పాకిస్థానోళ్లంటార్రా బాబు! న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఏం చేశారో మీరే చూడండి!
పాకిస్థాన్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా మధ్య ట్రై సిరీస్ జరిగిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో న్యూజిలాండ్ విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ అద్భుత ప్రదర్శనకు పాక్ పిచ్చితనం కూడా తోడై.. కివీస్ జట్టుకు విజయం చేకూరింది. అయితే ఈ మ్యాచ్లో పాకిస్థాన్ ఆటగాళ్లు చేసిన కొన్ని తప్పిదాలతో నవ్వుల పాలవుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఎప్పుడు ఎలా ఆడతారో తెలియని క్రికెట్ టీమ్ ఏదైనా ఉందా అంటే అది పాకిస్థాన్ టీమ్ అని కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఒక మ్యాచ్‌లో వరల్డ్ ఛాంపియన్స్‌లా ఆడితే, ఆ నెక్ట్స్ మ్యాచ్‌లోనే పసికూన కంటే దారుణంగా ఆడతారు. ఇది పాకిస్థాన్ క్రికెట్ టీమ్‌కు చెడ్డ పేరు. ఈ మధ్య కాలంలో ఫన్నీ ఫన్నీ థింగ్స్ చేసే టీమ్ ఏది అంటే కూడా పాక్ జట్టు పేరే చెప్పాల్సిన పరిస్థితి వచ్చేసింది. అందుకే వాళ్లు చేసే చిత్రవిచిత్ర విన్యాసాలే కారణం. సింపుల్ రనౌట్లు చేయలేకపోవడం, ఒక క్యాచ్ కోసం ఇద్దరు పరిగెత్తి మధ్యలో నేల పాలు చేసి, ఒకరినొకరు దూషించుకోవడం, రూల్స్ సరిగ్గా తెలియక అంపైర్లతో గొడవకు దిగడం.. ఇలాంటి నవ్వు తెప్పించే పనులన్నీ పాకిస్థాన్ ఆటగాళ్లే ఎక్కువగా చేస్తుంటారు.
తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన ట్రై సిరీస్ ఫైనల్ మ్యాచ్‌లోనూ పాక్ ఆటగాళ్లు చేసిన తప్పిదాలతో క్రికెట్ లోకం ముందు మరోసారి నవ్వుల పాలయ్యారు. పాకిస్థాన్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా మధ్య ట్రై సిరీస్ జరిగిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో న్యూజిలాండ్ విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ అద్భుత ప్రదర్శనకు పాక్ పిచ్చితనం కూడా తోడై.. కివీస్ జట్టుకు విజయం చేకూరింది. టాస్ గెలిచి ఛేజింగ్ చేయాల్సిన పిచ్‌పై పాక్ కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇదో చెత్త నిర్ణయంగా చెప్పవచ్చు. ఆ తర్వాత వారి చెత్త ఫీల్డింగ్, ఇన్‌డిసిప్లిన్ బౌలింగ్, పూర్ డిసిషన్స్ న్యూజిలాండ్‌కు కలిసొచ్చాయి. 242 పరుగుల సాధారణ టార్గెట్‌ను కాపాడుకునే క్రమంలో పాక్ బౌలర్లు ఏకంగా 16 వైడ్లు వేశాడు. అలాగే ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో మంచి ప్రదర్శన చేసిన టామ్ లాథమ్‌ను త్వరగా అవుట్ చేసే అవకాశాన్ని కూడా పాక్ వదిలేసుకుంది.
నిజానికి లాథమ్ 15 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఒకసారి, 27 పరుగుల వద్ద ఒకసారి అవుట్ కావాల్సింది. కానీ, ఒకసారి డీఆర్‌ఎస్ తీసుకోకుండా, ఇంకోసారి సింపుల్ క్యాచ్‌ను వదిలేసి.. పాక్ భారీ మూల్యం చెల్లించుకుంది. ఇలా బ్యాడ్ కెప్టెన్సీతో పాటు చెత్త బౌలింగ్‌తో పాకిస్థాన్ ట్రై సిరీస్ ఫైనల్లో ఓటమి పాలైంది. మరో విచిత్రం ఏంటంటే.. ఈ మ్యాచ్ కంటే ఒక రోజు ముందు సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో రికార్డ్ బ్రేకింగ్ టార్గెట్‌ను ఛేజ్ చేసిన పాక్, ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించింది. కానీ, ఆ మరుసటి మ్యాచ్‌లోనే ఫేలవ ప్రదర్శన కనబర్చి.. పాకిస్థానోళ్లు అంటార్రా బాబు అనిపించుకుంది. అయితే.. మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో తమ తొలి మ్యాచ్‌ను పాకిస్థాన్, న్యూజిలాండ్‌తోనే ఆడనుంది. మెగా టోర్నీలో ఓపెనింగ్ మ్యాచ్‌ను ఆడే జట్టుపై ఇలాంటి ఫేలవ ప్రదర్శన కనబర్చడంతో పాక్ జట్టు ఆత్మవిశ్వాసం సన్నగిల్లడంతో పాటు, కివీస్ మంచి కాన్ఫిడెన్స్‌తో బరిలోకి దిగుతుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




