IPL 2024 Purple Cap: పర్పుల్ క్యాప్‌లో దూసుకొస్తోన్న స్పిన్ సంచలనం.. తగ్గేదేలే అంటోన్న యార్కర్ కింగ్..

IPL 2024 Purple Cap: 2023 సీజన్‌లో, గుజరాత్ టైటాన్స్‌కు చెందిన మహ్మద్ షమీ 17 మ్యాచ్‌లలో 28 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు. అతని తర్వాత, అతని సహచరుడు మోహిత్ శర్మ 14 మ్యాచ్‌ల్లో 27 వికెట్లు తీశాడు. మూడో స్థానంలో ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన గుజరాత్ రషీద్ ఖాన్ 17 మ్యాచ్‌ల్లో 27 వికెట్లు పడగొట్టగా, అతని వెనుక ముంబై ఇండియన్స్‌కు చెందిన పియూష్ చావ్లా 16 మ్యాచ్‌ల్లో 22 వికెట్లు పడగొట్టాడు. రాజస్థాన్‌ ఆటగాడు చాహల్‌ 14 మ్యాచ్‌ల్లో 21 వికెట్లతో టాప్‌ 5లో చోటు దక్కించుకున్నాడు.

IPL 2024 Purple Cap: పర్పుల్ క్యాప్‌లో దూసుకొస్తోన్న స్పిన్ సంచలనం.. తగ్గేదేలే అంటోన్న యార్కర్ కింగ్..
Ipl 2024 Purple Cap
Follow us
Venkata Chari

|

Updated on: Apr 18, 2024 | 8:50 AM

IPL 2024 Purple Cap: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌కు పర్పుల్ క్యాప్ లభిస్తుంది. ఇప్పటివరకు 16 సీజన్లలో, అనేక మంది ప్రముఖ బౌలర్లు ఈ టోపీని గెలుచుకున్నారు. ఇందులో భారతీయ, విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. గత సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ తరపున మహ్మద్‌ షమీ అత్యధిక వికెట్లు పడగొట్టాడు.

ఇప్పటివరకు భువనేశ్వర్ కుమార్, మోహిత్ శర్మ, మహ్మద్ షమీ, ఆర్పీ సింగ్, ప్రజ్ఞాన్ ఓజా, సోహైల్ తన్వీర్, డ్వేన్ బ్రేవో, లసిత్ మలింగ, మోర్నీ మోర్కెల్, ఆండ్రూ టై, ఇమ్రాన్ తాహిర్, కగిసో రబడ, యుజ్వేంద్ర చాహల్, హర్షల్ పటేల్ పర్పుల్ చాప్‌ను గెలుచుకున్నారు. ఈ కథనంలో ఐపీఎల్ 2024లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల గురించి తెలుసుకుందాం..

నంబర్ వన్ స్థానంలో యుజ్వేంద్ర చాహల్..

యుజ్వేంద్ర చాహల్ పంజాబ్ కింగ్స్‌పై అద్భుతమైన ఆటను ప్రదర్శించాడు. ప్రస్తుతం ఈ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కంటే ముందున్నాడు. ఇక మరో బౌలర్ గురించి మాట్లాడితే అది జస్ప్రీత్ బుమ్రా. జస్ప్రీత్ బుమ్రా కూడా పర్పుల్ క్యాప్ రేసులో ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ప్రస్తుతం జాబితాలో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.

ఐపీఎల్ 2024లో అత్యధిక వికెట్లు తీసిన ఐదుగురు బౌలర్లు ఎవరో ఓసారి చూద్దాం..

1) యుజ్వేంద్ర చాహల్ (రాజస్థాన్ రాయల్స్): మ్యాచ్‌లు – 7, వికెట్లు – 12, ఎకానమీ రేట్ – 8.34, 4 వికెట్ల హాల్ – 0, ఉత్తమ ప్రదర్శన – 3/11

2) జస్ప్రీత్ బుమ్రా (ముంబయి ఇండియన్స్): మ్యాచ్‌లు – 6, వికెట్లు – 10, ఎకానమీ రేట్ – 6.08, 4 వికెట్ల హాల్ – 1, ఉత్తమ ప్రదర్శన – 5/21

3) ఖలీల్ అహ్మద్ (ఢిల్లీ క్యాపిటల్స్): మ్యాచ్‌లు – 7, వికెట్లు – 10, ఎకానమీ రేట్ – 8.17, 4 వికెట్ల హాల్ – 0, ఉత్తమ ప్రదర్శన – 21/2

4) ముస్తాఫిజుర్ రెహమాన్ (చెన్నై సూపర్ కింగ్స్): మ్యాచ్‌లు – 5, వికెట్లు – 10, ఎకానమీ రేట్ – 9.15, 4 వికెట్ల హాల్ – 1, ఉత్తమ ప్రదర్శన – 4/29

5) పాట్ కమిన్స్ (సన్‌రైజర్స్ హైదరాబాద్): మ్యాచ్‌లు – 6, వికెట్లు – 9, ఎకానమీ రేట్ – 7.87, 4 వికెట్ల హాల్ – 0, ఉత్తమ ప్రదర్శన – 3/43

ప్రతి సంవత్సరం ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ రాగానే అందరి చూపు ఆ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ అందుకుంటున్న ఆటగాళ్లపైనే ఉంటుంది. ఈ ఆటగాళ్ళు తరచుగా T20 ప్రపంచ కప్ వంటి భవిష్యత్ టోర్నమెంట్లలో వారి జాతీయ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తారు. ఐపీఎల్‌లో ఆటగాళ్లు మెరుగ్గా రాణిస్తే వచ్చే సీజన్‌లో కూడా లాభాలు పొందుతారు.

2023 సీజన్‌లో, గుజరాత్ టైటాన్స్‌కు చెందిన మహ్మద్ షమీ 17 మ్యాచ్‌లలో 28 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు. అతని తర్వాత, అతని సహచరుడు మోహిత్ శర్మ 14 మ్యాచ్‌ల్లో 27 వికెట్లు తీశాడు. మూడో స్థానంలో ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన గుజరాత్ రషీద్ ఖాన్ 17 మ్యాచ్‌ల్లో 27 వికెట్లు పడగొట్టగా, అతని వెనుక ముంబై ఇండియన్స్‌కు చెందిన పియూష్ చావ్లా 16 మ్యాచ్‌ల్లో 22 వికెట్లు పడగొట్టాడు. రాజస్థాన్‌ ఆటగాడు చాహల్‌ 14 మ్యాచ్‌ల్లో 21 వికెట్లతో టాప్‌ 5లో చోటు దక్కించుకున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్