T20 World Cup: ఓపెనర్లుగా కోహ్లీ, రోహిత్.. బ్యాకప్‌గా సచిన్ 2.0.. హార్దిక్‌తో పాటు ఈ 5గురు ఔట్!

ఐపీఎల్ 17వ సీజన్ జరుగుతున్నప్పటికీ.. అందరి దృష్టి మాత్రం టీ20 ప్రపంచకప్‌పైనే ఉంది. ఐపీఎల్‌లో సత్తా చాటుతున్న యంగ్ ప్లేయర్స్ ఎవరెవరు టీ20 ప్రపంచకప్‌ జట్టులోకి ఎంపికవుతారన్నది ఇప్పుడు అందరిలోనూ ప్రశ్న. టీ20 ప్రపంచకప్ ఎంపికకు ఐపీఎల్ 2024లో రాణించడమే పరిగణనలోకి..

T20 World Cup: ఓపెనర్లుగా కోహ్లీ, రోహిత్.. బ్యాకప్‌గా సచిన్ 2.0.. హార్దిక్‌తో పాటు ఈ 5గురు ఔట్!
Team India
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 18, 2024 | 1:40 PM

ఐపీఎల్ 17వ సీజన్ జరుగుతున్నప్పటికీ.. అందరి దృష్టి మాత్రం టీ20 ప్రపంచకప్‌పైనే ఉంది. ఐపీఎల్‌లో సత్తా చాటుతున్న యంగ్ ప్లేయర్స్ ఎవరెవరు టీ20 ప్రపంచకప్‌ జట్టులోకి ఎంపికవుతారన్నది ఇప్పుడు అందరిలోనూ ప్రశ్న. టీ20 ప్రపంచకప్ ఎంపికకు ఐపీఎల్ 2024లో రాణించడమే పరిగణనలోకి తీసుకుంటోంది బీసీసీఐ. ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో కొందరు మెరుగ్గా రాణించగా.. మరికొందరు చేతులెత్తేశారు. వారి ప్రదర్శన చూస్తే టీ20 ప్రపంచకప్ ఎంపికకు కష్టమే అనిపిస్తోంది. ఈ నెలాఖరులోగా టీ20 ప్రపంచకప్‌కు జట్టును ప్రకటించే అవకాశం ఉంది. కానీ, అంతకుముందే టీ20 ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కించుకోలేని ప్లేయర్స్ కొందరు ఉన్నారు. వారిలో ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ కాగా.. వీరితో పాటు మరో ముగ్గురు ఆటగాళ్లు కూడా ఉన్నారు.

రవిచంద్రన్ అశ్విన్:

ఐపీఎల్ 2024లో అశ్విన్ ప్రదర్శన చూస్తే.. టీ20 ప్రపంచకప్‌లో ఛాన్స్ దక్కకపోవచ్చు. ఈ సీజన్‌లో ఆడిన 6 మ్యాచ్‌ల్లో అశ్విన్ 209 సగటుతో కేవలం 1 వికెట్ మాత్రమే తీశాడు. మొన్న కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో అయితే.. అశ్విన్ బౌలింగ్‌లో ఊచకోత కోశారు కోల్‌కతా బ్యాటర్లు. ముఖ్యంగా నరైన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.

యశస్వి జైస్వాల్:

ఐపీఎల్ 2024లో జైస్వాల్ ఆటతీరు సెలెక్టర్లు చూసి.. అతడికి ఛాన్స్ ఇచ్చే విషయంపై పెద్దగా ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఇప్పటిదాకా 7 ఇన్నింగ్స్‌ల్లో జైస్వాల్ ఒక్క అర్ధ సెంచరీ నమోదు చేయలేదు. అతడి అత్యుత్తమ స్కోరు 39 పరుగులు. మొత్తంగా 121 పరుగులు చేశాడు. అటు రోహిత్ శర్మతో పాటు ఓపెనింగ్‌లో విరాట్‌ కోహ్లీని పంపాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తుండటంతో.. జైస్వాల్ ప్లేస్ కష్టమే.

ఇషాన్ కిషన్:

ఐపీఎల్ 2024లో నిలకడైన ప్రదర్శన కనబరచట్లేదు ఇషాన్ కిషన్. ఆడిన 6 ఇన్నింగ్స్‌ల్లో అతడి పేరిట కేవలం 1 అర్ధ సెంచరీ మాత్రమే ఉంది. అతడి ఖాతాలో 184 పరుగులు నమోదయ్యాయి. ఇషాన్ కిషన్ ఎంపిక కూడా కష్టంగా ఉంది. అటు రిషబ్ పంత్ ఫిట్‌గా ఉండటంతో.. సెలెక్టర్ల ప్రధాన ఛాయస్ అతడే.

శ్రేయాస్ అయ్యర్:

KKR కెప్టెన్‌గా ఉన్న అయ్యర్ కూడా IPL 2024లో ఆడిన మొదటి 6 ఇన్నింగ్స్‌లలో కేవలం 140 పరుగులు మాత్రమే చేశాడు. అయ్యర్ ఎంపిక కాకపోవడానికి అతడి పేలవమైన ఫామ్ ఖచ్చితంగా కారణం కావచ్చు. ఇది కాకుండా, గాయం తర్వాత సూర్యకుమార్ బ్యాటింగ్ అడిరిపోవడమే.. ఫస్ట్ ఆప్షన్ స్కైకే ఇస్తారు సెలెక్టర్లు.

జితేష్ శర్మ:

ఈ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌కు భారత జట్టు మేనేజ్‌మెంట్ మద్దతు లభించట్లేదు. రిషబ్ పంత్ తిరిగి రావడంతో, అతడి ఎంపిక ఖరారు అయిపోయింది. పైగా సంజూ శాంసన్ నిలకడ ఆటతీరు కూడా జితేష్ ఆటపై ప్రభావం పడుతోంది. ఐపీఎల్ 2024 తొలి 6 ఇన్నింగ్స్‌ల్లో జితేష్ శర్మ 106 పరుగులు మాత్రమే చేశాడు. అతని అత్యుత్తమ స్కోరు 29 పరుగులు.

జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..