Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T-20 World Cup Finale: టీ-20 వరల్డ్ కప్ లో నేడే ఆఖరి పోరాటం.. పాకిస్తాన్ – ఇంగ్లండ్ మధ్య అమీతుమీ..

ఎన్నో సంచలనాలు, మరెన్నో మలుపులు మధ్య ఐసీసీ టీ -20 వరల్డ్ కప్ టోర్నీ చివరి దశకు చేరింది. ఫేవరెట్ లుగా భావించిన జట్లు ఇంటిముఖం పట్టడం, కప్పు గెలుస్తారని ఆశలు పెట్టుకున్న టీమ్ లు ఊహించని విధంగా...

T-20 World Cup Finale: టీ-20 వరల్డ్ కప్ లో నేడే ఆఖరి పోరాటం.. పాకిస్తాన్ - ఇంగ్లండ్ మధ్య అమీతుమీ..
T 20 World Cup
Follow us
Ganesh Mudavath

|

Updated on: Nov 13, 2022 | 9:59 AM

ఎన్నో సంచలనాలు, మరెన్నో మలుపులు మధ్య ఐసీసీ టీ -20 వరల్డ్ కప్ టోర్నీ చివరి దశకు చేరింది. ఫేవరెట్ లుగా భావించిన జట్లు ఇంటిముఖం పట్టడం, కప్పు గెలుస్తారని ఆశలు పెట్టుకున్న టీమ్ లు ఊహించని విధంగా టోర్నీ నుంచి నిష్క్రమించాయి. టీ-20 అంటేనే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అలాంటి పరిస్థితులను దాటుకుంటూ ముందుకు వెళ్లిన పాకిస్తాన్, ఇంగ్లండ్ జట్లు ఇవాళ కప్పు కోసం తలపడనున్నాయి. సెమీస్ లో భారత్ ను పది వికెట్ల తేడాతో ఓడించిన ఇంగ్లండ్ ఓ వైపు.. వైఫల్యాలతో టోర్నీ ని ప్రారంభించి ఊహించని విధంగా ఫైనల్ కు దూసుకెళ్లిన పాకిస్తాన్ మరో వైపు.. అన్ని అంచనాలను దాటి, ఫేవరెట్‌లను వెనక్కి నెట్టి ప్రపంచ విజేతగా నిలిచేందుకు పోటీ పడుతున్నాయి. టీ- 20 వరల్డ్ కప్ ను ఇప్పటికే పాకిస్తాన్, ఇంగ్లండ్ జట్లు చెరోసారి గెలుచుకున్నాయి. ఈ రెండు జట్లు ఫైనల్ లో పోటీ పడటం ఇది రెండో సారి. 1992 వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఇంగ్లండ్‌, పాకిస్తాన్ మ్యాచ్ జరగగా పాకిస్తాన్ గెలుపొందింది.

ప్రస్తుత బలాలు, ఫామ్‌ను బట్టి చూస్తే రెండు జట్లు సమంగానే కనిపిస్తున్నాయి. సెమీఫైనల్‌ లో జరిగిన పోరుతో న్యూజిలాండ్ ను ఓడించి పాకిస్తాన్, భారత్ ను ఓడించి ఇంగ్లండ్ ఫైనల్ పోరుకు అర్హత సాధించాయి. సెమీస్‌లో అన్ని విధాలా సత్తా చాటిన పాకిస్తాన్‌ ఫైనల్‌ కోసం ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్, రిజ్వాన్‌ విజయవంతమైన ఓపెనింగ్‌ జోడీగా గుర్తింపు తెచ్చుకున్నారు. మిడిలార్డర్‌లో మసూద్, ఇఫ్తికార్, నవాజ్‌లతో జట్టు బ్యాటింగ్‌ మెరుగ్గానే ఉంది. షాహిన్‌ అఫ్రిది గాయం నుంచి కోలుకున్న తర్వాత తన మార్క్ ప్రదర్శనకు కనబరుస్తున్నాడు. నసీమ్, వసీమ్‌ కూడా తమ పరిధిలో రాణిస్తున్నారు. అయితే రవూఫ్‌ ను ఎదుర్కోవడం ఇంగ్లండ్‌కు అంత సులువేమీ కాదని పాక్ భావిస్తోంది.

ఇంగ్లండ్ జట్టులో దాదాపు అందరూ బ్యాటింగ్‌ చేయగల సామర్థ్యం ఉన్నవారే కావడం ఆ టీమ్ కు కలిసొచ్చే అంశం. ఆల్‌రౌండర్లు మొయిన్‌ అలీ, వోక్స్, స్యామ్‌ కరన్‌లపై ఇంగ్లండ్ ఆశలు పెట్టుకుంది. టోర్నీలోనే ఫాస్టెస్ట్‌ బౌలర్‌గా ఉన్న మార్క్‌ వుడ్‌ టీమ్‌లో లేకపోవడం జట్టుకు కొంత సమస్యగా మారింది. సెమీస్ ఆడని అతను.. ఫైనల్‌కు వస్తే జట్టు బౌలింగ్‌ బలం పెరుగుతుంది. కరన్‌ కూడా రాణిస్తే పాక్‌ బ్యాటర్లకు కష్టాలు తప్పవు. మొత్తంగా చూస్తే ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌లో బలంగా ఉండగా, బౌలింగ్‌లో పాకిస్తాన్‌ది పైచేయిగా కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి