IND vs BAN ICC World Cup 2023 Highlights: బంగ్లాపై ఘనవిజయం.. విన్నింగ్ షాట్‌తో సెంచరీ కొట్టిన కోహ్లీ..
IND vs BAN, ICC world Cup 2023 Highlights: టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుని, నిర్ణీత 50 ఓవర్లలో 256 పరుగులు చేసింది. దీంతో రోహిత్ సేనకు 257 పరుగుల టార్గెట్‌ను అందించింది. బంగ్లా బ్యాటర్లలో తస్జీద్ హసన్ 51, లిటన్ దాస్ 66 పరుగులతో ఆకట్టుకోగా, చివర్లో వచ్చిన మహ్మదుల్లా 46 పరుగులతో స్కోర్‌ను 250 దాటించడంలో సహాయపడ్డాడు. ఇక భారత బౌలర్లలో సిరాజ్, జడేజా తలో 2 వికెట్లు పడగొట్టగా.. బుమ్రా, శార్దుల్, కుల్దీప్ తలో వికెట్ పడగొట్టారు.
IND vs BAN, ICC world Cup 2023 Highlights: ప్రపంచకప్ 2023లో టీమిండియా వరుసగా నాలుగో విజయం సాధించింది. బంగ్లాదేశ్‌పై భారత జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కోహ్లీ వన్డేల్లో 48వ సెంచరీ సాధించాడు. అంతర్జాతీయంగా అత్యంత వేగంగా 26 వేల పరుగులు కూడా పూర్తి చేశాడు. అతను 567 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు. అంతకు ముందు సచిన్ టెండూల్కర్ 600 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు.
పూణెలోని ఎంసీఏ మైదానంలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 256 పరుగులు చేసింది. 257 పరుగుల లక్ష్యాన్ని భారత బ్యాట్స్‌మెన్ 41.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఛేదించారు. విరాట్ కోహ్లీ తన వన్డే కెరీర్‌లో 69వ అర్ధశతకం సాధించగా, శుభమాన్ గిల్ 10వ అర్ధ సెంచరీని నమోదు చేశాడు. రోహిత్‌తో కలిసి గిల్ 76 బంతుల్లో 88 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
2023 ప్రపంచకప్‌లో భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుని, నిర్ణీత 50 ఓవర్లలో 256 పరుగులు చేసింది. దీంతో రోహిత్ సేనకు 257 పరుగుల టార్గెట్‌ను అందించింది. బంగ్లా బ్యాటర్లలో తస్జీద్ హసన్ 51, లిటన్ దాస్ 66 పరుగులతో ఆకట్టుకోగా, చివర్లో వచ్చిన మహ్మదుల్లా 46 పరుగులతో స్కోర్‌ను 250 దాటించడంలో సహాయపడ్డాడు. ఇక భారత బౌలర్లలో సిరాజ్, జడేజా తలో 2 వికెట్లు పడగొట్టగా.. బుమ్రా, శార్దుల్, కుల్దీప్ తలో వికెట్ పడగొట్టారు.
2023 వన్డే ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌తో భారత్ ఈరోజు గురువారం, అక్టోబర్ 19న తలపడుతోంది. పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో టీమిండియా ముందుగా బౌలింగ్ చేయనుంది. ఈరోజు జరిగే మ్యాచ్‌లో గెలవడం ద్వారా టీమ్ ఇండియా వరుసగా నాలుగో మ్యాచ్‌లో విజయం సాధించడంతోపాటు న్యూజిలాండ్‌ను కూడా అధిగమించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉంది.
ఈరోజు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ చేస్తే.. వన్డే ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌పై అతనికిది వరుసగా మూడో సెంచరీ అవుతుంది. రోహిత్ ఇంతకుముందు 2015 (మెల్‌బోర్న్)లో 137 పరుగులు, 2019 (బర్మింగ్‌హామ్)లో 104 పరుగులు చేశాడు.
ఇరు జట్ల నాలుగో మ్యాచ్..
ఈ ప్రపంచకప్‌లో ఇరు జట్లకు ఇది నాలుగో మ్యాచ్. తొలి మూడు మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించింది. భారత జట్టు తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై, రెండో మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై, మూడో మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై విజయం సాధించింది. ప్రస్తుతం రోహిత్ సేన ఖాతాలో 6 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది.
మరోవైపు బంగ్లాదేశ్ మూడు మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్ మాత్రమే గెలిచింది. 2 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఆ జట్టు తన తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌ను ఓడించింది. కాగా, ఇంగ్లండ్, న్యూజిలాండ్‌లపై బంగ్లా ఓడిపోయింది.
హెడ్-టు-హెడ్, ఇటీవలి రికార్డులు..
ఓవరాల్ హెడ్-టు-హెడ్ గురించి మాట్లాడితే, భారత్, బంగ్లాదేశ్ మధ్య ఇప్పటివరకు మొత్తం 40 వన్డేలు జరిగాయి. భారత్ 31, బంగ్లాదేశ్ 8 గెలిచాయి. ఒక మ్యాచ్ అసంపూర్తిగా మిగిలిపోయింది.
భారత్: చివరి 5లో 4 గెలిచింది. కాగా ఒకదానిలో ఓటమి చవిచూసింది.
బంగ్లాదేశ్: గత 5 మ్యాచ్‌ల్లో 4 ఓడిన ఆ జట్టు ఒక్కటి మాత్రమే గెలిచింది.
ఇరు జట్లు:
బంగ్లాదేశ్ (ప్లేయింగ్ XI): లిట్టన్ దాస్, తాంజిద్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), మెహిదీ హసన్ మిరాజ్, తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్(కీపర్), మహ్మదుల్లా, నసుమ్ అహ్మద్, హసన్ మహమూద్, ముస్తాఫిజుర్ రహ్మాన్, షోరీఫుల్ ఇస్లాం.
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
LIVE Cricket Score & Updates
-
టీమిండియా ఘన విజయం..
బంగ్లాపై ఘన విజయంతో టీమిండియా వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచింది. 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది.
-
200లకు చేరువలో స్కోర్..
31 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. శ్రేయాస్ (19) భారీ షాట్ ఆడే క్రమంలో పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం కోహ్లీ 59, కేఎల్ రాహుల్ 7 పరుగులతో క్రీజులో నిలిచారు.
-
-
కోహ్లీ హాఫ్ సెంచరీ..
విరాట్ కోహ్లీ 48 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేశాడు. దీంతో భారత్ 27 ఓవర్లు పూర్తయ్యే సరికి భారత్ 2 వికెట్లు కోల్పోయి 171 పరుగులు సాధించింది.
-
గిల్ ఔట్..
హాఫ్ సెంచరీ పూర్తి చేసిన తర్వాత గిల భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం భారత్ 19.2 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది.
-
గిల్ హాఫ్ సెంచరీ..
గిల్(51) వన్డే ప్రపంచకప్‌లో తన తొలి హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. కోహ్లీ (29)తోపాటు కీలక భాగస్వామ్యం ఆడుతోన్నగిల్.. టీమిండియాను 19 ఓవర్లు ముగిసే సరికి 130 పరుగులకు చేర్చాడు.
-
-
100 దాటిన స్కోర్..
16 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా ఒక వికెట్ నష్టపోయి 115 పరుగులు పూర్తి చేసింది. రోహిత్ 48 పరుగుల వద్ద పెవిలియన్ చేరగా.. గిల్ 44, కోహ్లీ 21 పరుగలతో క్రీజులో నిలిచారు.
-
రోహిత్ ఔట్..
రోహిత్ 48 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. దీంతో 12.4 ఓవర్లలో టీమిండియా ఒక వికెట్ నష్టపోయి 88 పరుగులు పూర్తి చేసింది.
-
పవర్ ప్లేలో దూకుడు..
పవర్ ప్లేలో టీమిండియా దూకుడు చూపించింది. 10 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 63 పరుగులు చేసింది. గిల్ 26, రోహిత్ 37 పరుగులతో క్రీజులో నిలిచారు.
-
8 ఓవర్లకు..
8 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 48 పరుగులు చేసింది. రోహిత్ 36, గిల్ 12 పరుగులతో క్రీజులో నిలిచారు.
-
3 ఓవర్లకు భారత్ స్కోర్..
3 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. రోహిత్ 21, గిల్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు.
-
మొదలైన టీమిండియా ఛేజింగ్..
257 పరుగుల లక్ష్యంతో టీమిండియా ఛేజింగ్ మొదలు పెట్టింది. ఓపెనర్లుగా రోహిత్, గిల్ వచ్చారు.
-
టీమిండియా టార్గెట్ 257
టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుని, నిర్ణీత 50 ఓవర్లలో 256 పరుగులు చేసింది. దీంతో రోహిత్ సేనకు 257 పరుగుల టార్గెట్‌ను అందించింది.
-
7వ వికెట్ డౌన్..
బంగ్లాదేశ్ 7వ వికెట్‌ను కోల్పోయింది. 47 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్లు కోల్పోయి 233 పరుగులు చేసింది.
-
కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన జడేజా..
జడేజా పట్టిన అద్భుతమైన క్యాచ్‌తో బంగ్లా సీనియర్ ప్లేయర్ ముష్పికర్ 38 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. దీంతో బంగ్లా 6 వికెట్లు కోల్పోయి 201 పరుగులు సాధించింది.
-
5వ వికెట్ డౌన్..
శార్దుల్‌కి తొలి వికెట్ దక్కింది. తౌహిద్ 16 పరుగుల వద్ద గిల్ అద్భుత క్యాచ్‌తో పెవిలియన్ చేరాడు. దీంతో 38 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది.
-
33 ఓవర్లకు బంగ్లా స్కోర్..
33 ఓవర్లకు బంగ్లాదేశ్ టీం 4 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది.
-
డేంజరస్ లిటన్ దాస్ ఔట్..
జడేజా టీమిండియాకు మరో వికెట్ అందించాడు. అది కూడా డేంజరస్ బ్యాటర్ లిటన్ దాస్ 66 పరుగులతో ఆడుతున్న సమయంలో పెవిలియన్ చేరాడు.
-
మూడో వికెట్ డౌన్..
బంగ్లాదేశ్ టీం మిరాజ్ రూపంలో 3వ వికెట్‌ను కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్‌లో మిరాజ్ ఇచ్చిన అద్భుతమైన క్యాచ్‌ను అందుకుని పెవిలియన్ చేర్చాడు.
-
జడేజా ఖాతాలో రెండో వికెట్..
బంగ్లాదేశ్ కెప్టెన్ శాంటో (6)ను జడేజా ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. దీంతో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 110 పరుగులు పూర్తి చేసింది. లిటన్ దాస్ 48 పరుగులతో క్రీజులో నిలిచాడు.
-
బంగ్లాదేశ్ అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యాలు vs భారత్
120 – లిట్టన్ దాస్, మెహిదీ హసన్ మిరాజ్, దుబాయ్, 2018
102 – సౌమ్య సర్కార్, తమీమ్ ఇక్బాల్, మీర్పూర్, 2015
93 – లిట్టన్ దాస్, తాంజిద్ హసన్, పూణే, 2023
80 – ఇమ్రుల్ కయేపూర్, ఇమ్రుల్ కయేపూర్ , 2010
-
బ్రేక్ ఇచ్చిన కుల్దీప్..
బంగ్లాదేశ్ ఓపెనర్లు 93 పరుగులతో డేంజర్‌గా మారిన జోడీని కుల్దీప్ విడదీశాడు. తన్జీద్ హాఫ్ సెంచరీ చేసిన తర్వాత కుల్దీప్ బౌలింగ్‌లో ఓట్ అయ్యాడు.
-
50 పరుగులు పూర్తి చేసిన బంగ్లా..
బంగ్లాదేశ్ 10 ఓవర్లు పూర్తయ్యే సరికి వికెట్ నష్టపోకుండా 63 పరుగులు పూర్తి చేసింది. లిటన్ దాస్ 21, తాన్జిద్ 40 పరుగులతో క్రీజులో నిలిచారు.
-
కోహ్లీ బౌలింగ్..
హార్దిక్ గాయపడి తన ఓవర్ మధ్యలోనే బయటకు వెళ్లాల్సి వచ్చింది. దీంతో మిగిలిన 3 బంతులను కోహ్లీ వేసేందుకు సిద్ధమయ్యాడు.
-
గాయపడిన హార్దిక్..
తన బౌలింగ్‌లో బౌండరీ ఆపే క్రమంలో హార్దిక్ పాండ్యా కాలికి గాయమైంది.
-
IND vs BAN: 5 ఓవర్లకు బంగ్లా స్కోర్..
5 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ 10 పరుగులు పూర్తి చేసింది. లిటర్ 1, తాన్జిత్ 9 పరుగులతో క్రీజులో నిలిచారు.
-
ఇరుజట్ల ప్లేయింగ్ 11
బంగ్లాదేశ్ (ప్లేయింగ్ XI): లిట్టన్ దాస్, తాంజిద్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(సి), మెహిదీ హసన్ మిరాజ్, తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్(w), మహ్మదుల్లా, నసుమ్ అహ్మద్, హసన్ మహమూద్, ముస్తాఫిజుర్ రహ్మాన్, షోరీఫుల్ ఇస్లాం.
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(w), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
-
టాస్ గెలిచిన బంగ్లా..
టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో టీమిండియా ముందుగా బౌలింగ్ చేయనుంది.
-
ఇరుజట్ల మధ్య మ్యాచ్‌ల పరిస్థితి 31-8
ఓవరాల్ హెడ్-టు-హెడ్ గురించి మాట్లాడితే, భారత్, బంగ్లాదేశ్ మధ్య ఇప్పటివరకు మొత్తం 40 వన్డేలు జరిగాయి. భారత్ 31, బంగ్లాదేశ్ 8 గెలిచాయి. ఒక మ్యాచ్ అసంపూర్తిగా మిగిలిపోయింది.
-
ఇరుజట్లకు ఇది నాలుగో మ్యాచ్.
ఈ ప్రపంచకప్‌లో ఇరు జట్లకు ఇది నాలుగో మ్యాచ్. తొలి మూడు మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించింది. భారత జట్టు తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై, రెండో మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై, మూడో మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై విజయం సాధించింది. ప్రస్తుతం రోహిత్ సేన ఖాతాలో 6 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది.
-
IND vs BAN Live Score: బంగ్లాతో కీలకపోరుకు భారత్ సిద్ధం..
2023 వన్డే ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌తో భారత్ ఈరోజు గురువారం, అక్టోబర్ 19న తలపడుతోంది. పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి మ్యాచ్ జరగనుంది. టాస్ అరగంట ముందుగా అంటే మధ్యాహ్నం 1:30 గంటలకు జరుగుతుంది.
Published On - Oct 19,2023 12:30 PM