KKR vs LSG, IPL 2024: చెలరేగిన స్టార్క్.. పూరన్ మెరుపులు.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?
Kolkata Knight Riders vs Lucknow Super Giants: ఐపీఎల్ 2024 టోర్నీలో కోల్ కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. మొదట కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో మొదట బ్యాటింగ్ కు దిగిన లక్నో సూపర్ జెయింట్ నిర్ణీత 20 ఓవర్లలో

Kolkata Knight Riders vs Lucknow Super Giants: ఐపీఎల్ 2024 టోర్నీలో కోల్ కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. మొదట కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో మొదట బ్యాటింగ్ కు దిగిన లక్నో సూపర్ జెయింట్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. క్వింటన్ డి కాక్ తొలి రెండు బంతుల్లో ఫోర్లు బాదాడు. అయితే ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. వైభవ్ అరోరా 10 పరుగుల వద్ద ఔటయ్యాడు. దీపక్ హుడా కూడా 8 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్, ఆయుష్ బదానీ 37 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కానీ కేఎల్ రాహుల్ భారీ షాట్‌కు ప్రయత్నించి రసెల్ బౌలింగ్‌లో రమణదీప్ సింగ్‌కి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అతని ఇన్నింగ్స్ 39 పరుగుల వద్ద ముగిసింది. ఆ తర్వాత మార్కస్ స్టోయినిస్‌పై ఎన్నో అంచనాలున్నా పూర్తిగా నిరాశపర్చాడు. 5 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 10 పరుగులు చేసి ఔటయ్యాడీ స్టార్ ఆల్ రౌండర్.
ఆయుష్ బడోని ఇన్నింగ్స్ కూడా 29 పరుగుల వద్ద ముగిసింది. అతను 27 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్స్ సహాయంతో 29 పరుగులు చేశాడు. ఆ తర్వాత నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యాలు ధాటిగా ఆడాడు. ముఖ్యంగా పూరన్ 32 బంతుల్లో 45 పరుగులు చేసి మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్వింటన్ డి కాక్ స్థానంలో అర్షద్ ఖాన్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉన్నాడు. కానీ అతను 4 బంతుల్లో 5 పరుగులు చేసి స్టార్క్ బౌలింగ్ లో పెవిలియన్ చేరారు. కృనాల్ పాండ్యా 7 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కోల్‌కతా నుంచి మిచెల్ స్టార్క్ అత్యుత్తమ బౌలర్ గా నిలిచాడు. అతను 4 ఓవర్లలో 28 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. వైభవ్ అరోరా, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, ఆండ్రీ రస్సెల్ తలో వికెట్ తీశారు.
రెండు జట్ల ప్లేయింగ్-11..
కోల్‌కతా నైట్ రైడర్స్:
శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, అంగ్క్రిష్ రఘువంశీ, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా.
ఇంపాక్ట్ ప్లేయర్స్:
సుయాష్ శర్మ, అనుకుల్ రాయ్, మనీష్ పాండే, రహ్మానుల్లా గుర్బాజ్, రింకూ సింగ్.
లక్నో సూపర్ జెయింట్స్:
కేఎల్ రాహుల్ (కెప్టెన్ మరియు వికెట్ కీపర్), క్వింటన్ డి కాక్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్, షమర్ జోసెఫ్, మొహ్సిన్ ఖాన్.
ఇంపాక్ట్ ప్లేయర్స్:
అర్షద్ ఖాన్, ప్రేరక్ మన్కడ్, ఎం సిద్ధార్థ్, అమిత్ మిశ్రా, కె గౌతం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








