AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ఓవైపు తుఫాన్ బ్యాటింగ్.. మరోవైపు మాస్ డ్యాన్స్.. డబ్ల్యూపీఎల్‌లో దుమ్మురేపిన టీమిండియా ప్లేయర్.. వైరల్ వీడియో..

Jemimah Rodrigues Dance: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ-బెంగళూరు మ్యాచ్‌లో జెమీమా రోడ్రిగ్స్ అభిమానులకు ఫుల్‌గా ఎంటర్టైన్ చేసింది. ఈ వీడియోలు నెట్టింట్లో తెగ వైరలవుతున్నాయి.

Video: ఓవైపు తుఫాన్ బ్యాటింగ్.. మరోవైపు మాస్ డ్యాన్స్.. డబ్ల్యూపీఎల్‌లో దుమ్మురేపిన టీమిండియా ప్లేయర్.. వైరల్ వీడియో..
Jemimah Rodrigues Dance
Venkata Chari
|

Updated on: Mar 06, 2023 | 1:47 PM

Share

మహిళల ప్రీమియర్ లీగ్‌ సందడిగా సాగుతోంది. రెండు రోజుల్లో మూడు మ్యాచ్‌లు జరిగాయి. అయితే ఈ మ్యాచ్‌ల్లో అనేక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. అలాంటి వాటిలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన జెమీమా రోడ్రిగ్స్ వీడియోలు అగ్రస్థానంలో నిలిచాయి. ఢిల్లీ, బెంగళూర్ మధ్య మ్యాచ్ సందర్భంగా, జెమీమా అకస్మాత్తుగా బౌండరీ లైన్‌లో చేసిన సందడి మాములుగా లేదు. ఈ వీడియోల్లో విభిన్న స్టెప్పులతో అభిమానులకు మాంచి ఎంటర్టైన్‌మెంట్ అందించింది. అభిమానులు ఆమె డ్యాన్స్‌లను ఫోన్స్‌ల్లో బంధించి, సోషల్ మీడియాలో షేర్ చేవారు. వీటిని జెమీమా స్వయంగా రీట్వీట్ చేసింది.

5 మార్చి 2023 మొదటి WPL మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు 60 పరుగులతో గెలిచింది. ఢిల్లీ విజయానికి దగ్గరగా ఉన్నప్పుడు, జెమీమా రోడ్రిగ్స్ బౌండరీ లైన్‌పై నిలబడి కొన్ని డ్యాన్స్ మూమెంట్స్‌తో ఆకట్టుకుంది.

ఇవి కూడా చదవండి

కొన్ని రోజుల క్రితం, జెమీమా ఆయుష్మాన్ ఖురానా సోదరుడు అపర్శక్తి ఖురానాతో కలిసి ఒక పాటను రికార్డ్ చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో చేరిన తర్వాత కూడా సహచరుల ముందు గిటార్ వాయిస్తూ పాడుతూ అలరించింది. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పుడు జెమీమా తనకు బ్యాటింగ్ చేయడమే కాకుండా డ్యాన్స్ చేయడం, పాడడం, గిటార్ వాయించడంలోనూ సత్తా ఉందని నిరూపించుకుంది.

ఢిల్లీ-బెంగళూరు జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో కేవలం 2 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేయగా, ఆర్సీబీ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని ఛేదించలేక.. 163 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ఢిల్లీ జట్టు 60 పరుగుల తేడాతో విజయం సాధించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..