ఐపీఎల్ 2024లో అత్యంత విజయవంతమైన బ్యాట్స్‌మెన్లలో అభిషేక్ శర్మ ఒకడు. అతను 16 మ్యాచ్‌లలో 32.26 సగటు, 204.21 స్ట్రైక్ రేట్‌తో 484 పరుగులు చేశాడు. ఇందులో 3 అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి. దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ హైదరాబాద్ జట్టుకు శుభారంభం అందించాడు. కానీ, టీమిండియా తరుపున ఇంతవరకు అలాంటి ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. ఇటువంటి పరిస్థితిలో, దక్షిణాఫ్రికా సిరీస్‌లో రాబోయే మ్యాచ్‌లు అతని కెరీర్‌ను పరిగణనలోకి తీసుకుంటే చాలా ముఖ్యమైనవి. అతని ఆట మెరుగుపడకపోతే, టెన్షన్ పెరిగే అవకాశం ఉంది.