AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HTLS 2022: అపురూప దృశ్యం.. క్రికెట్ రారాజులు కలిసిన వేళ.. ఆసక్తికర విషయాలు పంచుకున్న సచిన్‌, లారా..

క్రికెట్ చరిత్రలో ఆ ఇద్దరు తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. వీరిలో ఒకరు క్రికెట్ దేవుడు సచిన్‌ టెండూల్కర్‌ కాగా మరొకరి ఒకప్పుటి స్టార్‌ ప్లేయర్‌ బ్రియాన్‌ లారా. ఈ ఇద్దరూ స్టార్‌ క్రికెటర్లు తమ అసమాన ప్రతిభతో దేశాలకు అతీతంగా క్రికెట్‌ అభిమానుల హృదయాలను దోచుకున్న వారే...

HTLS 2022: అపురూప దృశ్యం.. క్రికెట్ రారాజులు కలిసిన వేళ.. ఆసక్తికర విషయాలు పంచుకున్న సచిన్‌, లారా..
Sachin And Lara
Narender Vaitla
|

Updated on: Nov 13, 2022 | 3:53 PM

Share

క్రికెట్ చరిత్రలో ఆ ఇద్దరు తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. వీరిలో ఒకరు క్రికెట్ దేవుడు సచిన్‌ టెండూల్కర్‌ కాగా మరొకరి ఒకప్పుటి స్టార్‌ ప్లేయర్‌ బ్రియాన్‌ లారా. ఈ ఇద్దరూ స్టార్‌ క్రికెటర్లు తమ అసమాన ప్రతిభతో దేశాలకు అతీతంగా క్రికెట్‌ అభిమానుల హృదయాలను దోచుకున్న వారే. ఇలాంటి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు ఒకచోట కలిస్తే ఎలా ఉంటుంది.? చూడడానికి రెండు కళ్లు చాలవు కదూ. తాజాగా ఇది దృశ్యరూపం దాల్చింది. తాజాగా హిందుస్థాన్‌ టైమ్స్‌ నిర్వహించిన లీడర్‌షిప్‌ సమ్మిట్‌కు వీరిద్దరు హాజరయ్యారు.

ఈ సందర్భంగా వీరిద్దరు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తమ కెరీర్‌లో ఎదురైన పలు విషయాలను ఈ సందర్భంగా వివరించారు. ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లో వీరిద్దరు కలిసి బ్యాటింగ్ చేయడంపై వ్యాఖ్యాత కునాల్‌ ప్రశ్నించగా.. ఆ వీడియో కోసం అభిమానులు యూట్యూబ్‌లో విపరీతంగా సెర్చ్ చేశారని తెలిపారు. సిడ్నీలో సచిన్ ఐకానిక్ డబుల్ సెంచరీ చేసినప్పుడు తన ఆనందాన్ని ఎలా నియంత్రించుకున్నాడో లారా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. ఇక టీ20 ఫార్మట్‌తో క్రికెట్ చాలా మారిపోయిందని ఈ దిగ్గజ ప్లేయర్స్‌ అభిప్రాయపడ్డారు.

Sachin, Lara

 

ఇప్పటి కొందరు బ్యాటర్లు.. 360 డిగ్రీల షాట్లతో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. కొందరు వీటిపై ట్రోలింగ్ చేస్తున్నా, వారి అద్భుత ఆటతీరు గేమ్‌ను పూర్తిగా మార్చేసిందని లారా అన్నారు. ఇక టీ20 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌పై కూడా ఈ ప్లేయర్లు తమ అభిప్రాయాలను తెలిపారు. పాకిస్థాన్‌ జట్టు బలంగా ఉందని లారా అనగా, సచిన్‌ మాత్రం ఇంగ్లండ్‌కు గెలిచే అవకాశాలు ఉన్నాయన్నాడు. ఎంసీజీ మైదానం ఇంగ్లాండ్‌కు కలిసొస్తుందని అభిప్రాయపడ్డాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..