మొనగాడొచ్చాడు సామీ.. ఇక ఆ ముగ్గురు తట్టాబుట్టా సర్డుకోవాల్సిందే.. టీ20 ప్రపంచకప్ జట్టు ఇదే.!

ఐపీఎల్ 2024 సగం పూర్తయింది. ఈలోగానే టీ20 ప్రపంచకప్ స్క్వాడ్‌పై గుసగుసలు మొదలయ్యాయి. జూన్ 2 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ కోసం టీమ్ ఇండియా జట్టు మే 1న ప్రకటించనుంది బీసీసీఐ. అయితే ఇప్పటికే సెలెక్టర్లు 20 మంది ప్రాబబుల్స్‌ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.

మొనగాడొచ్చాడు సామీ.. ఇక ఆ ముగ్గురు తట్టాబుట్టా సర్డుకోవాల్సిందే.. టీ20 ప్రపంచకప్ జట్టు ఇదే.!
Team India
Follow us

|

Updated on: Apr 18, 2024 | 12:35 PM

ఐపీఎల్ 2024 సగం పూర్తయింది. ఈలోగానే టీ20 ప్రపంచకప్ స్క్వాడ్‌పై గుసగుసలు మొదలయ్యాయి. జూన్ 2 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ కోసం టీమ్ ఇండియా జట్టు మే 1న ప్రకటించనుంది బీసీసీఐ. అయితే ఇప్పటికే సెలెక్టర్లు 20 మంది ప్రాబబుల్స్‌ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. అందులో వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్, హైదరాబాద్ బ్యాటర్ తిలక్ వర్మ పేర్లు లేవని సమాచారం. 15 మంది ప్రధాన ఆటగాళ్లు, 5 స్టాండ్ బై ప్లేయర్ల లిస్టు బీసీసీఐ సిద్దం చేసింది. ఇందులో 6 మంది స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్లుగా ఉన్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్‌తో ఈ లిస్టు గట్టిగా ఉండగా.. ఆల్‌రౌండర్ల కోటాను రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే భర్తీ చేయనున్నారు.

3 వికెట్ కీపర్లు..

టీ20 ప్రపంచకప్ కోసం టీమ్ ఇండియా ముగ్గురు వికెట్ కీపర్లను ఎంపిక చేయనున్నట్టు తెలుస్తోంది. అందులో మొదటిగా రిషబ్ పంత్ ఉండగా.. ఆ తర్వాత స్థానాలు సంజూ శాంసన్, కెఎల్ రాహుల్ భర్తీ చేశారు. దాదాపుగా ఇషాన్ కిషన్‌కు నో ప్లేస్ అన్నట్టు సంకేతాలు వచ్చేశాయి. ఇక ముగ్గురు స్పెషలిస్టు బౌలర్లతో టీ20 ప్రపంచకప్‌లోకి బరిలోకి దిగనుంది టీమిండియా. కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్ స్పిన్నర్లు కాగా.. ఫాస్ట్ బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్‌, అవేశ్ ఖాన్ ఉండనున్నారు.