిక్ గొప్పగా సాధించింది ఏమి లేకపోయిన. మూడు ఫార్మాట్లలో టీమిండియా తరఫున ఆడే అవకాశం దక్కించుకున్నాడు. దినేష్ కార్తీక్ భారత్ తరపున 26 టెస్టులు, 94 ODI మ్యాచులు, 60 T20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. టెస్ట్ క్రికెట్లో కార్తీక్ 1025 పరుగులు చేశాడు. 1 సెంచరీతో పాటు 7 అర్ధసెంచరీలు నమోదు చేశాడు.
ఇక వన్డేల్లో కార్తీక్ 1752 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో 9 అర్ధ సెంచరీలు సాధించగా, అంతర్జాతీయ T20లో 686 పరుగులు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కూడా దినేష్ కార్తిక్ తన ప్రతిభను కనబరిచాడు. కార్తీక్ ఐపీఎల్‌లో ఫినిషర్‌గా కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ లో 257 మ్యాచ్‌లు ఆడిన కార్తిక్ 135.36 స్ట్రైక్ రేట్‌తో 4842 పరుగులు చేశాడు. 2024 తర్వాత ఈ లీగ్ నుంచి కూడా కార్తిక్ రిటైర్మెంట్ ప్రకటించాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



