టీమిండియాపై తోకముడిచాడు.. కట్ చేస్తే.. 13 ఫోర్లు, 6 సిక్సర్లతో మ్యాచ్ మలుపు తిప్పేశాడు.. ఎవరంటే.?

వన్డే వరల్డ్‌కప్ ముందు టీమిండియాలో టూర్‌కొచ్చిన ఓ ప్లేయర్.. రోహిత్‌సేనపై పేలవ ప్రదర్శన కనబరిచి తోకముడిచాడు. కానీ కట్ చేస్తే.. ఇప్పుడు ఓ డొమెస్టిక్ మ్యాచ్‌లో దుమ్ములేపాడు. తన జట్టుకు కీలక విజయాన్ని అందించడంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఇంతకీ ఆ ప్లేయర్ ఎవరని అనుకుంటున్నారా.? ఆ మ్యాచ్ కూడా ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..

టీమిండియాపై తోకముడిచాడు.. కట్ చేస్తే.. 13 ఫోర్లు, 6 సిక్సర్లతో మ్యాచ్ మలుపు తిప్పేశాడు.. ఎవరంటే.?
Ind Vs Aus
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 19, 2023 | 1:25 PM

వన్డే వరల్డ్‌కప్ ముందు టీమిండియాలో టూర్‌కొచ్చిన ఓ ప్లేయర్.. రోహిత్‌సేనపై పేలవ ప్రదర్శన కనబరిచి తోకముడిచాడు. కానీ కట్ చేస్తే.. ఇప్పుడు ఓ డొమెస్టిక్ మ్యాచ్‌లో దుమ్ములేపాడు. తన జట్టుకు కీలక విజయాన్ని అందించడంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఇంతకీ ఆ ప్లేయర్ ఎవరని అనుకుంటున్నారా.? ఆ మ్యాచ్ కూడా ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..

వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో డొమెస్టిక్ వన్డే కప్ జరుగుతోంది. ఇటీవల విక్టోరియా, క్వీన్స్‌ల్యాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో రైట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాటర్ మ్యాథ్యూ షార్ట్ అద్భుత సెంచరీతో అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన విక్టోరియా జట్టుకు ఓపెనర్లు మంచి శుభారంభాన్ని అందించారు. మాథ్యూ షార్ట్(134), రోజర్స్(42) మొదటి వికెట్‌కు 127 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 42 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రోజర్స్ ఔట్ అయినా.. మరో ఎండ్‌లో షార్ట్ పరుగుల వరద పారించాడు. ఈ క్రమంలోనే తన సెంచరీని 82 బంతుల్లో పూర్తి చేశాడు. అలాగే ఆ తర్వాత ఫోర్లు, సిక్సర్లతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. చివరికి 100 బంతుల్లో 13 ఫోర్లు, 6 సిక్సర్లతో 134 పరుగులు చేశాడు. చివర్లో జోనాథన్ మెర్లో(54) అర్ధ శతకంతో మెరపులు మెరిపించడంతో విక్టోరియా జట్టు నిర్ణీత ఓవర్లకు 6 వికెట్లు నష్టపోయి 349 పరుగులు చేసింది. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన క్వీన్స్‌ల్యాండ్.. టార్గెట్‌ను చేధించడంలో చతికిలబడింది. ఆ జట్టు బ్యాటర్లు రెన్‌షా(102), మెక్‌దేర్మొట్(86), బ్రయంట్(62) మినహా మిగిలిన వారెవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్ సాధించలేకపోయారు. దీంతో ఆ జట్టు 330 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో విక్టోరియా జట్టు 19 పరుగుల తేడాతో విజయం సాధించింది.

కాగా, మాథ్యూ షార్ట్ వన్డే వరల్డ్‌కప్ ముందు టీమిండియాతో సిరీస్‌కు ఎంపికయ్యాడు. ట్రావిస్ హెడ్ స్థానంలో అతడు ఆస్ట్రేలియా జట్టులోకి వచ్చాడు. అయితే ఆ సమయంలో దొరికిన ఛాన్స్‌లను అతడు సద్వినియోగం చేసుకోలేకపోయాడు. భారత పిచ్‌లపై తేలిపోయాడు. అనంతరం ప్రపంచకప్ ఫైనల్ ప్రాబబుల్స్‌లో చోటు దక్కించుకోలేకపోయాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..