AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL Mega Auction 2025: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన స్పిన్నర్.. యూజీ చాహల్ ఇంత పర్సంటేజ్ హైక్ తీసుకోబోతున్నాడా..?

ఐపీఎల్ వేలం చరిత్రలోనే అత్యంత ఖరీదైన స్పిన్నర్‌గా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ నిలిచాడు. 34 ఏళ్ల చహల్‌ ను 18 కోట్లకు PBKS కొనుగోలు చేసింది. అతని మునుపటి IPL జీతం ₹6.5 కోట్లు కావడంతో అతను దాదాపు 177% జీతం పెంపును అందుకోనున్నాడు. IPL మెగా వేలానికి ముందు RR అతన్ని విడుదల చేసింది.

IPL Mega Auction 2025: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన స్పిన్నర్.. యూజీ చాహల్ ఇంత పర్సంటేజ్ హైక్ తీసుకోబోతున్నాడా..?
Chahal
Narsimha
|

Updated on: Nov 24, 2024 | 6:15 PM

Share

భారత క్రికెట్‌ లో అనేక మంది ఆటగాళ్లు తమ ప్రతిభతో అదరగొడుతున్న.. అందులో ముఖ్యంగా యుజ్వేంద్ర చహల్‌ బౌలింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. చహల్‌ గత కొన్ని సీజన్లలో తన బౌలింగ్‌తో ఐపీఎల్ లో కీలక పాత్ర పోషించారు. తాజాగా ఐపీఎల్ మెగా వేలంలో చాహల్ ప్రతిభకు సరైన గుర్తింపు దక్కింది.

ఐపీఎల్ 2025 ఆక్షన్‌లో అద్భుతమైన ప్రదర్శనను కనబరిచిన యుజవేంద్ర చాహల్‌ను పంజాబ్ కింగ్స్ (PBKS) భారీ ధరలో రూ. 18 కోట్లకు కొనుగోలు చేసింది. ఈసారి ఐపీఎల్ 2025 వేలంలో, యుజ్వేంద్ర చహల్ కు క్రితం సారి కంటే 177% హైక్ తో పారితోషికం అందుకోనున్నాడు.

ఐపీఎల్‌లో సీనియర్ క్రికెటర్ అయిన చాహల్, 2024 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఆ సీజన్లో అతను ప్ర‌తిష్టాత్మక పర్పుల్ క్యాప్‌ను గెలుచుకున్నాడు, అంటే అతను అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. రాజస్థాన్ రాయల్స్ ఈ స్పిన్నర్‌ను విడిచిపెట్టిన విషయం షాక్ కలిగించినప్పటికీ, అన్ని ఫ్రాంచైజీలకు ఈ నిర్ణయం ఒక గొప్ప అవకాశంగా అనిపించింది.

ఐపీఎల్ ఆక్షన్ 2025లో బిడ్డింగ్  లో యుజవేంద్ర చాహల్‌ను రూ. 18 కోట్ల భారీ ధరకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది.

బిడ్డింగ్ ప్రారంభమైనప్పుడు చాహల్‌కు బేస్ ధర రూ. 2 కోట్లుగా నిర్ణయించబడింది. ఈ ధరతో పోటీ మొదలయ్యే సరికి గుజరాత్ టైటన్స్ మొదట పోటిలోకి దూసుకెళ్లింది, కానీ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) వెంటనే పోటీలో చేరి బిడ్‌ను ముందుకు తీసుకెళ్లింది. ఈ పోటీ మరింత చురుకుగా మారి బిడ్ రూ. 5.75 కోట్ల వరకు చేరింది.

ఇక్కడ పంజాబ్ కింగ్స్ క్షణాల్లో రంగంలోకి ప్రవేశించి, బిడ్‌ను రూ. 6 కోట్లకు తీసుకెళ్లింది. గుజరాత్ టైటన్స్ వెనక్కి తగ్గకుండా, బిడ్‌ను రూ. 7.25 కోట్లకు పెంచింది. తర్వాత, లక్నో సూపర్ జైంట్స్ (LSG) ఈ పోటీలో భాగమై బిడ్‌ను రూ. 10 కోట్ల దాటించాయి.

ఈ దశలో, మరింత ఉత్కంఠతో బిడ్ కొనసాగే సమయంలో పంజాబ్ కింగ్స్, LSGతో పాటు బిడ్‌ను రూ. 14 కోట్లకు తీసుకెళ్లారు. ఈ సమయంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కూడా బిడ్డింగ్‌లో చేరి, ధరను రూ. 14.25 కోట్లకు పెంచింది. కానీ పంజాబ్ కింగ్స్ మాత్రం వెనకడుగు వేయలేదు. అప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) కూడా పోటీలోకి చేరుకుని బిడ్‌ను రూ. 17 కోట్లకు పెంచింది.

అప్పుడు పోటీ మరింత ఆసక్తికరంగా మారింది, చివరగా పంజాబ్ కింగ్స్ మరోసారి బిడ్ పెంచి, చాహల్‌ను రూ. 18 కోట్లకు సొంతం చేసుకుంది. అతను ఈ సీజన్‌లో మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వడం ఖాయం. 200 ఐపీఎల్ వికెట్లను అందుకున్న తొలి బౌలర్‌గా చాహల్ ఐపీఎల్‌లో తన ప్రతిభను నిరూపించుకున్నాడు. ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్‌తో అతని కొత్త అధ్యాయం ఈ సీజన్‌కు కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

చాహల్, తన కెరీర్‌లో ఇప్పటివరకు 160 మ్యాచ్‌ల్లో 7.84 ఎకానమీ రేటుతో 205 వికెట్లు తీసి ఐపీఎల్ చరిత్రలో గొప్ప స్పిన్నర్‌గా నిలిచాడు. 2022లో రాయల్స్ తరపున పర్పుల్ క్యాప్ గెలుచుకున్న చాహల్, ఆ సీజన్‌లో 27 వికెట్లు తీసి సత్తా చాటాడు. 2023లో చాహల్ 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలిచాడు, దాంతో  చాహల్ ప్రాముఖ్యతను మరింత పెరిగింది.

చాహల్ తన ఐపీఎల్ ప్రయాణాన్ని ముంబై ఇండియన్స్‌తో ప్రారంభించాడు, ఆపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తన పేరును నిలబెట్టుకుని, తరువాత రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడి, ఇప్పుడు పంజాబ్ కింగ్స్ జట్టులో చేరాడు. పంజాబ్ తరపున అతని చేరిక జట్టుకు బౌలింగ్ విభాగంలో ప్రాముఖ్యతను పెంచుతుంది.

ఇంతకుముందు డ్వేన్ బ్రావో అత్యధిక వికెట్ల రికార్డును బద్దలు కొట్టిన చాహల్, ఇప్పటికీ భారత టీ20 జట్టులో అగ్రశ్రేణి బౌలర్‌గా ఉన్నాడు. ఐపీఎల్‌లో తన ప్రదర్శనలతో పాటు, అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా అతను తన ప్రత్యేకతను చాటుకున్నాడు. పంజాబ్ కింగ్స్ జట్టులో చాహల్ చేరిక ఐపీఎల్ 2025 సీజన్‌ను మరింత ఉత్కంఠభరితంగా మార్చనుంది.