IPL 2024: ప్రపంచకప్‌ బెర్త్ పక్కా! పంత్ కళ్లు చెదిరే క్యాచ్.. మెరుపు స్టంపింగ్స్.. వీడియో ఇదిగో

IPL 2024 32వ మ్యాచ్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తన అద్భుతమైన వికెట్ కీపింగ్‌తో అందరి మనసులను గెలుచుకున్నాడు. ఈ మ్యాచ్ లో గుజరాత్ డేంజరస్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ నమ్మశక్యంగాని రీతిలో అందుకున్నాడు పంత్. అలాగే రెండు మెరుపు స్టంపింగ్‌లు కూడా చేశారు.

IPL 2024: ప్రపంచకప్‌ బెర్త్ పక్కా! పంత్ కళ్లు చెదిరే క్యాచ్.. మెరుపు స్టంపింగ్స్.. వీడియో ఇదిగో
Rishabh Pant
Follow us

|

Updated on: Apr 18, 2024 | 4:26 PM

IPL 2024 32వ మ్యాచ్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తన అద్భుతమైన వికెట్ కీపింగ్‌తో అందరి మనసులను గెలుచుకున్నాడు. ఈ మ్యాచ్ లో గుజరాత్ డేంజరస్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ నమ్మశక్యంగాని రీతిలో అందుకున్నాడు పంత్. అలాగే రెండు మెరుపు స్టంపింగ్‌లు కూడా చేశారు. అహ్మదాబాద్‌లోని పిచ్‌పై గుజరాత్ బ్యాటర్లు తడబడ్డారు . అదే సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బాగా ఫీల్డింగ్ చేస్తూ గుజరాత్‌ కష్టాలను మరింత పెంచింది. ఈ సమయంలో డేవిడ్ మిల్లర్ ఇచ్చిన క్యాచ్‌ను రిషబ్ పంత్ అద్భుతంగా అందుకున్నాడు. ఐదో ఓవర్ లో ఇషాంత్‌ శర్మ బౌలింగ్‌లో లెగ్‌ సైడ్‌ దిశగా డేవిడ్‌ మిల్లర్‌ ఆడిన షాట్‌ను పంత్‌ అద్భుతమైన డైవిండ్‌ క్యాచ్‌గా మలిచి అభిమానుల మన్ననలు పొందాడు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతుంది.

డేవిడ్ మిల్లర్ క్యాచ్ పట్టిన తర్వాత రిషబ్ పంత్ మరో 2 స్టంపింగ్స్ చేశాడు. 9వ ఓవర్లో ట్రిస్టన్ స్టబ్స్ బౌలింగ్‌లో అభినవ్ మనోహర్‌ను రిషబ్ స్టంపౌట్ చేశాడు. అభినవ్ ముందుకు వచ్చి స్టబ్స్ వేసిన బంతిని షాట్ కొట్టేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి మిస్ అయ్యింది. మనోహర్ తేరుకునేలోపే వికెట్లను గిరాటేశాడు పంత్. ఆ తర్వాత స్టబ్స్ బౌలింగ్‌లో షారుఖ్ ఖాన్‌కి లెగ్ స్టంప్ వెలుపల ఒక వైడ్ బాల్ వేశాడు. షాట్ ఆడేందుకు షారుఖ్ ప్రయత్నించగా పంత్ స్టంప్ అవుట్ చేశాడు. అప్పటికీ షారుఖ్ కాలు గాలిలోనే ఉంది.

ఇవి కూడా చదవండి

రిషబ్ పంత్ కళ్లు చెదిరే క్యాచ్..

రోడ్డు ప్రమాదంలో గాయపడిన పంత్ చాలా కాలంగా మైదానానికి దూరంగా ఉన్నాడు. ఈ టోర్నీ లోనే పునరాగమనం చేశాడు. ఇప్పటికే బ్యాట్ తో అదరగొట్టిన పంత్ ఇప్పుడు తన వికెట్ కీపింగ్ స్కిల్స్ తో ప్రపంచ కప్ లో బెర్తు కన్ఫార్మ్ చేసుకున్నాడని చెప్పుకోవచ్చు.

మెరుపు స్టంపింగ్..

కళ్లు మూసి తెరిచిలోపే…

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..