మహిళా క్రికెట్లో ఒకేరోజు ఇద్దరు స్టార్ల సంచలనం.. పురుషులకు కూడా సాధ్యం కాని రికార్డ్.!

మహిళల క్రికెట్లో శ్రీలంక జట్టు సంచలన రికార్డు చేసింది. ఇప్పటివరకు మహిళా క్రికెట్లో 300కు పైబడి రన్స్‎ను ఏ ఇతర జట్టు చేజింగ్ చేయలేకపోయింది. కానీ బుధవారం సౌత్ ఆఫ్రికా‎తో జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్లో శ్రీలంక జట్టు ఈ ఘనత సాధించింది. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న సౌత్ ఆఫ్రికా నిర్దిష్ట 50 ఓవర్లలో 301 పరుగులు చేసింది. చేజింగ్‎కు దిగిన శ్రీలంక మహిళ క్రికెటర్లు 44.3 ఓవర్లలోనే 305/4 పరుగులు చేసి మహిళా క్రికెట్లో రికార్డు సృష్టించారు.

మహిళా క్రికెట్లో ఒకేరోజు ఇద్దరు స్టార్ల సంచలనం.. పురుషులకు కూడా సాధ్యం కాని రికార్డ్.!
Chamari Athapaththu
Follow us
Lakshmi Praneetha Perugu

| Edited By: Srikar T

Updated on: Apr 18, 2024 | 3:21 PM

మహిళల క్రికెట్లో శ్రీలంక జట్టు సంచలన రికార్డు చేసింది. ఇప్పటివరకు మహిళా క్రికెట్లో 300కు పైబడి రన్స్‎ను ఏ ఇతర జట్టు చేజింగ్ చేయలేకపోయింది. కానీ బుధవారం సౌత్ ఆఫ్రికా‎తో జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్లో శ్రీలంక జట్టు ఈ ఘనత సాధించింది. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న సౌత్ ఆఫ్రికా నిర్దిష్ట 50 ఓవర్లలో 301 పరుగులు చేసింది. చేజింగ్‎కు దిగిన శ్రీలంక మహిళ క్రికెటర్లు 44.3 ఓవర్లలోనే 305/4 పరుగులు చేసి మహిళా క్రికెట్లో రికార్డు సృష్టించారు. అంతకుముందు బ్యాటింగ్‎కు దిగిన సౌత్ ఆఫ్రికాలో ఆ జట్టు సారథి లారా వోల్డార్ట్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి 147 బంతుల్లో 184 పరుగులు చేసి అజయంగా నిలిచింది. ఈ దశలో చేజింగ్‎కు దిగిన శ్రీలంక మహిళా క్రికెట్ కెప్టెన్ ఆటపట్టు చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడింది. 139 బంతుల్లో ఏకంగా 195 రన్స్ చేసి రికార్డు సృష్టించింది. ఈ ఇద్దరు కలిపి చేసిన పరుగులు 379 పరుగులు. ఓకే మ్యాచ్లో ఏ ఇద్దరు ఆటగాళ్లు కలిపి 175 కు పైగా స్కోర్లు చేయలేదు. ఇది పురుషుల మ్యాచ్‎కు సైతం వర్తిస్తుంది. ఓకే మ్యాచ్లో ఇద్దరు కెప్టెన్లు ఇన్ని పరుగులు చేయడం ప్రపంచ రికార్డుగా అభివర్ణిస్తున్నారు. గతంలో పురుషుల క్రికెట్లో భారత్ శ్రీలంక మధ్య 2014లో జరిగిన మ్యాచ్‎లో ఉన్న రికార్డే అధికంగా ఉండేది. ఆ మ్యాచ్లో భారత్ తరపున కెప్టెన్ విరాట్ కోహ్లీ 139 పరుగులు చేయగా శ్రీలంక తరపున కెప్టెన్ మ్యాథ్యూస్ 139 పరుగులు చేశాడు. వారి పేరు మీద ఉన్న 278 రికార్డును మహిళలు అలవోకగా చేదించారు.

మహిళ క్రికెట్ చరిత్రలో చేజింగ్ లో 195 పరుగులు చేయటం సంచలనం. గతంలో ఆస్ట్రేలియన్ కెప్టెన్ మెగ్ లానింగ్ పేరు మీద ఉన్న 152 పరుగుల రికార్డును ఆటపట్టు చెరిపేసింది. ఇప్పటివరకు చేజింగ్‎లో పురుషుల క్రికెట్ లోను ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్ మాక్స్వెల్ చేసిన 201 పరుగులే రికార్డు గా ఉన్నాయి. 2023లో వరల్డ్ కప్ సందర్భంగా ఆఫ్ఘనిస్తాన్‎తో జరిగిన మ్యాచ్లో మ్యాక్స్వెల్ 20 పరుగులు చేశాడు. ఇప్పటివరకు వన్డే క్రికెట్ చేజింగ్‎లో ఇదే పెద్ద రికార్డు. శ్రీలంక మహిళ స్టార్ బ్యాట్స్మెన్ ఆటపట్టు చేసిన 195 పరుగులు మహిళ క్రికెట్ చరిత్రలో మూడో హైయెస్ట్ స్కోర్‎గా ఉంది. అంతకుముందు ఇద్దరు మహిళా క్రికెటర్లు వన్డే చరిత్రలో డబల్ సెంచరీలు నమోదు చేసుకున్నారు. న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ అమేలీయ కేర్ 2018లో ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో 232 పరుగులు చేసింది. ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్ బెలిండా క్లార్క్ 1997 లోనే డబల్ సెంచరీ నమోదు చేసింది. డెన్మార్క్‎తో జరిగిన మ్యాచ్లో 229 పరుగులు చేసింది. వారి తర్వాత బుధవారం జరిగిన సౌత్ ఆఫ్రికా శ్రీలంక మధ్య వన్డే మ్యాచ్లో ఆటో పట్టు చేసిన 195 పరుగులు మహిళ క్రికెట్లో మూడో అతిపెద్ద స్కోర్‎గా రికార్డు సృష్టించింది. భారత్ తరపున దీప్తి శర్మ 2017లో ఐర్లాండ్తో జరిగిన వన్డే మ్యాచ్లో 188 పరుగులు చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..