AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PBKS vs GT : మా వాళ్ల తప్పేం లేదు.. అంతా ఆ పిచ్ వల్లే.. ఓడినా మాదే పై చేయి అంటున్న శ్రేయస్ అయ్యర్

PBKS vs GT : ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం జరిగిన ఉత్కంఠ పోరులో పంజాబ్ కింగ్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకున్నప్పటికీ పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాత్రం తన జట్టును వెనకేసుకొచ్చారు.

PBKS vs GT : మా వాళ్ల తప్పేం లేదు.. అంతా ఆ పిచ్ వల్లే.. ఓడినా మాదే పై చేయి అంటున్న శ్రేయస్ అయ్యర్
PBKS vs GT
Rakesh
|

Updated on: May 04, 2026 | 11:26 AM

Share

PBKS vs GT : ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం జరిగిన ఉత్కంఠ పోరులో పంజాబ్ కింగ్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకున్నప్పటికీ పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాత్రం తన జట్టును వెనకేసుకొచ్చారు. మ్యాచ్ ఓడిపోయినా ఆఖరి ఓవర్ వరకు పోరాడిన తమ ఆటగాళ్లను మెచ్చుకోవాల్సిందేనని ఆయన చెప్పుకొచ్చారు. ఈ ఓటమికి తన ఆటగాళ్లను నిందించకుండా, పిచ్ పరిస్థితులే ప్రధాన కారణమని అయ్యర్ పేర్కొనడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

మ్యాచ్ ముగిసిన తర్వాత శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. తమ జట్టు కనబరిచిన పట్టుదలను ప్రశంసించారు. “ఈ పిచ్‌పై 163 పరుగులు అనేది నిజంగా గొప్ప స్కోరు. ఆరంభంలో బంతి బాగా స్వింగ్ అయ్యింది. గుజరాత్ బౌలర్లు పిచ్ పరిస్థితులను చక్కగా వాడుకున్నారు. మేము పవర్ ప్లేలోనే 4 వికెట్లు కోల్పోయినప్పటికీ, అక్కడి నుంచి 160 దాటడం అంటే మా బ్యాటర్ల కృషిని అభినందించాల్సిందే. ఆఖరి ఓవర్ వరకు మ్యాచ్ తీసుకురావడం మా పోరాట పటిమకు నిదర్శనం” అని అయ్యర్ చెప్పుకొచ్చారు.

ఈ ఓటమికి పిచ్ వింత ప్రవర్తనే కారణమని అయ్యర్ విశ్లేషించారు. “బౌన్స్ అనేది ఒకేలా లేదు. అందుకే మిడ్ వికెట్ లేదా పుల్ షాట్లు ఆడటం కష్టమైంది. బ్యాటింగ్‌కు ఇది సరైన వికెట్ కాదు. సరైన లెంత్‌లో బంతులు వేయడంలో మేము కొంచెం వెనుకబడ్డాం. గత మ్యాచ్‌లో భారీగా పరుగులు సమర్పించుకున్న మా బౌలర్లు, ఇక్కడ అద్భుతంగా పుంజుకోవడం వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. విజయానికి చేరువగా వచ్చినా అదృష్టం కలిసి రాలేదు” అని ఆయన వివరించారు.

అపజయాల గురించి ఎక్కువగా ఆలోచించకుండా ముందుకు వెళ్లడమే ముఖ్యమని అయ్యర్ తెలిపారు. “మేము ఇంకా పాయింట్ల పట్టికలో టాప్ పొజిషన్‌లోనే ఉన్నాం, అది మాకు సానుకూల అంశం. ఈ గేమ్ నుంచి లోపాలను సరిదిద్దుకుని తదుపరి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌లో 2 పాయింట్లు సాధించడమే మా లక్ష్యం. మా కుర్రాళ్లు మైదానం బయట కూడా చాలా కష్టపడుతున్నారు. సరైన వైఖరి, పట్టుదల ఉంటే ఫలితాలు వాటంతట అవే వస్తాయి” అని ధీమా వ్యక్తం చేశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us