AUS vs PAK: ఆసీస్‌పై ఊహించని ప్రదర్శన.. ధోనీ, రోహిత్ క్లబ్‌లో చేరిన పాక్ పేసర్

AUS vs PAK: ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను పాకిస్థాన్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. పేసర్ హారిస్ రవూఫ్ అద్భుత బౌలింగ్ ప్రదర్శన పాక్ విజయానికి ప్రధాన కారణంగా నిలిచింది. రవూఫ్ మొత్తం సిరీస్‌లో 10 వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా ఎంపికయ్యాడు. దీంతో రౌఫ్, ధోనీ, రోహిత్ శర్మలు ఎక్స్ క్లూజివ్ క్లబ్‌లో చేరారు.

Venkata Chari

|

Updated on: Nov 10, 2024 | 6:30 PM

ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను పాకిస్థాన్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. పెర్త్ వేదికగా ఆదివారం జరిగిన చివరి వన్డేలో పాకిస్థాన్ 8 వికెట్ల తేడాతో కంగారూలపై విజయం సాధించింది. పాక్ జట్టు ఈ చారిత్రాత్మక విజయంలో పేసర్ హారిస్ రవూఫ్ కీలక పాత్ర పోషించాడు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో మొత్తం 10 వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా ఎంపికయ్యాడు.

1 / 5
ఆస్ట్రేలియాతో జరిగిన రెండవ, మూడవ ODIలలో అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్న రవూఫ్ ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. అలాగే, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డును కూడా గెలుచుకున్నాడు. ఈ అవార్డును గెలుచుకోవడం ద్వారా, రౌఫ్ భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని, రోహిత్ శర్మల ప్రత్యేక క్లబ్‌లో చేరాడు.

2 / 5
వాస్తవానికి, గత 10 ఏళ్లలో ఆస్ట్రేలియా గడ్డపై వన్డేల్లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డును గెలుచుకున్న ఐదవ విజిటింగ్ క్రికెటర్‌గా రౌఫ్ నిలిచాడు. రవూఫ్ కంటే ముందు, భారత మాజీ కెప్టెన్ ధోనీ 2019లో ఈ అవార్డును గెలుచుకోగా, దక్షిణాఫ్రికాకు చెందిన డేవిడ్ మిల్లర్, ఇంగ్లాండ్‌కు చెందిన జో రూట్ 2018లో అవార్డును గెలుచుకున్నారు.

3 / 5
2016లో ఆస్ట్రేలియాలో టీమిండియా ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ ఈ అవార్డును గెలుచుకున్నాడు. ఇప్పుడు రౌఫ్ ఈ అవార్డును దక్కించుకున్నాడు. సిరీస్ అంతటా అద్భుత ప్రదర్శన కనబర్చిన రవూఫ్ మెల్‌బోర్న్‌లో జరిగిన తొలి వన్డేలో 67 పరుగులిచ్చి 3 వికెట్లు, రెండో మ్యాచ్‌లో 29 పరుగులకు ఐదు వికెట్లు, మూడో వన్డేలో 24 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.

4 / 5
సిరీస్ గెలిచిన అనంతరం రౌఫ్ మాట్లాడుతూ.. ‘‘గత కొన్ని నెలలుగా మేం చాలా కష్టాలు పడుతున్నాం. ఇప్పుడు ఈ సిరీస్ విజయం పాకిస్థాన్ జట్టుకు చాలా ముఖ్యమైనది. మమ్మల్ని ఆదరించడానికి ఇక్కడికి వచ్చిన అభిమానులందరికీ ధన్యవాదాలు. ప్రపంచవ్యాప్తంగా మాకు మద్దతు ఇస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చాడు.

5 / 5
Follow us