దెబ్బేసిన ధోని శిష్యుడు.. టీ20 వరల్డ్‌కప్‌లో రింకూ‌కి నో ప్లేస్.! లిస్టులోకి నయా ఫినిషర్..

ఐపీఎల్ 2024 ముగిసిన వెంటనే.. యూఎస్‌ఏ, వెస్టిండీస్ వేదికలుగా టీ20 ప్రపంచకప్ మొదలుకానుంది. ఈ క్రమంలోనే మే మొదటి వారంలో మెగా టోర్నమెంట్‌కు టీమిండియా ప్రాబబుల్స్‌ను ఎంపిక చేయనుంది బీసీసీఐ. ఈ తరుణంలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఫినిషర్ రింకూ సింగ్.. ప్రపంచకప్ జట్టులో..

దెబ్బేసిన ధోని శిష్యుడు.. టీ20 వరల్డ్‌కప్‌లో రింకూ‌కి నో ప్లేస్.! లిస్టులోకి నయా ఫినిషర్..
Rinku Singh
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 18, 2024 | 8:43 AM

ఐపీఎల్ 2024 ముగిసిన వెంటనే.. యూఎస్‌ఏ, వెస్టిండీస్ వేదికలుగా టీ20 ప్రపంచకప్ మొదలుకానుంది. ఈ క్రమంలోనే మే మొదటి వారంలో మెగా టోర్నమెంట్‌కు టీమిండియా ప్రాబబుల్స్‌ను ఎంపిక చేయనుంది బీసీసీఐ. ఈ తరుణంలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఫినిషర్ రింకూ సింగ్.. ప్రపంచకప్ జట్టులో ఫినిషర్ పాత్ర పోషిస్తాడని అందరూ భావించారు. అయితే ఇప్పుడు అది కష్టంగా కనిపిస్తోంది.

జూన్ 2 నుంచి వెస్టిండీస్, అమెరికాలలో టీ20 ప్రపంచకప్ 2024 ప్రారంభం కానుంది. ఈ ప్రపంచకప్ కోసం, మొత్తం 20 జట్లు మే 1 నాటికి తమ జట్టులను ప్రకటించి, ఐసీసీకి లిస్టులు పంపనున్నాయి. ఆ తర్వాత అవసరమైతే టీంలలో పలు మార్పులు చోటు చేసుకుంటాయి. అయితే మే 1న పంపే స్క్వాడ్‌‌లు దాదాపుగా ఫైనల్ అని తెలుస్తోంది. ఇలాంటి తరుణంలో టీమిండియా జట్టుకు ఫినిషర్ పాత్ర రింకూ సింగ్ పోషిస్తాడని అనుకున్నారు. కానీ ఇప్పుడు కొత్త ఆల్‌రౌండర్ వచ్చేశాడు. ఇప్పటికే బీసీసీఐ సెలక్షన్ కమిటీ 20 మంది ఆటగాళ్లను షార్ట్‌లిస్ట్ చేసిందని సమాచారం. అందులో నుంచి 15 మంది ప్రాబబుల్స్‌తో కూడిన జట్టును సిద్ధం చేస్తోందట బోర్డు. ఇక జట్టులో ఫినిషర్ రోల్ చాలా ముఖ్యం. ఆల్‌రౌండర్ స్థానంలో హార్దిక్ పాండ్యా జట్టులో ఉన్నప్పటికీ.. అతడికి బ్యాకప్‌గా శివమ్ దూబేను తీసుకోవాలని సెలెక్టర్లు చూస్తున్నారట.

ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున శివమ్ దూబే నిలకడైన ఆటతీరుతో అదరగొడుతున్నాడు. ముఖ్యంగా స్పిన్నర్లపై అతడి దూకుడైన బ్యాటింగ్.. వెస్టిండీస్ పిచ్‌లపై సరిగ్గా సరిపోతుందని సెలెక్టర్ల అంచనా. శివమ్ దూబే ఇప్పటివరకు 6 ఇన్నింగ్స్‌లలో 163 స్ట్రైక్ రేట్‌తో 242 పరుగులు చేశాడు. ఇందులో 20 ఫోర్లు, 15 సిక్సర్లు ఉన్నాయి. మరోవైపు రింకూ సింగ్‌కు సరైన అవకాశాలు రావట్లేదు. కేవలం 5 ఇన్నింగ్స్‌లో 51 బంతులు ఎదుర్కుని 83 పరుగులు మాత్రమే చేశాడు రింకూ.. ఇందులో 5 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి.

ఎసరొచ్చింది ఇక్కడే..

వాస్తవానికి, బ్యాకప్ ఓపెనర్‌గా యశస్వి జైస్వాల్, శుభమాన్ గిల్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. బ్యాకప్ ఓపెనర్‌గా ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేయాలి. అలా కాదని సెలెక్టర్లు ఇద్దరినీ జట్టులోకి తీసుకుంటే.. ఫినిషర్‌గా శివమ్ దూబే, రింకూలలో ఒకరిని మాత్రమే జట్టులోకి చేర్చుతారు. దూబే ఆల్‌రౌండర్‌గా ఉపయోగపడే అవకాశం ఉన్నందున.. రింకూకి అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఈ సీజన్‌లో దూబే ఒక్కసారి కూడా బౌలింగ్ చేయనప్పటికీ, కరేబియన్ స్లో పిచ్‌లపై అతడి మీడియం పేస్ ఉపయోగపడుతుందని సెలెక్టర్ల అంచనా.