AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ఎవర్రా సామీ నువ్వు ఇంత వైలెంట్ గా ఉన్నావ్! కోహ్లీ సెంచరీతో పూనకం తెచ్చుకున్న ఫ్యాన్.. వీడియో వైరల్!

ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్‌పై విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీ బాదడంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లోకి వెళ్లిపోయారు. ఓ అభిమాని ఆనందంతో పూనకం వచ్చినట్టు ఊగిపోయి, అరుస్తూ, చొక్కా ఊపుతూ హంగామా చేయడం వైరల్ అయ్యింది. కోహ్లీ ఇన్నింగ్స్‌పై మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపించారు. అతని ప్రదర్శనతో అభిమానుల ఆశలు రెట్టింపయ్యాయి.

Video: ఎవర్రా సామీ నువ్వు ఇంత వైలెంట్ గా ఉన్నావ్! కోహ్లీ సెంచరీతో పూనకం తెచ్చుకున్న ఫ్యాన్.. వీడియో వైరల్!
Kohli Fan
Narsimha
|

Updated on: Feb 25, 2025 | 5:04 PM

Share

ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌పై సెంచరీ బాదిన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. కొంతకాలంగా అతడిపై వస్తున్న విమర్శలు ఒక్కసారిగా ప్రశంసలుగా మారిపోయాయి. కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ ఆడటంతో అభిమానులు ఫుల్ జోష్‌లోకి వచ్చారు. ఈ నేపథ్యంలో విరాట్ సెంచరీ చేసిన క్షణం ఓ అభిమాని ఇచ్చిన రియాక్షన్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అభిమాని రియాక్షన్ – ఇంట్లో భయపడిన బామ్మ!

విరాట్ సెంచరీకి ఓ ఫ్యాన్ ఊహించనట్టుగా రియాక్ట్ అయ్యాడు. సంతోషంతో గట్టిగా “ఐ లవ్ యూ కోహ్లీ!” అంటూ అరుస్తూ ఇంట్లోనే పరుగులు పెట్టాడు. ఆనందంతో చొక్కా విప్పి దాన్ని ఊపుతూ పూనకం వచ్చినట్టు ఊగిపోయాడు. టీవీ ముందు పడుకుని విరాట్‌కి సాష్టాంగ నమస్కారం చేశాడు. తనలోని శక్తినంతా ఉపయోగించి అరుస్తూ, చప్పట్లు కొడుతూ, హంగామా చేశాడు.

ఈ ఘటన చూసిన ఇంట్లో పెద్దవాళ్లు కొంత తికమక పడ్డారు. ఫ్యాన్ హంగామా చూసిన ఓ బామ్మ అసలు ఏమైందో అర్థం కాక బెదిరిపోయినట్లు కనిపించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. “ఆ కుర్రాడి ఒంట్లోకి అమ్మవారు పూనిందా అని పక్కనే ఉన్న బామ్మ అనుకుని ఉంటుంది” అంటూ ఒకరు కామెంట్ చేయగా, మరొకరు “ఇది పక్కా కోహ్లీ భక్తుడి హంగామా” అని రాశారు.

ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఫేవరేట్ గా బరిలోకి దిగగా, కోహ్లీపై అభిమానులు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 22 పరుగులు మాత్రమే చేసినా, పాకిస్థాన్‌పై మాత్రం 111 బంతుల్లో 7 ఫోర్లతో 100 పరుగులు చేసి తన ఫామ్‌ని తిరిగి తెచ్చుకున్నాడు. ఈ సెంచరీ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా చేసింది.

కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్‌పై అటు అభిమానులు, ఇటు మాజీ క్రికెటర్లు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక అభిమానుల హంగామా, పూనకం వచ్చిన ఫ్యాన్ వీడియో మాత్రం ఇంటర్నెట్‌లో మాములుగా వైరల్ అవుతోంది!

విరాట్ కోహ్లీ పాకిస్థాన్‌పై సాధించిన ఈ సెంచరీపై క్రికెట్ ప్రపంచం మొత్తం స్పందిస్తోంది. మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు, లెజెండ్స్ అతని ఇన్నింగ్స్‌ను ప్రశంసిస్తున్నారు. సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, వీవీఎస్ లక్ష్మణ్ లాంటి దిగ్గజాలు కోహ్లీ ఆడిన తీరు అద్భుతమని, అతడి క్లాస్ మరోసారి రుజువైందని కొనియాడారు. “ప్రెషర్ మ్యాచ్‌ల్లో కోహ్లీలా ఎవరూ ఆడలేరు, అతను గొప్ప ఆటగాడు” అని సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేయగా, “ఇది విరాట్ స్పెషల్, అతనికి సెంచరీలు సాధించడం కొత్తేమీ కాదు, కానీ ప్రతిసారీ కొత్త రికార్డులను బ్రేక్ చేస్తూనే ఉంటాడు” అని గవాస్కర్ పేర్కొన్నాడు. కోహ్లీ ఇలాంటి ఇన్నింగ్స్‌లు ఆడటమే కాదు, జట్టును ముందుండి నడిపించడం అతని ప్రత్యేకత అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.