Champions Trophy 2025: న్యూజిలాండ్‌కు బ్యాడ్ న్యూస్! టోర్నమెంట్ నుండి తప్పుకున్న స్టార్ పేసర్
ఐసిసి 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందు న్యూజిలాండ్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ పేసర్ బెన్ సియర్స్ తొడ కండరాల గాయంతో టోర్నమెంట్ నుంచి తప్పుకోాల్సి వచ్చింది. కోచ్ గ్యారీ స్టీడ్ ఈ పరిణామంపై స్పందిస్తూ, సియర్స్ గాయం దురదృష్టకరమని, అతను త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నామని చెప్పారు. అతని స్థానంలో జాకబ్ డఫీ జట్టులోకి రావడం, న్యూజిలాండ్ విజయ అవకాశాలపై ఎంత ప్రభావం చూపుతుందో చూడాలి.

ఐసిసి 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందు న్యూజిలాండ్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ పేసర్ బెన్ సియర్స్ తొడ కండరాల గాయంతో టోర్నమెంట్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది. ఫిబ్రవరి 19న ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నీకి ముందు సియర్స్ గాయం పడ్డట్లు న్యూజిలాండ్ క్రికెట్ (NZC) ప్రకటించింది.
“బుధవారం కరాచీలో జరిగిన శిక్షణ సమయంలో సియర్స్ ఎడమ కాలి స్నాయువులో నొప్పిని అనుభవించాడు. స్కాన్ పరీక్షల్లో కనీసం రెండు వారాల విశ్రాంతి అవసరం అని తేలింది. అతను గ్రూప్ దశ చివరి మ్యాచ్ (భారత్‌తో)కే అందుబాటులో ఉండే అవకాశం ఉండడంతో, అతన్ని తప్పించాలని నిర్ణయం తీసుకున్నాం,” అని NZC పేర్కొంది.
సియర్స్ లేకపోవడంతో జాకబ్ డఫీ జట్టులోకి వచ్చాడు. ప్రస్తుతం అతను పాకిస్తాన్, దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే ట్రై-సిరీస్‌లో ఆడుతున్నాడు.
సియర్స్ వైదొలగింపుపై కోచ్ గ్యారీ స్టీడ్ స్పందన:
న్యూజిలాండ్ ప్రధాన కోచ్ గ్యారీ స్టీడ్ మాట్లాడుతూ, “బెన్ పట్ల మేమంతా సానుభూతి చెందుతున్నాం. ఇంత ముఖ్యమైన టోర్నమెంట్‌కు ముందు గాయపడటం కష్టం. అతనికి ఇది తొలి ఐసిసి మెగా ఈవెంట్ కావడంతో మరింత నిరాశ కలిగించేదిగా మారింది,” అని తెలిపారు.
గ్రూప్ దశలో ఎక్కువ భాగం కోల్పోయే అవకాశం ఉన్నందున, పూర్తిగా ఫిట్‌గా ఉన్న ఆటగాడిని ఎంపిక చేయడం సముచితంగా భావించాం అని, బెన్ ఒక అద్భుతమైన ఆటగాడు, అతను త్వరగా కోలుకుని, పాకిస్తాన్‌తో స్వదేశంలో జరగనున్న సిరీస్‌కు సిద్ధంగా ఉంటాడని ఆశిస్తున్నాం, అని స్టీడ్ అన్నారు.
జాకబ్ డఫీ ఎంపికపై స్టీడ్ విశ్వాసం వ్యక్తం చేశారు. “డఫీ ఇటీవల శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. అతను ఇప్పటికే వన్డే ట్రై-సిరీస్‌లో భాగమైనందున, జట్టుతో పూర్తిగా అలవాటు పడిపోయాడు. వీటి పరిస్థితులకు అతనికి అనుభవం ఉంది. అతను ఫిట్‌గా, సిద్ధంగా ఉన్నాడు,” అని తెలిపారు.
పాకిస్తాన్‌తో న్యూజిలాండ్ తొలి మ్యాచ్
2025 ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 19న కరాచీలో పాకిస్తాన్‌తో ఆడనుంది. జట్టుకు సియర్స్ గాయపడ్డప్పటికీ, డఫీతో పాటు మిగతా బౌలింగ్ విభాగం మరింత మెరుగైన ప్రదర్శన ఇచ్చేలా ప్రయత్నించనుంది.
ఈ కొత్త మార్పులు న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ విజయ యాత్రపై ఎంత ప్రభావం చూపుతాయో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



