AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: ముంబై ఎయిర్ పోర్ట్‌లో ఫ్యాన్స్‌పై కోహ్లీ గరం గరం.. అసలేం జరిగిందంటే..?

బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ కోసం ఫ్యామిలీతో ఆస్ట్రేలియా బయలు దేరి వెళ్లిన విరాట్ కోహ్లీకి ముంబై ఎయిర్ పోర్టులో ఫ్యాన్స్ సెల్పీ అడిగి చికాకు తెప్పించారు. తన ఫ్యామిలీ ఉందని వారిని అక్కడే ఉంచి మీతో సెల్ఫీలు ఎలా తీసుకోగలని అని వారిపై గరం అయ్యాడు. అంతే కాదు తన పిల్లల ఫోటోలను తీయకూడదని వారికి సూచించాడు.

Virat Kohli: ముంబై ఎయిర్ పోర్ట్‌లో ఫ్యాన్స్‌పై కోహ్లీ గరం గరం.. అసలేం జరిగిందంటే..?
Virushka At Airpor
Narsimha
| Edited By: |

Updated on: Nov 10, 2024 | 3:23 PM

Share

టీమిండియా మాజీ కెప్టెన్ స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ ముంబై ఎయిర్ పోర్టులో అసౌకర్యానికి గురయ్యాడు. భారత జట్టు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఆడేందుకు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 22 నుంచి పెర్త్‌ వేదికగా తొలి టెస్టు జరగనుంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా ఐదు టెస్టులు ఆడాల్సి ఉంది.

నవంబర్ 10, 11 తేదీలలో పెర్త్‌కు రెండు బ్యాచ్‌లుగా బయలుదేరి వెళ్లి అక్కడి WACA స్టేడియలో ప్రాక్టిస్ చేయనున్నారు టిమిండియా ప్లేయర్లు. స్టార్ట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ మొదటి బ్యాచ్ లో బయలుదేరి వెళ్లాడు. కోహ్లీ తన కుటుంబంతో కలిసి ఆస్ట్రేలియా బయలు దేరి వెళ్లాడు. ఇక ముంబై ఎయిర్ పోర్టులో విరాట్ కోహ్లీని కుటుంబంతో చూసే సరికి అభిమానులు ఒక్కసారిగా సెల్ఫీల కోసం వెళ్లారు. అభిమానుల తాకిడి పెరగడంతో విరాట్ కోహ్లీ అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తన పిల్లల ఫోటోలను తీయకూడదంటూ కోహ్లీ అభిమానులను రిక్వెస్ట్ చేశాడు. అయినప్పటికి వారు ఎంతకి వెనక్కి తగ్గకపోవడంతో ఒక్కసారి కోహ్లీ ఆగ్రహంతో వారిపై సిరీయస్ అయ్యాడు. మీ అందరితో సెల్ఫీలు తీసుకోవడం కోసం నా కుటుంబంతో ఇక్కడే వెచి ఉండాలా అని వారించాడు ( ఫ్యామిలీ కో రోక్ కే థోడీ హై నా ఫోటో లుంగా తుమ్ లోగోన్ కే సాత్ ).

ఫ్యాన్స్‌తో అసౌకర్యానికి గురైన కోహ్లీ..

న్యూజిలాండ్‌తో జరిగిన 0-3 వైట్‌వాష్ తరువాత భారత్ తిరిగి పుంజుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ గెలిస్తేనే వరుసగా మూడోసారి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకునే అవకాశం ఉండటంతో ఈ టెస్ట్ సిరీస్‌కు ప్రాముఖ్యత ఏర్పడింది. దీంతో సిరీస్ లో సీనియర్ ఆటగాళ్ల ప్రదర్శనం కీలకం కానుంది. ముఖ్యంగా విరాట్ ఫేలవ ఫామ్ తో సతమతమవుతున్నాడు.

ప్రమాదంలో విరాట్ కెరీర్?

టీ20 ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ వన్డే ఫార్మాట్లో నిలకడగా రాణిస్తున్నాడు. అయితే రెడ్ బాల్ క్రికెట్లో పేలవమైన ప్రదర్శన చేస్తుండటంతో ఈ ఫార్మాట్‌లో కోహ్లీ భవిష్యత్తుపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా గత వారం స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్ లో 0-3 వైట్‌వాష్ అవడంతో కొంత మంది సీనియర్లపై వేటు వేయడానికి బీసీసీఐ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆసీస్ తో సిరీస్ ఓడిపోతే సీనియర్లపై వేటు తప్పకపోవచ్చు.

2024లో, కోహ్లి 12 ఇన్నింగ్స్‌లలో 22.78 సగటుతో కేవలం 250 పరుగులు చేయగలిగాడు, ఒక క్యాలెండర్ సంవత్సరంలో కోహ్లీ నమోదు చేసిన అత్యంత చెత్త గుణాంకాలు ఇవే (కనీసం 10 ఇన్నింగ్స్‌లు). వాటిలో 93 పరుగులు న్యూజిలాండ్‌పై వచ్చాయి, సగటు 15.50 గత ఏడేళ్లలో స్వదేశీ సిరీస్‌లో కోహ్లీ నమోదు చేసిన అత్యల్ప సగటు ఇదే. మొత్తం మీద రెండవది.

పేలవమైన ఫామ్ తో విమర్శలు ఎదుర్కుంటున్న కోహ్లీ ఆస్ట్రేలియాతో జరగబోయే ఈ సిరీస్ లో కమ్ బ్యాక్ ఇవ్వొచ్చని అందరు భావిస్తున్నారు. ఎందుకంటే కోహ్లీ కి అస్ట్రేలియా ఎప్పుడు అచ్చొచ్చిన ప్రత్యర్థినే. దీంతో కింగ్ మళ్లీ పుంజుకుంటాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. కోహ్లీ అస్ట్రేలియాలో రెడ్ బాల్ ఫార్మాట్ లో 13 మ్యాచ్‌లు ఆడి ఆరు సెంచరీలతో 54.08 సగటుతో 1352 పరుగులు చేశాడు.