AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli : విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌పై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ల మధ్య వార్.. మొత్తానికి ఫ్యాన్స్ రియాక్షన్ మాత్రం అదిరింది

Virat Kohli : ఐపీఎల్ 2026లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌పై మైకేల్ వాన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్నాయి. కోహ్లీ కంటే జో రూట్ మేలన్న వాన్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఐపీఎల్ 2026లో విరాట్ కోహ్లీ ఆరెంజ్ క్యాప్ రేసులో దూసుకుపోతున్నాడు.

Virat Kohli : విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌పై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ల మధ్య వార్.. మొత్తానికి ఫ్యాన్స్ రియాక్షన్ మాత్రం అదిరింది
Virat Kohli
Rakesh
|

Updated on: Apr 26, 2026 | 10:08 AM

Share

Virat Kohli : క్రికెట్ దేవుడు విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన గ్రౌండ్లోకి అడుగు పెడుతున్నాడంటే చాటు స్టేడియం నిండిపోయాల్సిందే. తను బ్యాటింగ్ చేస్తుంటే చూడడం ఒక మధురమైన అనుభూతి. అతని క్లాసిక్ షాట్లు, కవర్ డ్రైవ్‌లు చూసి ఫిదా అవ్వని క్రికెట్ ప్రేమికుడు ఉండడు. తాజాగా ఐపీఎల్ 2026లో కోహ్లీ ఫామ్ చూసి ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ శామ్ బిల్లింగ్స్ కూడా ముగ్ధుడైపోయాడు. అయితే ఇదే విషయంలో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ వేలు పెట్టడంతో సోషల్ మీడియాలో పెద్ద రచ్చ మొదలైంది. కోహ్లీ కంటే జో రూట్ బ్యాటింగ్‌ చూడటమే బాగుంటుందని వాన్ కామెంట్ చేయడంలో టీమిండియా ఫ్యాన్స్ అతడిని ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు.

అసలేం జరిగింది?

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ కేవలం 44 బంతుల్లో 81 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. అతని క్లాసిక్ ఇన్నింగ్స్ చూసిన శామ్ బిల్లింగ్స్, “కోహ్లీ ఫుల్ ఫ్లోలో ఆడుతుంటే చూడడం కంటే గొప్ప విషయం ఏదైనా ఉందా?” అని ట్వీట్ చేశాడు. దానికి మైకేల్ వాన్ స్పందిస్తూ.. “అవును ఉంది.. అది జో రూట్ బ్యాటింగ్” అంటూ స్మైలీ ఎమోజీని యాడ్ చేశాడు.

ఫ్యాన్స్ ఆగ్రహం

వాన్ చేసిన ఈ కామెంట్ నెటిజన్లకు తీవ్రఆగ్రహం తెప్పించింది. కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో 85 సెంచరీలతో దూసుకుపోతుంటే, జో రూట్‌ను అతనితో పోల్చడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో కోహ్లీ స్ట్రైక్ రేట్, దూకుడు ముందు రూట్ ఎక్కడా సరిపోడని ఫ్యాన్స్ స్టాటిస్టిక్స్‌తో సహా వాన్‌ను ట్రోల్ చేస్తున్నారు. “నీకు ఇంగ్లాండ్ పిచ్చి ఉంటే ఇంట్లో పెట్టుకో.. కోహ్లీ రేంజ్ వేరు” అంటూ నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు.

కోహ్లీ భీభత్సమైన ఫామ్

ఐపీఎల్ 2026లో విరాట్ కోహ్లీ ఆరెంజ్ క్యాప్ రేసులో దూసుకుపోతున్నాడు. ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లోనే 328 పరుగులు సాధించాడు. అతని స్ట్రైక్ రేట్ కూడా 163 కంటే ఎక్కువగా ఉండడం విశేషం. టెస్టులు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కోహ్లీ మరింత స్వేచ్ఛగా ఆడుతున్నాడని, అతని బ్యాటింగ్‌లో పాత పదును మళ్ళీ కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. కోహ్లీ ఫామ్ చూస్తుంటే ఈసారి ఆరెంజ్ క్యాప్ కొట్టడం ఖాయమని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మనీ స్ప్లాషింగ్.. అనుష్క ఎక్స్‌ప్రెషన్

ఈ మ్యాచ్‌లో కోహ్లీ ఒక భారీ సిక్సర్ కొట్టినప్పుడు స్టాండ్స్‌లో ఉన్న అనుష్క శర్మ సంబరాలు చేసుకున్న తీరు కూడా వైరల్ అయ్యింది. ఆమె ముఖంలో కనిపించిన గర్వం, ఆనందం కెమెరా కంటికి చిక్కాయి. ఒకవైపు మైదానంలో కోహ్లీ పరుగుల వేట కొనసాగుతుంటే, మరోవైపు బయట మైకేల్ వాన్ వంటి వారు ఇలాంటి కామెంట్లతో వార్తల్లో నిలుస్తున్నారు. ఏదేమైనా కోహ్లీ తన బ్యాట్‌తోనే అందరికీ సమాధానం చెబుతున్నాడు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us